New UPI Rules: మీరు యూపీఐ చెల్లింపులు చేస్తున్నారా? ఇప్పుడు అలా చేయలేరు.. కొత్త నిబంధనలు

New UPI Payment Rules: డిజిటల్ చెల్లింపుల యుగంలో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. నిజానికి చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీలకు బదులుగా పెద్ద ఎత్తున యూపీఐని ఇష్టపడుతున్నారు. అయితే దీనితో పాటు ఈ రోజుల్లో యూపీఐ మోసం కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని యూపీఐ లావాదేవీలను..

New UPI Rules: మీరు యూపీఐ చెల్లింపులు చేస్తున్నారా? ఇప్పుడు అలా చేయలేరు.. కొత్త నిబంధనలు
New Upi Payment Rules
Follow us

|

Updated on: Aug 27, 2024 | 3:46 PM

New UPI Payment Rules: డిజిటల్ చెల్లింపుల యుగంలో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. నిజానికి చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీలకు బదులుగా పెద్ద ఎత్తున యూపీఐని ఇష్టపడుతున్నారు. అయితే దీనితో పాటు ఈ రోజుల్లో యూపీఐ మోసం కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని యూపీఐ లావాదేవీలను మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. సమాచారం ప్రకారం, ఇప్పుడు యూపీఐ చెల్లింపులు పిన్‌(PIN)కి బదులుగా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో నిర్ధారణ కానుంది.

ఇది కూడా చదవండి: Airport Rules: విమాన ప్రయాణంలో ఎంత నగదు తీసుకెళ్లవచ్చు? ఎంత లగేజీ ? నిబంధనలు ఏంటి?

ఇటీవలి కాలంలో యూపీఐ చెల్లింపుల ద్వారా మోసపూరిత కేసులు సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు యూపీఐ నేటి కాలంలో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసింది. అయితే ఈ మధ్యకాలంలో మోసం కేసులు కూడా పెరుగుతున్నాయి. కొత్త మోసాల గురించి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వారికి భద్రత కరువైపోయింది. అయితే ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవడానికి పిన్‌ (PIN) ఆధారిత ధృవీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ప్రమాణీకరణను స్వీకరించడానికి NPCI పెద్ద నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరింత సురక్షితం

అదే సమయంలో, మింట్ నివేదిక ప్రకారం.. యూపీఐ లావాదేవీలను మరింత సురక్షితంగా చేయడానికి బయోమెట్రిక్ ప్రమాణీకరణను చేర్చే ప్రణాళికపై NPCI పని చేస్తోంది. ఈ కొత్త సిస్టమ్ ప్రకారం.. యూపీఐ లావాదేవీలు ఇప్పుడు వేలిముద్ర స్కానింగ్ లేదా ముఖ ప్రామాణీకరణ ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సులభంగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా తమ బ్యాంకింగ్ వివరాలు లేదా పిన్ భద్రత గురించి ఆందోళన చెందుతున్న వినియోగదారులకు ఈ కొత్త మార్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బయోమెట్రిక్ ప్రమాణీకరణ ద్వారా, ఇప్పుడు సిస్టమ్‌లో వేలిముద్ర లేదా ముఖం ఇప్పటికే సేవ్ చేయబడిన వ్యక్తి మాత్రమే లావాదేవీలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: September 1 Rule Changes: బిగ్‌ అలర్ట్‌.. సెప్టెంబర్‌ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్‌.. జేబుకు చిల్లులే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి