Home Loan: ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ లేకపోతే హోమ్ లోన్ ఇవ్వరా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఓ టెక్స్‌టైల్‌ కంపెనీలో పనిచేస్తున్న పవన్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ప్లాట్‌ కొనుగోలు చేశాడు. ఇల్లు కట్టుకునేందుకు బ్యాంకు లోన్‌ కోసం అప్లై చేశాడు. లోన్ తీసుకునే సమయంలో బ్యాంకు సిబ్బంది అతడిని చాలా డాక్యుమెంట్లు..

Home Loan: ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ లేకపోతే హోమ్ లోన్ ఇవ్వరా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
Home Loan
Follow us

|

Updated on: Jan 15, 2023 | 2:51 PM

ఓ టెక్స్‌టైల్‌ కంపెనీలో పనిచేస్తున్న పవన్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ప్లాట్‌ కొనుగోలు చేశాడు. ఇల్లు కట్టుకునేందుకు బ్యాంకు లోన్‌ కోసం అప్లై చేశాడు. లోన్ తీసుకునే సమయంలో బ్యాంకు సిబ్బంది అతడిని చాలా డాక్యుమెంట్లు అడిగారు. పవన్‌ వద్ద గత మూడేళ్లుగా ఫైల్ చేస్తున్న ఐటీఆర్‌ ఫైల్‌తో పాటు మిగతా అన్ని పత్రాలు ఉన్నాయి. కాకపోతే ఆయన లోన్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పటికి ప్రస్తుత ఐటీఆర్‌ ఇంకా ఫైల్‌ చేయలేదు. బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు, అనేక రకాల డాక్యుమెంట్‌లను సమర్పించాల్సిందిగా బ్యాంకులు కోరుతాయి. వీటిలో గత మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు ప్రముఖమైనవి. హోమ్ లోన్ మంజూరు చేయడానికి ముందు బ్యాంకులు ITR ఫైలింగ్ డాక్యుమెంట్‌లను ఎందుకు అడుగుతాయి? రిటర్న్‌లు దాఖలు చేయకుండా రుణం ఎలా పొందవచ్చు? ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

హోమ్ లోన్ అనేది 10 నుండి 20 సంవత్సరాల వరకు దీర్ఘకాలం ఉంటుంది. బ్యాంకులు దానిని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్న వ్యక్తికి మాత్రమే రుణం ఇస్తాయి. ఐటీఆర్‌ అనేది మీ వార్షిక ఆదాయానికి సంబంధించిన డాక్యుమెంట్‌. దీనిని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక సంస్థలోవ ఆదాయ రుజువుగా అంగీకరించడం జరుగుతుంది. అందుకే లోన్ ఇవ్వడానికి గత మూడేళ్ల ఐటీఆర్‌ డాక్యుమెంట్లను అడుగుతారు. మీరు క్రమం తప్పకుండా ఐటీఆర్‌ ఫైల్ చేస్తే వార్షిక ఆదాయం ఆధారంగా మీరు సులభంగా లోన్ పొందుతారు. కానీ ఐటీఆర్‌ లేకుండా రుణం పొందవచ్చా అంటే.. దానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రయత్నిస్తే పొందే ఆస్కారం ఉంటుంది.

మీకు జీతం రూపంలో రెగ్యులర్ ఆదాయం ఉంటే .. ప్రతి సంవత్సరం ఐటీఆర్‌ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఐటీఆర్‌ ఇంకా నమోదు చేయలేదనుకోండి.. అప్పుడు మీ సంస్థ నుంచి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని పొందండి. దానితో బ్యాంక్ పాస్‌బుక్ తీసుకోండి. మీ బ్యాంక్ ఖాతాలో రెగ్యులర్ ట్రాన్సాక్షన్‌లు ఉండి ఖాతాలో డబ్బు ఉన్నట్లయితే మీకు రుణం ఇవ్వడానికి బ్యాంకు సిద్ధంగా ఉండవచ్చు. ఈ పరిస్థితిలో మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అనేది చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

అయితే పెద్ద లోన్స్ కోసం బ్యాంకులు ఐటీఆర్‌ ఫైల్‌ని అడుగుతాయి. అయితే పవన్‌ తన ప్లాట్‌లో ఇల్లు కట్టుకోవడానికి రుణం తీసుకుంటున్నారు. అది సెక్యూర్డ్‌ లోన్‌ కేటగిరీలోకి వస్తుందని మాజీ బ్యాంకర్‌ సురేష్‌ బన్సల్‌ అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్లాట్‌ విలువ కంటే లోన్ తక్కువగా ఉంటే బ్యాంకు ఆమోదిస్తుంది. లేదా ప్లాట్‌ ఖరీదు కంటే ఎక్కువ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే సదరు వ్యక్తి బ్యాంకుకు కొన్ని పత్రాలను అందించాల్సి ఉంటుంది. అవేంటంటే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, జీవిత బీమా పత్రాలు, బంగదారం వంటివి అందించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా బ్యాంకులు ఐటీఆర్‌ లేకుండా రుణం మంజూరు చేయవచ్చు.

అయితే లోన్స్ ఇవ్వడంలో బ్యాంకులు ఎన్నో పరిశీనలు చేస్తాయి. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి సకాలంలో చెల్లిస్తాడా ? లేడా అనే విషయాన్ని కచ్చితంగా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ సందర్భంగా వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు జితేంద్ర సోలంకి మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో ప్రమాణాల విషయంలో రాజీపడవని.. హౌసింగ్ ఫైనాన్స్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, అంటే ఎన్‌బీఎఫ్‌సీలు.. తక్కువ ఆదాయంతో ఐటీఆర్‌ లేకుండా కూడా రుణాలు ఇస్తాయని చెప్పారు. ఐటీఆర్‌ ఫైల్ లేని వ్యక్తులు ఎన్‌బీఎఫ్‌సీతో మాట్లాడాలి. ఈ కంపెనీలు వినియోగదారులకు సులభమైన నిబంధనలపై రుణాలు అందిస్తాయి. బ్యాంకుతో పోలిస్తే ఈ రుణం కొంచెం ఖరీదైనది అయినప్పటికీ రుణం పొందే అవకాశం ఉంటుంది.

అలాగే, మీకు ఏదైనా బ్యాంకులో పాత ఖాతా లేదా సాలరీ అ కౌంట్‌ ఉంటే అప్పుడు మీరు బ్యాంక్ మేనేజర్‌ని కలవాలి. కొన్ని బ్యాంకులు కూడా కస్టమర్ మంచి ప్రవర్తన ఆధారంగా రుణం ఇస్తాయి. ఎన్‌బీఎఫ్‌సీతో పోలిస్తే ఈ రుణం చౌకగా లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..