AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Savings Scheme: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై నిబంధనల బంధం.. కీలక రూల్స్ మార్పు

భారతదేశంలో ప్రజలను పొదుపు మార్గం వైపు నడిపించడానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ పథకాలు గ్రామీణ పోస్టాఫీసుల్లో కూడా అందుబాటులో ఉండడంతో అధిక సంఖ్యలో ప్రజలు పెట్టుబడికి ముందుకు వచ్చారు. అయితే ఇటీవల కాలంలో పెట్టుబడి ధోరణులు మారుతున్నా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

Small Savings Scheme: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై నిబంధనల బంధం.. కీలక రూల్స్ మార్పు
Post Office Saving Scheme
Nikhil
|

Updated on: Aug 27, 2024 | 3:15 PM

Share

భారతదేశంలో ప్రజలను పొదుపు మార్గం వైపు నడిపించడానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ పథకాలు గ్రామీణ పోస్టాఫీసుల్లో కూడా అందుబాటులో ఉండడంతో అధిక సంఖ్యలో ప్రజలు పెట్టుబడికి ముందుకు వచ్చారు. అయితే ఇటీవల కాలంలో పెట్టుబడి ధోరణులు మారుతున్నా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా సుకన్య సమ‌ృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, రికరింగ్ డిపాజిట్ల పథకాలు పెట్టుబడిదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి త్రైమాసికానికి వడ్డీను సవరించడంతో పాటు పెట్టుబడిపై ప్రభుత్వ భరోసా ఉంటుంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొదుపు పథకాలకు సంబంధించిన కీలక నిబంధనలను సవరించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిన్న మొత్తాల పొదపు పథకాల తాజా నిబంధనల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఏప్రిల్ 2, 1990కి ముందు తెరిచిన ఎన్ఎస్ఎస్-87 ఖాతాల ఖాతాలు మొదటి ఖాతా ప్రస్తుత స్కీమ్ రేటును అందిస్తామని, అలాగే రెండవ ఖాతా ప్రస్తుతం ఉన్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా  వడ్డీ రేటుతో పాటు బ్యాలెన్స్‌పై 2 శాతం వడ్డీ అందిస్తామని తాజా నోట్‌లో పేర్కొన్నారు. అక్టోబర్ 1, 2024 నుంచి రెండు ఖాతాలకు 0 శాతం వడ్డీ లభిస్తుంది. ఏప్రిల్ 2, 1990 తర్వాత తెరిచిన ఖాతాలు మొదటి ఖాతా ప్రస్తుత స్కీమ్ రేటును పొందుతుంది. రెండో ఖాతా ప్రస్తుత పీఓఎస్ఏ రేటును సంపాదిస్తుంది. రెండు కంటే ఎక్కువ ఖాతాలు మూడవ, అదనపు ఖాతాలకు ఎలాంటి వడ్డీ చెల్లించకుండా కేవలం ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే తిరిగి చెల్లిస్తారు. అలాగే  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాలు మైనర్ పేరుతో తెరిస్తే మైనర్‌కు 18 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే నిర్ణీత వడ్డీ రేటు చెల్లిస్తామని తాజా నోట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత వర్తించే వడ్డీ రేటు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు మాత్రమే చెల్లిస్తారు. మెచ్యూరిటీ ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతా డిపాజిట్లు వార్షిక పరిమితిలో ఉంటే ప్రాథమిక ఖాతా స్కీమ్ రేటును అందిస్తారు. ఏదైనా ద్వితీయ ఖాతాల నుంచి బ్యాలెన్స్ ప్రాథమిక ఖాతాలో విలీనం చేస్తారు. అలాగే అదనపు మొత్తాలు ఎలాంటి వడ్డీ చెల్లించకుండా కేవలం ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే చెల్లిస్తారు. పీపీఎఫ్ ఖాతాలకు సంబంధించిన ఎన్ఆర్ఐ పొడిగింపులు పీపీఎఫ్ ఖాతాలతో ఉన్న యాక్టివ్ ఎన్ఆర్ఐ రెసిడెన్సీ వివరాలు అవసరం లేని సెప్టెంబర్ 30, 2024 వరకు పీఓఎస్ఏ వడ్డీని అందిస్తారు. అక్టోబర్ 1 నుంచి ఆ ఖాతాలకు ఎలాంటి వడ్డీ చెల్లించరు. 

సుకన్య సమృద్ధి ఖాతాలు తప్పనిసరిగా చట్టపరమైన సంరక్షకులకు లేదా సహజ తల్లిదండ్రులకు సంరక్షకత్వాన్ని బదిలీ చేయాలి. పథకం మార్గదర్శకాలను ఉల్లంఘించి రెండు కంటే ఎక్కువ ఖాతాలు తెరిస్తే అదనపు ఖాతాలు మూసివేస్తారు. ఇకపై పోస్టాఫీసులు తప్పనిసరిగా ఖాతాదారులు లేదా సంరక్షకుల నుంచి తప్పనిసరిగా పాన్, ఆధార్ వివరాలను సేకరించాలి. క్రమబద్ధీకరణ అభ్యర్థనలను సమర్పించే ముందు సిస్టమ్‌ను అప్‌డేట్ చేయాలి. పోస్టాఫీసు అధికారులు తప్పనిసరిగా ఈ మార్పుల గురించి ఖాతాదారులకు తెలియజేయాలని ఆర్థిక శాఖ తన తాజా సర్క్యూలర్‌లో పేర్కొంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి