SEBI Notice: పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్ శర్మకు సెబీ షోకాజ్ నోటీసులు
పేటీఎం బ్రాండ్‌తో ఆర్థిక సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ, సీఈవో విజయ శేఖర్ శర్మకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మార్చి 2024లో స్టాక్ ఆప్షన్ కింద షేర్ల కేటాయింపునకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.సెబీ ఈ నోటీసులో పేటీఎం తన ఐపీవోను తీసుకువచ్చినప్పుడు..
పేటీఎం బ్రాండ్‌తో ఆర్థిక సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ, సీఈవో విజయ శేఖర్ శర్మకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మార్చి 2024లో స్టాక్ ఆప్షన్ కింద షేర్ల కేటాయింపునకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.సెబీ ఈ నోటీసులో పేటీఎం తన ఐపీవోను తీసుకువచ్చినప్పుడు, అది విజయ్ శేఖర్ శర్మను ‘నాన్-ప్రమోటర్’గా చూపించిందని, దీనిని తప్పుబడుతున్నట్లు తెలిపింది.
2021 పేటీఎం ఐపీఓకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పబ్లిక్ ఇష్యూకు సంబంధించి ప్రమోటర్ క్లాసిఫికేషన్ రూల్స్ పాటించలేదంటూ ఆర్‌బీఐ ఇచ్చిన ఇన్‌పుట్స్ మేరకు సెబీ.. విజయ్‌శేఖర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు మాజీ బోర్డు మెంబర్లకు కూడా ఈ నోటీసులు జారీ అయినట్లు తెలిసింది. ఈ ఏడాది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
నోటీసులపై స్పందించిన పేటీఎం
సెబీ నోటీసులు జారీ చేయడంపై పేటీఎం స్పందించింది. ఇలాంటి నోటీసులు అందించడం తమకు కొత్తేమి కాదని, మార్చి 31, జూన్ 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా స్టాక్ ఆప్షన్ వివరాలు వెల్లడించామని తెలిపింది. సెబీకి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించామని కూడా తెలిపింది. నియమ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని తెలిపింది. తమ 2024 ఆర్థిక ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరించింది.
సెబీతో నిరంతరం చర్చలు:
మార్కెట్ రెగ్యులేటర్ సెబీతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు పేటీఎం తెలిపింది. సెబీ అన్ని సంబంధిత నియమాలు, నిబంధనలను పూర్తిగా అనుసరిస్తుందని కంపెనీ ఆడిట్ నివేదికలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: September 1 Rule Changes: బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్.. జేబుకు చిల్లులే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి