Indian Railways: వచ్చేస్తోంది.. మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు.. ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే..

ప్రయాణికులను మరింత వేగంగా గమ్యస్థానాలకే చేర్చే విధానంలో భాగంగా అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకోసం గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచే రెండు రైలు సెట్ల రూపకల్పన, తయారీకి రైల్వే మంత్రిత్వ శాఖ బిడ్లను ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్‌లో భారతీయ రైల్వే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)కు రెండు స్టాండర్డ్ గేజ్ రైలు సెట్ రేక్‌లను తయారు చేయాలని లేఖ రాసింది.

Indian Railways: వచ్చేస్తోంది.. మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు.. ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే..
Bullet Train
Follow us

|

Updated on: Sep 09, 2024 | 6:17 PM

దేశ ప్రజలందరూ తమ ప్రయాణాలకు రైళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తారు. దేశంలో ఏ అన్ని వైపులకు మార్గాలు ఉండడంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన ప్రయాణ సాధనాలతో పోల్చితే వేగంగా గమ్యస్థానాలకు చేరుకోగలం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ రైళ్లలో ప్రయాణానికి ప్రాధాన్యమిస్తారు. ప్రజల డిమాండ్ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రైళ్లను అభివృద్ధి చేస్తోంది. వాటిలో మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పిస్తోంది. దీనిలో భాగంగా గంటలకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది.

రైలు సెట్ల తయారీకి బిడ్..

ప్రయాణికులను మరింత వేగంగా గమ్యస్థానాలకే చేర్చే విధానంలో భాగంగా అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకోసం గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచే రెండు రైలు సెట్ల రూపకల్పన, తయారీకి రైల్వే మంత్రిత్వ శాఖ బిడ్లను ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్‌లో భారతీయ రైల్వే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)కు రెండు స్టాండర్డ్ గేజ్ రైలు సెట్ రేక్‌లను తయారు చేయాలని లేఖ రాసింది. రైలు సెట్ ఉక్కుతో తయారు చేయాలని, గంటకు 250 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించేలా ఉండాలని సూచించింది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా గంటలకు 160 కిలోమీటర్ల వేగంగా రాకపోకలు సాగిస్తోంది. రైలు ప్రయాణికులకు సౌకర్యాలు పెంచడంతో పాటు స్పీడ్ రైళ్ల రూపకల్పనకు ప్రాధాన్యమిచ్చింది. రైల్వే శాఖ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలపై ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

ఆధునిక వసతులు..

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈనెల మొదట్లో బెంగళూరు రైలు కాంప్లెక్స్‌లో దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు సెట్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలులో అనేక అత్యాధునకి వసతులు కల్పించారు. యూఎస్ బీ ఛార్జింగ్ సదుపాయం, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లతో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, డిస్‌ప్లే ప్యానెళ్లు, సెక్యూరిటీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీలు, వికలాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక బెర్త్‌లు, లేటెస్ట్ టాయిలెట్లు తదితర వాటిని ఏర్పాటు చేశారు. వీటితో పాటు 1వ ఏసీ కారులో ప్రయాణికులకు స్నానం కోసం వేడినీటిని అందించే ఏర్పాటు కూడా ఉంది. ఈ రైలు సెట్ ముందు ముక్కు కోన్ నుంచి ఇంటీరియర్ ప్యానెళ్లు, సీట్లు, స్లీపర్ బెర్త్‌లు, మరెన్నో అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు.

అప్ గ్రేడ్ వెర్షన్..

వందే భారత్ స్లీపర్ వెర్షన్ అప్‌గ్రేడ్ అవుతుంది. ముందు నుంచి వెనక వరకూ ఆధునీకరిస్తున్నారు. ముక్కు కోన్ నుంచి ఇంటీరియర్ ప్యానెళ్లు, సీట్లు, స్లీపర్ బెర్త్‌లు తదితర వాటిని అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రొపల్షన్, బోగీలు, ఎక్స్‌టీరియర్ ప్లగ్ డోర్లు, బ్రేక్ సిస్టమ్‌లు, హెచ్ వీఏసీ వంటి కీలక సిస్టమ్‌ల సముదాయానికి బీఈఎంఎల్ ఎలక్ట్రికల్ శ్రద్ద తీసుకోనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..