JIO iActivate: ఇల్లు కదలకుండానే సిమ్‌ యాక్టివేట్‌.. అందుబాటులోకి కొత్త సేవలు

ఐయాక్టివేట్ పేరుతో తీసుకొచ్చిన ఈ సేవలతో ఇల్లు కదలకుండానే జియో సిమ్‌కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు మీరే స్వయంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ సేవలను ఎలా పొందొచచు. సిమ్‌ను స్వయంగా ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చో. స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

JIO iActivate: ఇల్లు కదలకుండానే సిమ్‌ యాక్టివేట్‌.. అందుబాటులోకి కొత్త సేవలు
Jio Iactivate
Follow us

|

Updated on: Sep 09, 2024 | 5:15 PM

మారుతోన్న కాలంతో పాటు టెక్నాలజీ సైతం మారుతోంది. సేవలు మరింత సులభతరమవుతున్నాయి. సిమ్‌ కార్డు తీసుకోవాలంటే కచ్చితంగా షాప్‌కు వెళ్లి, ఐడీ ప్రూఫ్‌, ఫొటో వంటివి ఇచ్చే వాళ్లం కాీ ప్రస్తుతం కాలం మారింది. ఇంట్లో కూర్చునే సిమ్‌ కార్డు పొందే సేవలు అందుబాటులోక వచ్చాయి. ఈ తరహాలోనే జియో తాజాగా కొత్త సేవలను ప్రారంభించింది. జియో సిమ్‌ యాక్టివేషన్‌ కోసం ఇకపై జియో ఎగ్జిక్యూటివ్ దగ్గరకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు.

ఐయాక్టివేట్ పేరుతో తీసుకొచ్చిన ఈ సేవలతో ఇల్లు కదలకుండానే జియో సిమ్‌కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు మీరే స్వయంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ సేవలను ఎలా పొందొచచు. సిమ్‌ను స్వయంగా ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చో. స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

* ఇందుకోసం ముందుగా ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌లో ‘My Jio యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

* అనంతరం యాప్‌ ఓపెన్‌ చేయగానే ఐయాక్టివేట్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.

* అనతరం ఆ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి.. మీ పేరు, ఫోన్‌ నంబర్‌, పిన్‌ కోడ్‌ ఎంటర్‌ చేయాలి.

* వెంటనే మీ ఫోన్‌ నెంబర్‌కి ఓటీపీ వెళ్తుంది.

* ఓటీపీని ఎంట్‌ చేయగానే ఈసిమ్‌, ఫిజికల్‌ సిమ్‌ అనే రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి.

* వీటిలో మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకొని ‘గో ఫర్‌ జియో ఐయాక్టివట్‌’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* ఆ తర్వాత ఆధార్‌ ఓటీపీ లేదా డిజీలాకర్‌ సాయంతో కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

*ఆ తర్వాత మీ ఇంటికే నేరుగా సిమ్‌ వస్తుంది. ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో లైవ్‌ ఫొటో/వీడియో తీసుకొని, లైవ్‌లోనే డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

* ఇలా ఈ ఐయాక్టివేట్ సర్వీసులను ఉపయోగించుకుని సిమ్ కార్డును యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక చేయండి..