LIC Policy Bond: మీ ఎల్‌ఐసీ పాలసీ బాండ్‌ పేపర్‌ పోయిందా..? మరి ఏం చేయాలి..? వేరే డాక్యుమెంట్‌ పొందడం ఎలా?

ఈ రోజుల్లో ఎల్‌ఐసీ పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. కరోనా మహమ్మారి నుంచి పాలసీల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది..

LIC Policy Bond: మీ ఎల్‌ఐసీ పాలసీ బాండ్‌ పేపర్‌ పోయిందా..? మరి ఏం చేయాలి..? వేరే డాక్యుమెంట్‌ పొందడం ఎలా?
Lic Policy Bond
Follow us
Subhash Goud

|

Updated on: Jan 16, 2023 | 12:39 PM

ఈ రోజుల్లో ఎల్‌ఐసీ పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. కరోనా మహమ్మారి నుంచి పాలసీల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే పాలసీ తీసుకున్న సమయంలో సంస్థ ఓ బాండ్‌ను జారీ చేస్తుంది. అందులో పాలసీదారుని పేరు, నామినీ పేరు, పాలసీ నంబర్‌, పాలసీకి సంబంధించిన వివరాలు ఉంటాయి. అయితే పాలసీ తీసుకున్న తర్వాత బాండ్‌ను జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బాండ్‌ పోయినట్లయితే ఇబ్బందులు పడుతుంటారు. పాలసీ సమయంలో లోన్‌ పొందడం, క్లెయిమ్‌ చేయడం లాంటి సయయంలో ఈ డాక్యుమెంటే కీలకం. కొన్ని సందర్భాలలో పాలసీ డాక్యుమెంట్‌ పోతుంటుంది.

ఏదైనా అగ్ని ప్రమాదంలో డాక్యుమెంట్‌ కాలిపోవడం, వరదల సమయంలో, ఇతర కారణాల వల్లనో పాలసీకి సంబంధించి డాక్యుమెంట్‌ పోతుటుంది. మరి అలాంటి సమయంలో టెన్షన్‌ పడుతుంటారు. ఇలా బాండ్‌ పోయినట్లయితే ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదిస్తే డూప్లికేట్‌ బాండ్‌ను జారీ చేస్తుంది. మీ బాండ్‌ పోయినట్లయితే ముందుగా మీ ఏజెంట్‌కు తెలియజేయాలి. లేదంటే మీ బ్రాంచ్‌ను సందర్శించి పాలసీ బాండ్‌ పోయిన విషయాన్ని తెలియజేయాలి. అయితే డూప్లికేట్‌ బాండ్‌ అయినా అది ఒరిజినల్‌గానే పని చేస్తుంది. మరి డూప్లికేట్‌ బాండ్‌ ఎలా పొందాలో తెలుసుకుందాం.

ఒక వేళ మీ పాలసీ డాక్యుమెంట్‌ పోయినట్లయితే ఎల్‌ఐసీ బ్రాంచ్‌ను సందర్శించాలి. డూప్లికేట్‌ బాండ్‌ కోసం ప్రీమియం చెల్లింపులకు సంబంధించి పాత రశీదులను సమర్పించాలి. పాలసీ విలువను బట్టి స్టాంప్‌ డ్యూటీ చెల్లించి ఇండెమ్నిటీ బాండ్‌ను నోటరీ చేయించాలి. ఫోటో ఐడెంటిటీ కింద పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది. రెసిడెన్సీ ఫ్రూట్‌ కింద టెలిఫోన్‌ నంబర్‌ బిల్లు, బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌, ఎలక్ట్రిసిటీ బిల్లు, రేషన్‌కార్డు వంటి గుర్తింపు పత్రాలను అందించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్రాంచ్‌ కౌంటర్‌లో పాలసీ ప్రిపరేషన్‌ ఛార్జీల కింద కొంత ఛార్జీ చెల్లిస్తే మీకు డూప్లికేట్‌ బాండ్‌ను ఎల్‌ఐసీ జారీ చేస్తుంది. ఎల్‌ఐసీ నుంచి రుణం కోసం ఇతర వాటి కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ డూప్లికేట్‌ డాక్యుమెంట్‌ను చూపించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.