AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Root, Ashes: నెం.1 బ్యాటర్‌నే కాదు, నెం.8 ఆల్‌రౌండర్‌ని కూడా..! కంగారులపై బౌలింగ్‌తో విజృంభించిన ఇంగ్లీష్ ‘టెస్ట్ స్పెషలిస్ట్’..

Lord’s Test, Ashes 2023: ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లీష్ టీమ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తొలి టెస్ట్ ఓడినప్పటికీ ఇంగ్లాండ్ తరఫున అజేయమైన సెంచరీతో మెరిపించిన జో రూట్..

Joe Root, Ashes: నెం.1 బ్యాటర్‌నే కాదు, నెం.8 ఆల్‌రౌండర్‌ని కూడా..! కంగారులపై బౌలింగ్‌తో విజృంభించిన ఇంగ్లీష్ ‘టెస్ట్ స్పెషలిస్ట్’..
Joe Root Wicket Taking Performance
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 29, 2023 | 10:38 AM

Share

Lord’s Test, Ashes 2023: ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లీష్ టీమ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తొలి టెస్ట్ ఓడినప్పటికీ ఇంగ్లాండ్ తరఫున అజేయమైన సెంచరీతో(118 నాటౌట్, 46) మెరిపించిన ఈ టెస్ట్ స్పెషలిస్ట్.. రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌తో రెచ్చిపోతున్నాడు. ఒక ఓవర్‌లోనే 2 వికెట్లు పడగొట్టి తాను నెం.1 టెస్ట్ బ్యాటర్‌ మాత్రమే కాదు, నెం.8 టెస్ట్ ఆల్‌రౌండర్ అని కూడా చాటి చెబుతున్నాడు. 4 బంతుల్లోనే నిలకడగా ఆడుతున్న ట్రావిస్ హెడ్(77)ని, అప్పుడే వచ్చిన కామెరూన్ గ్రీన్(0)ని పెవిలియన్ బాట పట్టించి.. కంగారులను దెబ్బతీశాడు.

రూట్ 75వ ఓవర్ వేయడానికి వచ్చిన సమయంలో ఆసీస్ టీమ్ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌ నెలకొల్పిన 118 పరుగుల భాగస్వామ్యంగా ధీమాగా ఉంది. అయితే రూట్ వేసిన 75వ ఓవర్ రెండో బంతికి ట్రావిస్ హెడ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి స్టంప్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌ 5వ బంతిని గాల్లోకి లేపడంతో జేమ్స్ ఆండర్సన్ చేతిలో చిక్కాడు.

ఇవి కూడా చదవండి

అలా ఒకే ఓవర్‌లో 4 బంతుల తేడాతో ఇద్దరు కీ ప్లేయర్లను రూట్ ఔట్ చేయడంతో ఆసీస్ 316 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. కానీ ఆ ఓవర్ తర్వాత ఇంగ్లీష్ బౌలర్లు కంగారులపై ప్రభావం చూపకపోవడంతో.. తొలి రోజు ఆట ముగిసిసరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. ఇక ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ 85, మరో ఎండ్‌లో అలెక్స్ కారే 11 పరుగులతో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..