Credit Card: మీరు క్రెడిట్ కార్డు నుంచి ఇంటి, ఆఫీస్ అద్దె చెల్లిస్తున్నారా..? నష్టమే..!
Credit Card: గడువు తేదీలోగా ఇంటి అద్దె లేదా ఆఫీసు అద్దె చెల్లించాలి. జేబులో డబ్బులున్నా, ఖాతాలో ఉన్నా అద్దె చెల్లించాల్సిందే. సమయానికి డబ్బులు లేకుంటే ఎవరివద్దనైనా..

Credit Card: గడువు తేదీలోగా ఇంటి అద్దె లేదా ఆఫీసు అద్దె చెల్లించాలి. జేబులో డబ్బులున్నా, ఖాతాలో ఉన్నా అద్దె చెల్లించాల్సిందే. సమయానికి డబ్బులు లేకుంటే ఎవరివద్దనైనా తీసుకుంటారు. వారు కూడా అప్పు ఇచ్చే డబ్బులు కూడా నగదు కాకుండా ఆన్‌లైన్‌లోనే పంపిస్తున్నారు. ఇక కొంత మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ , మరికొందరు కార్డు ద్వారా అద్దె చెల్లిస్తుంటారు. చాలా మంది క్రెడిట్ కార్డు ద్వారా కూడా డబ్బు చెల్లిస్తారు. ఈ అద్దె డబ్బులు చెల్లించేందుకు థర్డ్ పార్టీ యాప్ నుండి లేదా బ్యాంక్ మొబైల్ యాప్ నుండి వంటివి ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డ్ నుండి అద్దె చెల్లించడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకోండి.
ముందుగా, ప్రజలు క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె ఎందుకు చెల్లించాలనుకుంటున్నారో తెలుసుకోండి. దీనికి చాలా కారణాలున్నాయి. డబ్బు జేబులో నుండి లేదా బ్యాంకు ఖాతా నుండి చెల్లించాల్సిన అవసరం ఉండకుండా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించినట్లయితే వచ్చే నెల ఆ చెల్లింపుకు సంబంధించిన బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. దీని కారణంగా తక్షణ డబ్బు అవసరం అనేది తీరిపోతుంది. క్రెడిట్ కార్డ్ నుంచి ఎక్కువ ఖర్చు చేసినందుకు బ్యాంకులు లేదా కంపెనీలు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ మొదలైనవి ఇస్తాయి. అదనపు డబ్బు సంపాదించడానికి ఇది ఒక మార్గం. ప్రజలు కూడా ఈ ప్రలోభాలకు లోనుకావడం, క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లించడం సమర్థనీయమని భావిస్తారు. అయితే ఇది లాభదాయకంగా ఉన్నా కొంత నష్టం కూడా ఉంటుంది.
అదనపు ఛార్జీలు:




లాభం దృష్ట్యా, క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించడం సరికాదు. క్రెడిట్ కార్డ్‌తో థర్డ్ పార్టీ యాప్‌ను కనెక్ట్ చేయడం ద్వారా మీరు అద్దె చెల్లించారని అనుకుందాం. ఆపై దానికి ప్రత్యేక ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఈ ప్రాసెసింగ్ ఫీజు సర్వీస్ ఛార్జీగా వసూలు చేయబడుతుంది. Cred వంటి యాప్ దాని వినియోగదారులకు క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లించడానికి అనుమతిస్తుంది. కానీ దాని సర్వీస్ ఛార్జ్ 1-1.5 శాతం వరకు ఉంటుంది. ప్రతి లావాదేవీపై ఈ సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. మీ నెలవారీ అద్దె రూ. 25,000 అనుకుందాం. అప్పుడు మీరు అదనంగా 1.5 శాతం అంటే ప్రతి నెల అద్దెపై రూ. 375 అదనంగా చెల్లించాలి. దీంతో మీ ఛార్జీ రూ.25,000కి బదులుగా రూ.25,375 అవుతుంది. ఏడాది మొత్తానికి అదనపు చెల్లింపు చూస్తే అద్దె కాకుండా రూ.4500 వెచ్చించాల్సి వస్తోంది. ఇది చిన్న మొత్తం కాదు.
క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్:
మీ క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకపోతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. మీ క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేసి మీ కార్డు బిల్లు సకాలంలో చెల్లించకపోతే మీకు అదనపు పెనాల్టీతో పాటు క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. అప్పుల భారం మిమ్మల్ని పెద్ద ఉచ్చులో పడేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి