LIC Shares: పెట్టుబడిదారులకు చుక్కలు చూపిస్తున్న ఎల్‌ఐసీ.. 23 శాతం పడిపోయిన స్టాక్‌..

దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా వచ్చిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తుంది...

LIC Shares: పెట్టుబడిదారులకు చుక్కలు చూపిస్తున్న ఎల్‌ఐసీ.. 23 శాతం పడిపోయిన స్టాక్‌..
LIC
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 14, 2022 | 7:49 AM

దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా వచ్చిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ స్టాక్‌ లిస్ట్‌ అయిన నుంచి దాదాపు 23 శాతం పడిపోయింది. ఇష్యూ ప్రైస్‌ నుంచి 29 శాతం తగ్గింది. ఎల్‌ఐసీ షేర్లు మే 17న స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాయి. అప్పటి నుంచి ఈ స్టాక్‌ పడుతూనే ఉంది. ఎల్‌ఐసీలో రిటైల్‌, డీఐఐలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. ఎఫ్‌ఐఐలు తక్కువగా పెట్టుబడి పెట్టారు. జూన్‌ 13 యాంకర్‌ పెట్టుబడిదారుల లాక్‌ ఇన్‌ పిరియడ్‌ ముగియడంతో సోమవారం ఎల్‌ఐసీ దాదాపు 5.66 శాతం పడిపోయింది. సోమవారం ఒక్క ఎల్‌ఐసీ స్టాకే కాకుండా దాదాపు అన్ని కంపెనీలు నష్టాల్లో ముగిశాయి.

అయితే ఎల్‌ఐసీ షేర్లు వరుసగా పదో సెషన్‌లో కూడా పడిపోయాయి. దీంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌ఐసీ ఇష్యూ ప్రైస్‌ రూ. 949 కాగా మే 17న రూ.875లకు లిస్టయింది. ఆ తర్వాత పడుతూ సోమవారం 669 వద్ద ముగిసింది. ఓవైపు పెట్టుబడిదారులు ఆందోళన చెందుతుంటే.. కంపెనీకి చెందిన అధికారులు మాత్రమే ఎలాంటి భయం వద్దని సూచిస్తున్నారు. అయితే కంపెనీ ఎలా గ్రో అవుతుందో అధికారులు చెప్పలేకపోతున్నారని డిస్కౌంట్‌ బ్రోకరేజ్‌ ప్రాఫిట్‌మార్ట్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ అవినాష్‌ గోరక్షకర్‌ అన్నారు.