PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఆ రోజే ఖాతాల్లో పీఎం కిసాన్‌ యోజన డబ్బులు

రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సర్కార్‌ అనేక పథకాలను అమలు చేస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకాలలో..

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌..  ఆ రోజే ఖాతాల్లో పీఎం కిసాన్‌ యోజన డబ్బులు
ఇలా చేయండి.. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. కుడి వైపున ఫార్మర్ కార్నర్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
Follow us

|

Updated on: Jan 15, 2023 | 8:01 PM

రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సర్కార్‌ అనేక పథకాలను అమలు చేస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకాలలో ఒకటి. ఈ పథకం కింద దేశంలోని కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం 6 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేస్తారు. ఇది నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుండి ప్రతి నాల్గవ నెలలో ఏడాది పొడవునా 3 వాయిదాల ద్వారా జమ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ పథకం నుండి రైతులు 12 వాయిదాలను పొందారు. రైతులు ఇప్పుడు 13వ విడత కోసం ఎదురు చూస్తున్నారు.

మీడియా నివేదికల ప్రకారం.. ప్రధానమంత్రి కిసాన్ యోజన 13వ విడత డబ్బులు జనవరి 23, 2023న కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా. దీనిని ప్రభుత్వం శౌర్య దినోత్సవంగా జరుపుకుంటోంది. అందువల్ల, ఈ రోజును ప్రత్యేకంగా పరిగణించి ప్రధాని మోదీ జనవరి 23న రైతుల ఖాతాకు నేరుగా రూ. 2,000 మొత్తాన్ని జమ చేయవచ్చు. ఇదే సమయంలో కొన్ని కారణాల వల్ల కొందరు రైతులకు 12వ విడత నిలిచిపోయింది. ఇప్పుడు ఈ విడతతో పాటు 13వ విడత అందుకునే అవకాశం ఉంది.

కొందరు రైతులు ఇప్పటి వరకే కేవైసీ పూర్తి చేయలేదు. అలాంటి వారు ఈ డబ్బులు అందుకునే అవకాశం ఉండదు. 12వ విడతలాగా 13వ విడత డబ్బులు నిలిచిపోవచ్చని పలువురు రైతులు భయాందోళన చెందుతున్నారని, దీని కోసం ఆ రైతులు ఒకసారి రైతు వ్యవసాయ శాఖ అధికారి ద్వారా లేదా ఆన్‌లైన్ అగ్రికల్చర్ పోర్టల్ ద్వారా సమాచారం పొందాలన్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం అనర్హుల జాబితాను సిద్ధం చేసింది. అలాంటి వారికి ఈ నిధులు అందవు.

ఇవి కూడా చదవండి

హెల్ప్‌లైన్ నంబర్‌

మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానిని త్వరగా పరిష్కారం పొందవచ్చు. దీని కోసం మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఐడిలో మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092ను సంప్రదించవచ్చు. మీరు మీ ఫిర్యాదును ఇ-మెయిల్ ID ( pmkisan-ict@gov.in )లో కూడా మెయిల్ చేయవచ్చు. అలాగే మీరు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోకుంటే pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నమోదు చేసుకోండి. అలాగే పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్న రైతులు ఇ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ లేకపోతే 13వ విడత డబ్బులు అందవని గుర్తించుకోవాలి.

మీ వాయిదాను తనిఖీ చేయడం  ఎలా?

  • ఇన్‌స్టాల్‌మెంట్ స్థితిని చూడటానికి మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • ఇప్పుడు ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • అప్పుడు కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
  • దీని తర్వాత మీరు మీ స్థితి గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..