Virender Sehwag: విరూ భాయ్ నుంచి అద్దిరిపోయే పోస్ట్.. ఆ ప్రత్యేకమైన బ్యాట్‌లకు ‘ప్యారే సాథీ’ అంటూ..

Virender Sehwag: భారత క్రికెెట్ చరిత్రలో అత్యుత్తమైన ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఒకరు. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ ఆట అంటే అభిమానులకు కన్నుల విందే. ఫార్మాట్ ఏదైనా ఎదురెళ్లి మరీ బంతికి డాష్ ఇవ్వడం సెహ్వాగ్‌..

Virender Sehwag: విరూ భాయ్ నుంచి అద్దిరిపోయే పోస్ట్.. ఆ ప్రత్యేకమైన బ్యాట్‌లకు ‘ప్యారే సాథీ’ అంటూ..
Virender Sehwag
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 29, 2023 | 2:34 PM

Virender Sehwag: భారత క్రికెెట్ చరిత్రలో అత్యుత్తమైన ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఒకరు. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ ఆట అంటే అభిమానులకు కన్నుల విందే. ఫార్మాట్ ఏదైనా ఎదురెళ్లి మరీ బంతికి డాష్ ఇవ్వడం సెహ్వాగ్‌ ప్రత్యేకత. ఇక క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత సోషల్ మీడియాలా చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నాడు వీరూ. ఈ క్రమంలోనే సెహ్వాగ్ ఎప్పుడూ క్రికెట్, సమకాలీన పరిస్థితులపై స్పందిస్తుంటాడు. తాజాగా ఈ మాజీ క్రికెటర్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుని మరీ ఇతర సోషల్ మీడియా వేదికల్లో కూడా ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ పోస్ట్‌కి ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి. అసలు సెహ్వాగ్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్‌లో ఏముంది..? తెలుసుకుందాం..

సెహ్వాగ్ తన టెస్ట్ కెరీర్‌లో భారత్ తరఫున 2 త్రిబుల్ సెంచరీలు సహా మొత్తం 6 టెస్ట్ డబుల్  శతకాలు బాదాడు. అలాగే వన్డేల్లో కూడా ఓ డబుల్ సెంచరీ చేశాడు. ఇలాంటి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల్లో తాను ఉపయోగించిన బ్యాట్‌లకు సంబంధించిన ఫోటోను వీరూ నెటింట పోస్ట్ చేశాడు. ‘బ్యాట్‌ల్లో సత్తా ఉంది- 309, 319, 219, 119, 254. ప్రియమైన సహచరులు. లొస్ట్ 293 వాలా’ అని అర్థం వచ్చే క్యాప్షన్‌తో ఆ పిక్‌ని సెహ్వాగ్ షేర్ చేయగా.. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే సెహ్వాగ్ తన పోస్ట్‌లో పేర్కొన్న 309 పరుగులు పాకిస్థాన్‌పై 2004 లో చేశాడు. అలాగే దక్షిణాఫ్రికాపై 319, విండీస్‌పై 219, పాకిస్థాన్‌పైనే 254 పరుగులు చేసిన ఇన్సింగ్స్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా, సెహ్వాగ్ చివరిగా ప్రస్తావించిన 293 పరుగుల ఇన్నింగ్స్ 2009లో శ్రీలంకపై ఆడింది. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ మరో 7 పరుగులు చేస్తే త్రిపుల్ సెంచరీ పూర్తవుతుందన్న సమయంలో ముత్తయ్య మురళీధరణ్ వేసిన ఓవర్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంకా తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సెహ్వాగ్ షేర్ చేసిన పోస్ట్‌కి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ‘మీరు బెస్ట్ క్రికెటర్ కాదు, క్రికెట్ బీస్ట్’.., ‘విధ్వంసకర ఆయుధాలు’.., ‘మీలాంటి ప్లేయర్ టీమిండియాకు లభించడం చాలా కష్టం’ అంటూ పలువురు నెటిజన్లు రాసుకొచ్చారు.

శ్రీలంకపై వీరూ భాయ్ 293 ఇన్నింగ్స్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..