Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Melanoma: పుట్టుమచ్చ ఆకారం మారుతుందా..? తస్మాత్ జాగ్రత.. ఆ ప్రాణాంతక వ్యాధి లక్షణమే కాగలదు..

Melanoma: శరీరంపై పుట్టుమచ్చ అందానికి చిహ్నంగా భావిస్తుంటారు. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో పుట్టుమచ్చలను శుభ సూచకంగా పేర్కొంటారు. అయితే వైద్యశాస్త్రం ప్రకారం శరీరంపై ఉండే కొన్ని పుట్టుమచ్చలు స్కిన్ క్యాన్సర్ లక్షణంగా కనిపిస్తాయని మీకు తెలుసా..? పుట్టుకతో వచ్చే మచ్చలను..

Melanoma: పుట్టుమచ్చ ఆకారం మారుతుందా..? తస్మాత్ జాగ్రత.. ఆ ప్రాణాంతక వ్యాధి లక్షణమే కాగలదు..
Melanoma Symptoms
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 02, 2023 | 12:37 PM

Melanoma: శరీరంపై పుట్టుమచ్చ అందానికి చిహ్నంగా భావిస్తుంటారు. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో పుట్టుమచ్చలను శుభ సూచకంగా పేర్కొంటారు. అయితే వైద్యశాస్త్రం ప్రకారం శరీరంపై ఉండే కొన్ని పుట్టుమచ్చలు స్కిన్ క్యాన్సర్ లక్షణంగా కనిపిస్తాయని మీకు తెలుసా..? పుట్టుకతో వచ్చే మచ్చలను మాత్రమే పుట్టు మచ్చలు అంటారు,. వీటిలో కొన్ని చర్మం రంగు మారినా, లేదా వయసు పెరిగే కొద్ది కనుమరుగైపోతాయి. కానీ కొత్త మచ్చలు పుట్టుకొచ్చినా లేదా ఉన్న మచ్చల ఆకారం మారినా అది చర్మ క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఇలా కనిపించే పుట్టుమచ్చలను ‘మెలనోమా మోల్స్’ అంటారు. నిజానికి పుట్టుమచ్చలు క్యాన్సర్‌ని కలిగించవు కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం ఒక వ్యక్తి శరీరంపై 50 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది తరువాత చర్మ క్యాన్సర్‌గా మారుతుంది. ఇంకా నిపుణుల ప్రకారం చర్మంపై పుట్టుమచ్చ ఉండి అది వేగంగా ఆకారాన్ని మార్చి రక్తస్రావం, దురదలు కలిగిస్తే, అవి చర్మ క్యాన్సర్ లక్షణాలయ్యే అవకాశమే చాలా ఎక్కువ.

మెలనోమా అంటే..

మెలనోమా అనేది ఒక రకమైన స్కిన్ క్యాన్సర్. సూర్యుని అతినీలలోహిత కిరణాలు అధికంగా పడడం వల్ల చర్మంపై మెలనోమా వర్ణద్రవ్యం మచ్చలు కనిపిస్తాయి. ఇవి రానున్న కాలంలో క్యాన్సర్ లక్షణంగా మారేందుకు అవకాశం ఉంది. వీటిని ముందుగారు గుర్తిస్తే ఈ వ్యాధిని నయం చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

చర్మ క్యాన్సర్‌ని ఎలా నివారించాలి?

  1. ఎండలోకి వెళ్లే ప్రతి రెండు గంటలకు ఒక సారీ సన్‌స్క్రీన్‌ని ముఖానికి ఆప్లై చేయండి.
  2. కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం కోసం UVA, UVB కిరణాలను నిరోధించే సన్ గ్లాసెస్ ఉపయోగించడం.
  3. చర్మంపై ఏవైనా మార్పులు ఉంటే వెంటనే వైద్యనిపుణులను సంప్రదించండి.
  4. ఎండ లేదా సూర్య కిరణాలు పడకుండా లాంగ్ హ్యాండెడ్ షర్ట్స్ ధరించాలి.
  5. తీసుకునే ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..