PAN Card: పాన్‌కార్డు విషయంలో మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకోనుందా..? ఇక అలాంటి బాధలు ఉండవా!

Budget 2023: పాన్‌కార్డు.. దీని గురించి అందరికి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే పాన్‌కార్డు తప్పనిసరి..

PAN Card: పాన్‌కార్డు విషయంలో మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకోనుందా..? ఇక అలాంటి బాధలు ఉండవా!
Pan Card
Follow us

|

Updated on: Jan 16, 2023 | 1:44 PM

Budget 2023: పాన్‌కార్డు.. దీని గురించి అందరికి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే పాన్‌కార్డు తప్పనిసరి. బ్యాంకు ఖాతా తీయడం నుంచి లావాదేవీలు, ఇతర ఆర్థికపరమైన పనుల కోసం పాన్‌కార్డు తప్పనిసరి అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పాన్‌కార్డు కలిగి ఉంటున్నారు. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఉద్యోగులు, వ్యాపారులు, కార్పొరేట్‌ కంపెనీలు ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయడానికి పాన్‌కార్డు తప్పనిసరి కావాల్సిందే. ఇక నిబంధనలు మారనున్నాయి. ఏ వ్యాపార లావాదేవీలు జరపాలన్నా పాన్‌కార్డు కావాల్సి ఉంటుంది. ఇక కేంద్రం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సంమర్పించనుంది. ఈ నేపథ్యంలో పాన్‌కార్డుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా వ్యాపారాలు, ఆర్థికలావాదేవీలకు సంబంధించిన పనులకు పాన్‌కార్డుతో పాటు ఇతర పత్రాలు కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్ని రకాల వ్యాపారాల గుర్తింపు ప్రక్రియకు పాన్‌కార్డు తప్పనిసరి చేయనుంది కేంద్రం. 2023-24కు సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఇందుకోసం లీగ‌ల్ ఫ్రేమ్‌వ‌ర్క్ ప్రతిపాదిస్తార‌ని స‌మాచారం.

ఇప్పటి వరకు వివిధ వ్యాపార లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు, ఇన్వెస్టర్లు ఆయా ప్రాజెక్టులకు క్లియరెన్స్‌, అధికారులు, శాఖల నుంచి అప్రూవల్‌ పొందేందుకు నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టమ్‌ కింద ఒకటి కంటే ఎక్కువ గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. ఇక నుంచి ఇన్వెస్టర్లు, వ్యాపారులకు అలాంటి బాధ లేకుండా పాన్‌కార్డు ఒక్కటే సమర్పించేలా మంత్రి నిర్మలాసీతామన్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఫైనాన్స్‌ యాక్ట్‌-2023లో నిబంధన చేరుస్తారని తెలుస్తోంది. ఏదేనీ సంస్థను గుర్తించాలంటే పాన్ కార్డు ఉంటే చాలు అనే నిబంధ‌నకు చ‌ట్టబ‌ద్ధత చేకూర్చనున్నట్లు సమాచారం.

ఈ విషయమై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుద‌ల‌కు కేంద్ర ఆర్థిక‌శాఖ రెవెన్యూ విభాగం అద‌న‌పు కార్యద‌ర్శి నేతృత్వంలో వ‌ర్కింగ్ గ్రూప్ సిఫార‌సులు చేసింది. ఆ సిఫార‌సుల ప్రకార‌మే బిజినెస్ లావాదేవీల గుర్తింపున‌కు పాన్ కార్డ్ చ‌ట్టబ‌ద్ధం చేస్తార‌ని సమాచారం. ఇదే నిబంధనల అమలులోకి తీసుకువస్తే బిజినెస్‌ కంపెనీలు, కార్పొరేట్ సంస్థ రిజిస్ట్రేష‌న్‌, లైసెన్స్‌, దాని ప్రారంభానికి అధికారిక క్లియ‌రెన్స్‌ల‌కు పాన్ కార్డు ప్రాధ‌మిక గుర్తింపు కార్డుగా ప‌రిగ‌ణిస్తారు. ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో