Zomato Everyday: రూ. 89 లకే హోమ్ స్టైల్ ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు.. వివరాలివే..

హోటల్ ఫుడ్డు హోటల్ ఫుడ్డే.. ఇంటి భోజనం ఇంటి భోజనమే.. చాలామంది ప్రజలు సమయాభావం వల్ల బయటి ఫుడ్డు తినాల్సి వస్తుంది. అలా ఇంటి భోజనానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే..

Zomato Everyday: రూ. 89 లకే హోమ్ స్టైల్ ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు.. వివరాలివే..
Zomato
Follow us

|

Updated on: Feb 23, 2023 | 2:09 PM

హోటల్ ఫుడ్డు హోటల్ ఫుడ్డే.. ఇంటి భోజనం ఇంటి భోజనమే.. చాలామంది ప్రజలు సమయాభావం వల్ల బయటి ఫుడ్డు తినాల్సి వస్తుంది. అలా ఇంటి భోజనానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో బుధవారం జొమాటో ఎవ్రీడేని ప్రారంభించింది. ఇందులో.. సరసమైన ధరలకే ఇంట్లో వండినట్లుగా ఉండే భోజనాలను డెలివరీ చేయనుంది. జొమాటో ఎవ్రీడే ప్రస్తుతం గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉందని, తాజా భోజనం రూ. 89తో ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది.

“మీ ఇంటి వద్దకే, సరసమైన ధరకే ఇంటి భోజన సౌకర్యాన్ని అందిస్తున్నాం. నిజమైన హోమ్ చెఫ్‌లతో వంటలు చేయించి డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ వంటలు మీ ఇంటి వంటల్లాగే ఉంటాయి. మీ ఇంటిని గుర్తుచేస్తుందని విశ్వసిస్తున్నాం.’’ అంటూ జొమాటో వ్యవస్థాపకులు, సీఈఓ దీపిందర్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ఫుడ్ పార్టనర్స్, హోమ్ చెఫ్‌లతో సహకరిస్తారని జొమాటో తెలిపింది.

‘‘కేవలం మెనుని బ్రౌజ్ చేయండి, మీ భోజనాన్ని ఎంచుకోండి. నిమిషాల్లో మీ ఇంటి వద్దకే వేడి వేడి, రుచికరమైన ఆహారం వచ్చేస్తుంది.’’ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ ఇన్‌స్టంట్ సేవలను త్వరలోనే దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్లాన్స్ వేస్తోంది జొమాటో. వినియోగదారులకు సరసమైన ధరకే, హోమ్లీ ఫుడ్ అందించడం ద్వారా ఇండియాలో తమ మార్కెట్‌ను పెంచుకోవాలని భావిస్తోంది కంపెనీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
దిండు లేకుండా నిద్రపోతే.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకే!
దిండు లేకుండా నిద్రపోతే.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకే!
ఢిల్లీలో ఉంటే డయాబెటీస్ గ్యారంటీ !!
ఢిల్లీలో ఉంటే డయాబెటీస్ గ్యారంటీ !!
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న ఆపరేషన్‌ చిరుత
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న ఆపరేషన్‌ చిరుత
బంగారం ధర మళ్లీ తగ్గింది..తులంపై ఎంత తగ్గిందో తెలుసా ??
బంగారం ధర మళ్లీ తగ్గింది..తులంపై ఎంత తగ్గిందో తెలుసా ??
మద్యం ప్రియుల గోడు తీర్చిన ఎక్సైజ్ శాఖ.. తాగుబోతుల సంబరాలు..
మద్యం ప్రియుల గోడు తీర్చిన ఎక్సైజ్ శాఖ.. తాగుబోతుల సంబరాలు..
ఓ వైపు వడగాల్పలు.. మరోవైపు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక!
ఓ వైపు వడగాల్పలు.. మరోవైపు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక!
కూటమి మేనిఫెస్టోలో ‘ఫొటోల’ వివాదం..పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
కూటమి మేనిఫెస్టోలో ‘ఫొటోల’ వివాదం..పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
హైప్ పెంచేస్తున్న పుష్ప రాజ్.. ఆ భాషలోనూ రిలీజ్ కానున్న సినిమా
హైప్ పెంచేస్తున్న పుష్ప రాజ్.. ఆ భాషలోనూ రిలీజ్ కానున్న సినిమా
ట్యాబ్లెట్స్‌ ఉపయోగించకుండానే.. నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు!
ట్యాబ్లెట్స్‌ ఉపయోగించకుండానే.. నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు!
కేకేఆర్ స్టార్ బౌలర్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు..
కేకేఆర్ స్టార్ బౌలర్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు..