Jamun Seeds: నేరేడు పండ్లే కాదు విత్తనాలూ దివ్యౌషధమే.. ఇలా వాడితే ఆ సమస్యలకు చెక్..

Jamun Seeds: వర్షాకాలపు పండ్ల మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో నేరేడు ఎంతో ప్రముఖమైనవి. చూడడానికి నల్లగా నిగనిగలాడుతున్న ఈ పండ్లను తినేందుకు అందరూ ఇష్టపడతారు. దీనితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అయితే మెజారిటీ శాతం..

Jamun Seeds: నేరేడు పండ్లే కాదు విత్తనాలూ దివ్యౌషధమే.. ఇలా వాడితే ఆ సమస్యలకు చెక్..
Jamun Seeds
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 01, 2023 | 12:33 PM

Jamun Seeds: వర్షాకాలపు పండ్ల మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో నేరేడు ఎంతో ప్రముఖమైనవి. చూడడానికి నల్లగా నిగనిగలాడుతున్న ఈ పండ్లను తినేందుకు అందరూ ఇష్టపడతారు. దీనితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అయితే మెజారిటీ శాతం మంది చేసే తప్పు ఏమిటంటే.. నేరేడు పండుని తినేసి అందులోని విత్తనాలను పారేస్తారు. అదే పెద్ద తప్పు అంటున్నారు నిపుణులు. అందుకు కారణం కూడా లేకపోలేదు. నేరేడు విత్తనాల నుంచి తయారు చేసిన పొడి ఆరోగ్యాన్ని కాపాడడంలో, ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. మరి ఈ నేరేడు గింజతో ఎన్నెన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మధుమేహం: నేరేడు విత్తనంలోని పొడిని తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అందుపులో ఉంటాయి. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్‌కి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు రోజుకు ఒక గ్లాస్ నీటిలో టీస్పూన్ నేరేడు గింజల పొడి కలిపి తాగితే చాలు.

జీర్ణవ్యవస్థ: నేరేడు విత్తనాల నుంచి తీసిన పొడి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం, అజీర్తి, అసిడిటీ సమస్యలను నివారించి.. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మానసిక ఆరోగ్యం: నేరేడు గింజల పొడి మీ మానసిక ఆరోగ్యంపై మంచి ఫలితాలను చూపిస్తుంది. అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి ప్రశాంతతను కలిగిస్తుంది.

బరువు సమస్యకు చెక్: బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది దివ్యౌషధం. నేరేడు గింజల పొడిలోని ఫైబర్ మీ బరువు తగ్గేలా చేస్తుంది. ఇంకా ఎక్కువ సమయం ఆకలి కోరిక కలగకుండా చేస్తుంది.

నేరేడు గింజల పొడి తయారీ విధానం: నేరేడు గింజల పొండి కోసం ముందుగా విత్తనాలకు ఏదైనా క్లాత్‌ కప్పి ఎండలో ఆరబెట్టాలి. అవి పూర్తిగా ఆరిపోయినప్పుడు, వాటిని ముక్కలుగా కట్ చేసి గ్రైండర్‌లో, లేదా మిక్సీలో పొడిగా చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..