Car maintenance: ఆ ఒక్క తప్పుతో మీ కారు హాంఫట్.. ఈ టిప్స్‌తో కారు లైఫ్ పెరుగుతుందంతే..!
ప్రస్తుత రోజుల్లో కార్ల వినియోగం సర్వసాధారమైంది. తమ అవసరాలను తగ్గినట్టుగా ప్రతి ఒక్కరూ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార అవసరాలను వినియోగించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి విహారాలకు వెళుతున్నారు. అయితే కారును కొనడంతో పాటు దాన్ని సక్రమంగా నిర్వహించడం చాలా అవసరం. సాధారణంగా అందరూ కారు నిర్వహణ అంటే పెట్రోలు ఉందోలేదో చూసుకోవడం, సమయానికి సర్వీసింగ్ చేయించడం, ఏమైనా పార్టులు పోతే వెంటనే బాగుచేయిచడం అనుకుంటారు.
ప్రస్తుత రోజుల్లో కార్ల వినియోగం సర్వసాధారమైంది. తమ అవసరాలను తగ్గినట్టుగా ప్రతి ఒక్కరూ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార అవసరాలను వినియోగించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి విహారాలకు వెళుతున్నారు. అయితే కారును కొనడంతో పాటు దాన్ని సక్రమంగా నిర్వహించడం చాలా అవసరం. సాధారణంగా అందరూ కారు నిర్వహణ అంటే పెట్రోలు ఉందోలేదో చూసుకోవడం, సమయానికి సర్వీసింగ్ చేయించడం, ఏమైనా పార్టులు పోతే వెంటనే బాగుచేయిచడం అనుకుంటారు. వీటితో పాటు మరికొన్ని ప్రధాన అంశాలపై కూడా ఫోకస్ చేయాలి. అవే వీల్ అలైన్ మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, టైర్ రొటేషన్. ఈ విషయాలను చాాలామంది పట్టించుకోరు. కానీ కారు సక్రమంగా ప్రయాణించడానికి ఇవి చాలా అవసరం.
వీల్ అలైన్ మెంట్
కారుకు వీల్ అలైన్ మెంట్ (చక్రాల అమరిక) సక్రమంగా ఉండడం చాలా అవసరం. అంటే కారు సక్రమంగా ప్రయాణించడానికి వీలుగా నాలుగు చక్రాలు ఒకే రీతిలో ఉండడం. ఒక్కోసారి కొత్త కారుకు కూడా వీల్ అమరిక సక్రమంగా ఉండదు. లేకపోతే గంతులు, గతులు, రాళ్లు తదితర వాటిపై ప్రయాణించినప్పుడు, స్పీడ్ బ్రేకర్ పై నుంచి వేగంగా దూకినప్పుడు వీల్ అలైన్ మెంట్ తప్పుతుంది. దాని వల్ల డ్రైవర్ కు అసౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా స్టీరింగ్ వైబ్రైట్ అవుతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కుడి లేదా ఎడమవైపునకు లాగేస్తుంది. ఈ సమస్యను కారు మెకానిక్, టైర్ నిపుణుడు సులభంగా గుర్తిస్తాడు. చక్రాల అమరిక సక్రమంగా లేకపోతే టైర్ జీవితం కాలం బాగా తగ్గిపోతుంది. అలాగే స్టీరింగ్, ఇతర ముఖ్యభాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
వీల్ బ్యాలెన్సింగ్
కారులో వీల్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ప్రధానం. కారును బరువును అన్ని టైర్లు సమానంగా మోసేలా చూడడమే దీని అర్థం. చక్రాలన్నీ ఒకే విధంగా ఉన్నప్పుడే డైవింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. లేకపోతే కారు సస్పెన్సన్ దెబ్బతింటుంది. దాని వల్ల మైలేజీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కారును నడుపుతున్నప్పుడు కుదుపులు, కదలికలు వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వీల్ బ్యాలెన్సింగ్ చేయించడం వల్ల ఆ సమస్యను పరిష్కరించవచ్చు. దీన్ని పరీక్షించడానికి ముందుగా కారు నుంచి నాలుగు టైర్లను తీసివేసి, వాటిని ఒక్కొక్కటిగా కంప్యూటర్ వీల్ బ్యాలెన్సర్ పై ఉంచుతారు. దాని ద్వారా టైర్ల బరువును తనిఖీ చేసి, తేడాలుంటే గుర్తిస్తారు. దానిలో వంద గ్రాముల కన్నా ఎక్కువ కౌంటర్ వెయిట్ ను ఉపయోగించాల్సి వస్తే మాత్రం రిమ్ లేదా టైర్ మార్చుకోవాలని సూచిస్తారు.
టైర్ రొటేషన్
ముఖ్యంగా మూడో ప్రధాన అంశం టైర్ రొటేషన్. అంటే కారులోని టైర్ల లొకేషన్ ను మార్చడం. సాధారణంగా వెనుక టైర్లతో పోల్చితే ముందు టైర్లు అధిక ఒత్తిడికి గురవుతాయి. దానివల్ల కారు నడకలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. టైర్ల జీవితకాలం పెంచడం, మెరుగైన పనితీరు కోసం టైర్ రొటేషన్ చేయాలి. అంటే వాహనంలోని టైర్లను ముందు నుంచి వెనుకకు లేదా పక్కకు మార్చాలి. నిబంధనల మేరకు టైర్లకు ప్రతి 8000 కిలోమీటర్లకు మార్పు చేయాలి. ఈ విషయంపై నిర్లక్ష్యం చేస్తే అనేక అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా ముందు టైర్లు అరిగిపోవడం వల్ల కారు పనితీరు దెబ్బతింటుంది. ఈ సమస్యను నివారించడానికి టైర్ల రొటేషన్ చాలా అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి