- Telugu News Photo Gallery Business photos It's not about being born in poverty..it's wrong to be in poverty..it's the ways to keep the money you earn..!
Best Money Making: పేదరికంలో పుట్టడం కాదు..పేదరికంలో ఉండడమే తప్పు.. సంపాదించిన డబ్బును నిలబెట్టుకునే మార్గాలివే..!
ప్రపంచం మొత్తాన్ని డబ్బే శాసిస్తుంది. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత శవాన్ని కాల్చే వరకూ ప్రతి సందర్భంలో డబ్బు తప్పనిసరిగా మారింది. ఈ సొసైటీలో డబ్బున్న వారికే గౌరవం ఎక్కువ ఉంటుంది. అయితే దినసరి కూలీ దగ్గర నుంచి టాప్ కంపెనీ సీఈఓ వరకూ వారివారి పరిధి మేరకు ప్రతిరోజూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో? దాన్ని నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి పేదరికం నుంచి ధనవంతులుగా మారేలా డబ్బు సంపాదించి, దాన్ని నిర్వహించే ఉత్తమమైన పద్ధతుల గురించి ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Jul 04, 2023 | 7:24 PM

బడ్జెట్ మీ ఆదాయం, ఖర్చులను ట్రాక్ చేయడానికి బడ్జెట్ సృష్టించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీరు తెలివిగా డబ్బును కేటాయించడానికి, అలాగే పెట్టుబడి, పొదుపు చేయడానికి మీకు సాయం చేస్తుంది.

ఆర్థిక లక్ష్యాలు స్వల్పకాలిక, ధీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు నిర్వహించుకోవడం చాలా అత్యవసరం. ఈ లక్ష్యాలు మిమ్మల్ని దిశానిర్దేశం చేస్తాయి. మిమ్మల్ని పెట్టుబడుల వైపు ప్రేరేపిస్తాయి.

ఆదాయ మార్గాలు డబ్బును సంపాదించడానికి బహుళ ఆదాయా మార్గాలను అన్వేషించడం అవసరం. ముఖ్యంగా మీ ఆదాయా మార్గాలు వైవిద్యంగా ఉండేలా చూసుకోవాలి. మీ సంపాదనను పెంచుకోవడానికి ఫ్రీలాన్సింగ్ లాంటి నిష్క్రియ మార్గాలను ఎంచుకోవాలి.

పొదుపు, పెట్టుబడి మీ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు, పెట్టుబడి పథకాలకు మళ్లించాలి. ఇలా చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో మీకు నగదు నిల్వలు చేతుల్లో ఉంటాయి. కాబట్టి మార్కెట్‌లో ఉన్న ఉత్తమ పెట్టుబడి మార్గాలను అన్వేషించి వాటిల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

నిరంతర అభ్యాసం వ్యక్తిగత ఫైనాన్స్, పెట్టుబడి, వ్యాపారం గురించి నిరంతర కొత్త సమాచారాన్ని వెతకడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా మీరు మంచి లాభాలు వచ్చే పెట్టుబడి మార్గాలు పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాతో కాకుండా మీకు మీరుగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.

అనవసర ఖర్చులకు దూరం మీ ఆదాయానికి అనుగుణంగా మీరు జీవిస్తునే కచ్చితంగా పొదుపు మంత్రాన్ని పాటించాలి. ముఖ్యంగా ఇతరులను చూసి అనవసర ఖర్చులకు వెళ్లకపోవడం మంచిది. కోరికలు అవసరాల మధ్య తేడాను గమనించడం ఉత్తమం.




