Knowledge: విమానంలో కిటికీలు గుండ్రంగానే ఎందుకుంటాయి? ఆసక్తికర విషయం..
Airplane Windows: మీరు విమానం ఎక్కేముందు దాని గురించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. విమానం ప్రత్యేకతల్లో ఒకటి దాని కిటికీలు. విమానం కిటికీలు సాధారణంగా గుడ్రంగానే ఉంటాయి. కానీ మన బస్సులు, కార్లు, రైళ్లలో చతురస్త్రాకారంలో ఉంటాయి. మరి విమానంలో కిటికీలు గుండ్రంగానే ఉండటానికి గల కారణాలు ఏంటి? దాని నిర్మాణానికి అంత ప్రత్యేకత ఏంటి? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
విమానం ఎక్కాలనేది చాలా మంది కల. జీవితంలో ఒక్కసారైనా దానిలో ప్రయాణం చేయాలని సామాన్యులు భావిస్తారు. విమానంలో కూర్చొని కిటికిలో నుంచి మేఘాలను దగ్గర చూడాలని, నదులు, సముద్రాలను ఆకాశం పైనుంచి వీక్షించాలని అందరూ భావిస్తారు. అయితే మీరు విమానం ఎక్కేముందు దాని గురించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. విమానం ప్రత్యేకతల్లో ఒకటి దాని కిటికీలు. విమానం కిటికీలు సాధారణంగా గుడ్రంగానే ఉంటాయి. కానీ మన బస్సులు, కార్లు, రైళ్లలో చతురస్త్రాకారంలో ఉంటాయి. మరి విమానంలో కిటికీలు గుండ్రంగానే ఉండటానికి గల కారణాలు ఏంటి? దాని నిర్మాణానికి అంత ప్రత్యేకత ఏంటి? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
ప్రత్యేక కారణం ఉంది..
మనం ప్రయాణం చేసే సమయంలో అది బస్సు అయినా, రైలు అయినా, విమానం అయినా.. విండో సీటుకు ప్రాధాన్యం ఇస్తాం. విండో సీటును ప్రత్యేకంగా చూస్తాం. దాని కోసం అదనంగా డబ్బులు చెల్లించడానికి కూడా వెనుకాడం. విమానాల్లో కూడా ప్రయాణించడానికి టికెట్ బుక్ చేసుకుంటే.. మొదటి ప్రాధాన్యం విండో సీటుకే ఉంటుంది. విండో సీటు అందుబాటులో లేకుంటేనే మరో సీటుకు ఎన్నుకుంటాం. మరీ మీరు కనుక ఇప్పటికే విమానం ఎక్కి ఉంటే ఒక విషయాన్ని గమనించే ఉంటారు. విమానంలో కిటికీలు గుడ్రంగానే ఉంటాయి. చాలా మంది వీటి ఆకారం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ దీని వెనుక ఓ ప్రత్యేకమైన కారణమే ఉందంటున్నారు నిపుణులు.
గాలి ఒత్తిడే కారణం..
విమానాలు గాల్లో ప్రయాణిస్తుంటాయి. గాలి ఒత్తిడిని తట్టుకొని ప్రయాణించాల్సి ఉంటుంది. అలా తట్టుకోవాలంటే కిటికీలు తప్పనిసరిగా గుండ్రంగానే ఉండాలంట. ఒకవేళ చతురస్రాకారంలో ఉంటే ఆ కిటికీ గాలి ఒత్తిడిని తట్టుకోలేక పగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే విమానంలో కిటికీలు తప్పనిసరిగా గుండ్రంగానే ఉంటాయి. విమానం ఆకాశంలో ఉన్నప్పుడు విమానం లోపల గాలి పీడనం రెండు వైపులా ఉంటుంది. పైగా సమానంగా ఉండదు. మారుతూ ఉంటుంది. అయితే పాత కాలంలోని విమానాల కిటికీలు చతురస్రాకారంలోనే ఉండేవి. అప్పట్లో విమానాల వేగం చాలా తక్కువ. పైగా అవి ప్రయాణించే ఎత్తు కూడా తక్కువగానే ఉండేది. అయితే ఆధునిక విమానాల వేగం పెరగడం, అవి ప్రయాణించే ఎత్తు కూడా బాగా పెంచడంతో కిటికీల రూపు మార్చాల్సి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విమాన కిటికీలు చతురస్రాకారం నుంచి గుండ్రని రూపులోకి తీసుకొచ్చారు. ఇవి ఎంత గాలి ఒత్తిడినైనా తట్టుకోగలుగుతాయి. పగుళ్లు రావు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..