AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Scooter: వెళ్తూ వెళ్తూనే కాలి బూడిదైన ఓలా స్కూటర్.. వీడియో వైరల్..

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు అయిన ఓలా ఎలక్ట్రిక్ కు చెందిన స్కూటర్ కదులుతుండగానే బ్యాటరీ నుంచి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైపోయింది. స్కూటర్ డ్రైవర్ మాత్రం దానిని గమనించి పక్కకు జరగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త ఫుల్ వైరల్ అయిపోయింది.

Ola Scooter: వెళ్తూ వెళ్తూనే కాలి బూడిదైన ఓలా స్కూటర్.. వీడియో వైరల్..
Ola Electric Scooter Caught Fire
Madhu
|

Updated on: Feb 29, 2024 | 8:22 AM

Share

విద్యుత్ శ్రేణి వాహనాలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. క్రమంగా సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ వాహనాల స్థానంలో ఇవి రిప్లేస్ అవుతున్నాయి. అయితే వీటిల్లో భద్రత విషయం మాత్రమే ఎప్పుడు సందేహాత్మకంగానే ఉంటోంది. ముఖ్యంగా వేసవిలో వీటితో ప్రయాణం చాలా ప్రమాదకరమే భావన వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి. అధిక వేడి కారణంగా అవి బ్యాటరీలు పేలిపోవడం, మంటలు అంటుకోవడం వంటివి గతేడాది చూశాం. గత కొంత కాలంగా అటువుంటి సంఘటనలు ఏమి జరగకపోయినా.. ఇప్పుడు వేసవి సమీపించడంతో ఇటువంటి ఘటనలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు అయిన ఓలా ఎలక్ట్రిక్ కు చెందిన స్కూటర్ కదులుతుండగానే బ్యాటరీ నుంచి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైపోయింది. స్కూటర్ డ్రైవర్ మాత్రం దానిని గమనించి పక్కకు జరగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆ బాధితుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త ఫుల్ వైరల్ అయిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మధ్యప్రదేశ్, జబల్‌పూర్‌లోని తిల్వారా ఘాట్ నారాయణపూర్‌లో నివసిస్తున్న అబ్దుల్ రెహమాన్ అనే యువకుడు బేకరీలో పనిచేస్తుంటాడు. అతను పని నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. తనకున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై వస్తున్నాడు. రోడ్డు మధ్యలోకి రాగనే వెనుక వస్తున్న మరో ద్విచక్రవాహనదారుడు మీ బండి నుంచి భారీగా పొగలు వస్తున్నాయని చెప్పడంతో స్కూటర్ ను పక్కకు ఆపి చూశాడు. దాని ప్యానెల్, సీటు కింద నుండి మంటలు వ్యాపించాయి. సీటు కింద మంటలు చెలరేగడంతో డ్రైవర్ వెంటనే వాహనం నుంచి దూకేశాడు. దీంతో వాహనం కూడా కిందపడిపోగా, పరుగున వెళ్లి వాహనాన్ని స్టాండ్‌పై పెట్టాడు. అయితే కొద్దిసేపటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది.

నాలుగు నెలల కిందటే కొనుగోలు..

కేవలం 4 నెలల క్రితమే ఈ కారును రూ.1 లక్షా 76 వేలకు కొన్నానని, అయితే మంటలు ఎలా చెలరేగాయో అర్థం కావడం లేదని ఆ యువకుడు చెబుతున్నాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ ప్రాణాపాయం తప్పితే రూ.2 లక్షలకు పైగా విలువైన వాహనం కాలి బూడిదైంది. దీనికి సంబంధించిన ఓలా కంపెనీ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ వీడియో నెట్టింట పూర్తిగా వైరల్ గా మారిపోయింది.

ఈ ఘటనతో మళ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రజలకు సందేహాలు పెరుగుతున్నాయి. ఎండాకాలంలో వీటి వినియోగంపై అభద్రతాభావం ఏర్పడుతోంది. ఇది రానున్న కాలంలో వీటి కొనుగోళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీలు ఎలా ముందుకెళ్తాయో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..