AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DION electric vehicles: మార్కెట్ లోకి మరో రెండు నయా ఈవీ స్కూటర్లు.. ఫీచర్లు తెలిస్తే మతిపోతుందంతే..!

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రథమ ఎంపికగా మారింది. ఈ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతుండడంతో అనేక కంపెనీలు కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. దీనిలో భాగంగా డియాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ రెండు ఇ-స్కూటర్లకు ప్రారంభించింది.

DION electric vehicles: మార్కెట్ లోకి మరో రెండు  నయా ఈవీ స్కూటర్లు.. ఫీచర్లు తెలిస్తే మతిపోతుందంతే..!
Dion Ev Scooters
Nikhil
|

Updated on: Aug 27, 2024 | 4:00 PM

Share

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రథమ ఎంపికగా మారింది. ఈ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతుండడంతో అనేక కంపెనీలు కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. దీనిలో భాగంగా డియాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ రెండు ఇ-స్కూటర్లకు ప్రారంభించింది. చెన్నైలో కొత్తగా షోరూమ్ ను కూడా మొదలు పెట్టింది. డియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రత్యేకతలు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.  పవర్‌ట్రాన్స్ మొబిలిటీ లిమిటెడ్ యాజమాన్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ మొబిలిటీ బ్రాండ్ డియాన్ (DION) ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ సంస్థ ఇటీవలే రెండు కొత్త ప్రత్యేకమైన ఇ-స్కూటర్ మోడళ్లను పరిచయం చేసింది. వాటికి ఆగస్టా ఎస్పీ, ఆస్టా ఎఫ్ హెచ్ అని నామకరణం చేసింది. చెన్నైలోని రామాపురంలో కంపెనీ తన కొత్త షోరూమ్‌ను కూడా ప్రారంభించింది. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఏడు ఈవీ మోడళ్లు ఉన్నాయి. అలాగే మూడు షోరూమ్‌లు, ఐదు సర్వీస్ సెంటర్ల కూడా ఏర్పాటు చేయనున్నారు. సర్వీస్ ప్రొవైడర్‌తో భాగస్వామ్యంతో వినియోగదారులు తమిళనాడు అంతటా 256 స్టేషన్లలో వాహన సేవలను పొందవచ్చు.

డియాన్ (DION) ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిచయం చేసిన ఇ-స్కూటర్లకు అనేక ప్రత్యేకతలున్నాయి. అగస్టా ఎస్పీ ఇ-స్కూటర్ లోని 7.5 కేడబ్ల్యూ పీక్ పీఎంఎస్ఎం హబ్ మోటార్‌తో పనితీరును చాలా సమర్థంగా ఉంటుంది. ఈ బండి గరిష్టంగా 120 కేఎంపీహెచ్ వేగంతో పరుగులు తీస్తుంది. వెనుక స్ప్రింగ్ లోడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ప్రత్యేకంగా అమర్చారు. అలాగే ఆస్టా ఎఫ్ హెచ్ వెనుక మోనో స్ప్రింగ్ లోడ్ హైడ్రాలిక్ సెటప్‌తో కూడిన అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌ ఉంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వల్ల భద్రత, సౌకర్యం మరింత పెరుగుతుంది. రెండు మోడళ్లలో యాంటీ థెఫ్ట్ లాక్‌లు, ఫ్రంట్ ప్రొజెక్టర్ ఎల్ఈడీలు, వెనుక వైపు సాధారణ ఎల్ఈడీలు ఉన్నాయి. రెండింటినీ కేవలం 4 నుంచి 5 గంటల్లో 1 కేవీఏ ఛార్జర్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. కొత్త టెక్నాలజీ ని కోరుకునే వారికి కచ్చితంగా సరిపోతాయి. ధరల విషయానికి వస్తే ఆగస్టా ఎస్పీ రూ.1,79,750, ఆస్టా ఎఫ్ హెచ్ రూ1,29,999 (ఆన్ రోడ్)కు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రారంభ ఆఫర్ గా రూ.22 వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీ వరకూ మాత్రమే ఈ అవకాశం ఉంది.

కంపెనీ ప్రతినిధి ఎస్ఎమ్ ఆంటోనీ థామస్ మాట్లాడుతూ కొత్త 2-వీలర్ మోడళ్లను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వీటిలో అధునాతన పీఎంఎస్ఎం మోటార్లు, అత్యాధునిక బ్యాటరీలు అమర్చామన్నారు. అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ సిస్టమ్‌తో అనుసంధానం చేసినట్టు తెలిపారు. 2020లో ప్రారంభం నుంచి 3 వీలర్, 2 వీలర్ విభాగాలలో రెండు మోడళ్లను పరిచయం చేశామని, వాటిని మార్కెట్‌లో సానుకూల స్పందన, ప్రోత్సాహం లభించిందన్నారు. ఈ నేపథ్యంతో తమ పరిధిని మరింత విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగా పరిచయం చేసిన మోడళ్లను దేశవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు ఆదరిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. పవర్‌ట్రాన్స్ మొబిలిటీ లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలను, వాటి భాగాలను తయారు చేస్తుంది. అలాగే ఛార్జింగ్, స్వాపింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేసే ప్రణాళికలతో కూడా ముందుకు వెళుతోంది. కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్‌లు, ఇ-స్కూటర్లు, ఎలక్ట్రిక్ లోడర్లను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఆర్&డీ, డిజైన్, తయారీ కోసం ప్రత్యేక బృందాన్ని కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి