Olectra – Hydrogen Bus: దేశ వ్యాప్తంగా పరుగులు పెట్టనున్న ఒలెక్ట్రా హైడ్రోజన్ బస్సులు.. వీటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి..
దేశ వ్యాప్తంగా ఒలెక్ట్రా హైడ్రోజన్ బస్సులు రోడ్లెక్కనున్నాయి. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ అయిన ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) భారత మార్కెట్‌కు..
దేశ వ్యాప్తంగా ఒలెక్ట్రా హైడ్రోజన్ బస్సులు రోడ్లెక్కనున్నాయి. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ అయిన ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) భారత మార్కెట్‌కు ఈ రవాణా వ్యవస్థను పరిచయం చేయనుంది. రిలయన్స్‌తో సాంకేతిక భాగస్వామ్యంతో ఓలెక్ట్రా తన హైడ్రోజన్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ బస్సుల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. పర్యావరణహితమైన హైడ్రోజన్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ సిద్ధమైంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థే ఓజీఎల్. త్వరలోనే ఈ ఒలెక్ట్రా హైడ్రోజన్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. పర్యావరణానికి హితంగా ఉండే ప్రజా రవాణా వ్యవస్థను అందరికీ చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఒలెక్ట్రా ప్రకటించింది. రిలయన్స్ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో హైడ్రోజన్ బస్సులను ఒలెక్ట్రా రూపొందించింది. ఈ బస్సుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.
పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు:
అయితే డీజిల్, పెట్రోల్, సీఎన్‍జీ వాహనాల వల్ల వాతావరణం కాలుష్యం అవుతోందని, హైడ్రోజన్ వాహనాలు కర్బన రహితంగా ఉంటాయని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓఎల్‌జీ) తెలిపింది. అందుకే హైడ్రోజన్ వాహనాలు పర్యావరణానికి ఎలాంటి హాని చేయవని చెబుతోంది. ప్రజా రవాణాకు హైడ్రోజన్ బస్సులు వినియోగిస్తే వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతోంది. పెట్రోల్, డీజిల్ సహా చమురు నిల్వలు ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతుండటం, వాటి ధరలు మరింతగా పెరుగుతుండటం, వాహనాల ఉద్గారాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటం వంటి భవిష్యత్ సవాళ్లకు హైడ్రోజన్ వాహనాలు పరిష్కారంగా కనిపిస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. కర్బన రహిత హైడ్రోజన్ రవాణా ఆశయాలను సాధించాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి ఈ హైడ్రోజన్ బస్సులు దోహదం చేస్తాయని ఆ సంస్థ అభిప్రాయపడింది.
ఫుల్ హైడ్రోజన్ నింపితే 400 కిలోమీటర్లు..
ఈ బస్సులకు ఒక్కసారిగా ఫుల్ హైడ్రోజన్ నింపితే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని ఓఎల్‌జీ తెలిపింది. ఈ ఒలెక్ట్రా బస్సులో హైడ్రోజన్ నింపడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఈ హైడ్రోజన్ బస్సు 12 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ బస్సులో డ్రైవర్ సీటు మినహా ప్రయాణికుల కోసం 32 నుండి 49 సీట్లు ఉంటాయి.
ఉద్గారాల విషయానికి వస్తే..
ఈ బస్సులు టెయిల్ పైప్ ఉద్గారాల మాదిరిగానే నీటిని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ఇక సిస్టమ్ విషయానికి వస్తే.. ఒలెక్ట్రా హైడ్రోజన్ బస్సు పైభాగంలో టైప్-4 హైడ్రోజన్ సిలిండర్లు ఉంటాయి. ఈ సిలిండర్లు మైనస్ 20 నుంచి +85 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా రూపొందించనున్నారు. ఈ బస్సులను సంవత్సరంలోగా వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓఎల్‌జీ.. అయితే రానున్న కాలంలో దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో హైడ్రోజర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
కాగా, 2000లో స్థాపించిన ఈ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్- మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ గ్రూప్‌లో భాగం. భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అగ్రగామిగా ఉంది. ఇది పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ల కోసం భారతదేశం అతిపెద్ద సిలికాన్ రబ్బర్, కాంపోజిట్ ఇన్సులేటర్స్ తయారీదారు.ప్రస్తుతం ప్రజా రవాణాలో అత్యధికంగా వినియోగిస్తున్న డీజిల్, పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించి వాటి స్థానంలో ఈ గ్రీన్ బస్సులను ఏర్పాటు చేయడానికి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తయారు చేసే హైడ్రోజన్ బస్సులు పర్యావరణహిత ప్రజా రవాణా చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి