Ola Electric: టూవీలర్ ఈవీ రంగంలో దూసుకెళ్తున్న ఓలా.. 40 శాతం మార్కెట్ వాటాతో..
Ola Electric: భారతదేశ అతి పెద్ద ఈవీ కంపెనీ ‘ఓలా ఎలక్ట్రిక్’ టూవీలర్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో అధిపత్యాన్ని కొనసాగిస్తూ.. జూన్ నెలలో ఏకంగా 40% మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. అలాగే దేశంలోని EV 2W విభాగంలో ప్రథమ స్థానాన్ని..
Ola Electric: భారతదేశ అతి పెద్ద ఈవీ కంపెనీ ‘ఓలా ఎలక్ట్రిక్’ టూవీలర్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో అధిపత్యాన్ని కొనసాగిస్తూ.. జూన్ నెలలో ఏకంగా 40 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. అలాగే దేశంలోని EV 2W విభాగంలో ప్రథమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. సబ్సిడీ తగ్గింపుతో మొత్తం ఎలక్ట్రిక్ వెహికిల్స్(టూవీలర్) మార్కెట్ అమ్మకాలు క్షీణించినా, ఓలా ఎలక్ట్రిక్ జూన్‌లో దాదాపు 18,000 యూనిట్లను విక్రయించి, భారతదేశ టూవీలర్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో అగ్రగామిగా నిలిచింది.
ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘అత్యధిక మార్కెట్ వాటాను నిలబెట్టుకోవడంలో ఓలా మరోసారి విజయవంతమైంది. జూన్ నెల ఈవీ టూవీలర్ పరిశ్రమకు కష్టకాలంగా ఉన్నప్పటికీ ఓలా ఎక్కువ విక్రయాలను చేయగలిగింది. సబ్సీడీ తగ్గింపు ధర కంపెనీపై ప్రభావం చూపలేకపోయింద’’ని అన్నారు.
కాగా, దేశంలో ఈవీల విస్తరణ కోసం ఓలా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి మార్కెట్‌లో తన ఉనికిని చురుగ్గా పెంచుకుంది. ఈ క్రమంలోనే ఓలా కంపెనీ ఇటీవలే తన 750వ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ని ప్రారంభించింది. ఇంకా ఆగస్టు నాటికి ఈ సంఖ్యను 1000 దాటేలా చూడాలని చూస్తోంది. మరోవైపు తాజాగా సవరించిన సబ్సిడీలు జూన్ నుంచి అమలులోకి రావడంతో.. ఇప్పుడు Ola S1 Pro రూ. 1,39,999 కి, S1(3KWh) రూ. 1,29,999కి, అలాగే S1 Air(3KWh) రూ. 1,09,999కి అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..