Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అక్రమ వడ్డీ వ్యాపారులపై ఖాకీ కొరడా.. కోట్ల విలువ చేసే బ్యాంక్ చెక్స్, డాక్యుమెంట్ల స్వాధీనం.. పూర్తి వివరాలివే..

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధం ఫైనాన్స్‌ వ్యాపారాలు నిర్వహిస్తున్నవారి ఇళ్లపై దాడులు చేశారు. భారీగా నగదు, విలువైన డాక్యుమెంట్స్‌ స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది.

Telangana: అక్రమ వడ్డీ వ్యాపారులపై ఖాకీ కొరడా.. కోట్ల విలువ చేసే బ్యాంక్ చెక్స్, డాక్యుమెంట్ల స్వాధీనం.. పూర్తి వివరాలివే..
Police Raids In Rajanna Sircilla
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 02, 2023 | 12:12 PM

Rajanna Sircilla News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధిక వడ్డీలతో ప్రజలను పీడిస్తున్న ఫైనాన్స్‌ వ్యాపారుల తాట తీశారు పోలీసులు. ఇష్టారీతి వడ్డీలతో వ్యాపారాలు చేస్తున్నవారి ఇళ్లపై సిరిసిల్ల జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడతోపాటు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 16 మంది వడ్డీ వ్యాపారుల ఇళ్లు, చిట్‌ఫండ్స్‌లో తనిఖీలు చేశారు. ప్రధానంగా సిరిసిల్లకు చెందిన 8 మంది ప్యాపారస్తుల వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఓ ఫైనాన్స్‌ కంపెనీ నిర్వాహకులు తాళాలు వేసి వెళ్లగా.. తాళాలు తీసి రికార్డులు తనిఖీ చేశారు.

ఇక.. టాస్క్‌ఫోర్స్‌ సోదాల్లో రూ. 13, 95000 నగదు, 4 కోట్ల 19 లక్షల విలువ చేసే 113 బ్యాంక్‌ చెక్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్‌ లభ్యమయ్యాయి. సిరిసిల్ల జిల్లా రైస్ మిల్ అసోసియేషన్‌ అధ్యక్షుడు పబ్బా నాగరాజు ఇంట్లోనే 2 కోట్ల 80 లక్షల విలువ చేసే 67 బ్యాంక్ చెక్స్, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పబ్బ నాగరాజుతోపాటు మరో నలుగురిపై కేసులు నమోదు.. 8 మందిని బైండోవర్ చేశారు. ఇటీవల చేపట్టిన ఠాణా దివస్‌లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 12 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు పోలీసులు. తనిఖీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌. అధిక వడ్డీ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.

కాగా, ఇష్టారీతి ఫైనాన్స్‌ వ్యాపారాలు చేసేవారు తీరు మార్చుకోవాలని ఎస్పీ గతంలో పలుమార్లు హెచ్చరించారు. అయితే.. ఎన్నిసార్లు చెప్పినా ఫైనాన్స్‌ వ్యాపారుల తీరు మారకపోవడంతో రైడ్స్‌ చేయాలని టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌కు ఆదేశించారు. దాంతో.. బందోబస్తు విధుల కేటాయింపుల్లో పోలీసులు బిజీగా ఉన్నారనే సమయంలో అందరి దృష్టి మరల్చి టాస్క్‌ఫోర్స్‌ దాడులు చేశారు. మొత్తంగా.. టాస్క్‌ఫోర్స్‌ దాడులతో సిరిసిల్ల వడ్డీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

భల్లాలదేవ్ తమ్ముళ్లురా ఇక్కడ.. SRHతో లక్నో ఢీ.. భయంలో పంత్..
భల్లాలదేవ్ తమ్ముళ్లురా ఇక్కడ.. SRHతో లక్నో ఢీ.. భయంలో పంత్..
కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?ఈ పొరపాటు చేయకండి వీడియో
కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?ఈ పొరపాటు చేయకండి వీడియో
రామ్ చరణ్ ఆర్సీ 16 నుంచి చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
రామ్ చరణ్ ఆర్సీ 16 నుంచి చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!