Gold ETF: బంగారంపై బంగారం లాంటి ఆదాయం… ఐదేళ్లల్లో రాబడి ఎంతంటే..?

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో పెట్టుబడిదారులు ఆలోచనలు మారాయి. గతంలో పెట్టుబడికి రక్షణ ఉండాలంటే అందరూ మెరుగైన మార్గంగా బంగారాన్ని ఎంచుకునే వారు. అయితే కాలక్రమేణ బంగారం ధర పెరుగుదల తప్పితే మెరుగైన ఆదాయం ఇవ్వడం లేదని ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే సాంప్రదాయ పెట్టుబడి మార్గంగా ఉన్న బంగారంపై కూడా ఇటీవల కాలంలో ఆదాయం సంపాదించేలా వివిధ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.

Gold ETF: బంగారంపై బంగారం లాంటి ఆదాయం… ఐదేళ్లల్లో రాబడి ఎంతంటే..?
Gold Rate
Follow us

|

Updated on: Aug 27, 2024 | 3:00 PM

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో పెట్టుబడిదారులు ఆలోచనలు మారాయి. గతంలో పెట్టుబడికి రక్షణ ఉండాలంటే అందరూ మెరుగైన మార్గంగా బంగారాన్ని ఎంచుకునే వారు. అయితే కాలక్రమేణ బంగారం ధర పెరుగుదల తప్పితే మెరుగైన ఆదాయం ఇవ్వడం లేదని ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే సాంప్రదాయ పెట్టుబడి మార్గంగా ఉన్న బంగారంపై కూడా ఇటీవల కాలంలో ఆదాయం సంపాదించేలా వివిధ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. అనేక ఇతర ఈటీఎఫ్‌ల మాదిరిగానే ఇది మార్కెట్ సమయాల్లో ఎక్స్ఛేంజ్‌లో వర్తకం చేయవచ్చు. ఒక బంగారు ఈటీఎఫ్ యూనిట్ 1 గ్రాము బంగారానికి సమానం. చాలా ఎక్కువ స్వచ్ఛత కలిగిన భౌతిక బంగారంతో మద్దతునిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లను ట్రేడ్ చేయడానికి మీకు డీమ్యాట్ ఖాతా అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ఐదేళ్లలో మంచి రాబడినిచ్చిన టాప్-5 ఈటీఎఫ్‌ల గురించి తెలుసుకుందాం.

ఎల్ఐసీ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్

ఎల్ఐసీ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ 5 సంవత్సరాలలో వార్షికంగా 12.37 శాతం ఇచ్చింది. దీని నిర్వహణలో ఆస్తులు (ఏయూఎం) రూ. 127.1 కోట్లుగా ఉంది. దాని నికర ఆస్తి విలువ రూ. 6528.0936గా ఉంది. ఈటీడీలో కనీస పెట్టుబడి రూ. 10,000గా ఉంటుంది. ఈటీఎఫ్‌లో రూ. 10,000 నెలవారీ ఎస్ఐపీ 5 సంవత్సరాలలో రూ. 8,48,285 ఇచ్చింది.

ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్

ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ 5 సంవత్సరాలలో 12.31 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. ఈటీఎఫ్ రూ.10,000 నెలవారీ ఎస్ఐపీ 5 సంవత్సరాలలో రూ.8,36,834కి పెరిగింది.

ఇవి కూడా చదవండి

యాక్సిస్ గోల్డ్ ఇటిఎఫ్

యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ 5 సంవత్సరాల కాల వ్యవధిలో 12.22 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. ఇది రూ. 915.62 కోట్ల ఆస్తిని కలిగి ఉండగా దాని ఎన్ఏవీ రూ. 60.654గా ఉంది. ఈటీఎఫ్‌లో కనీస పెట్టుబడి రూ. 5,000గా ఉంది. ఈటీఎఫ్‌లో రూ.10,000 నెలవారీ ఎస్ఐపీ రూ.8,33,157గా మారింది.

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఇటిఎఫ్

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్ 5 సంవత్సరాలలో 12.18 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. దీని ఏయూఎం రూ. 769.51 కోట్లు, దాని ఎన్ఏవీ రూ. 63.8258గా ఉంది. ఈటీఎఫ్‌లో కనీస పెట్టుబడి రూ. 5,000గా ఉంది. ఫండ్‌లోని రూ. 10,000 నెలవారీ SIP రూ. 8,32,056గా మార్చబడింది. 

కోటక్ గోల్డ్ ఈటీఎఫ్

కోటక్ గోల్డ్ ఈటీఎఫ్ ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో 12.12 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. దీని ఏయూఎం రూ. 4,025.86 కోట్లుగా ఉంటుంది. దాని ఎన్ఏవీ రూ. 60.9113గా ఉంది. అయితే ఈ ఈటీఎఫ్‌లో కనీస పెట్టుబడిగా రూ.100 ఉంటుంది. ఈటీఎఫ్‌లో రూ.10,000 నెలవారీ ఎస్ఐపీ 5 సంవత్సరాలలో రూ.8,32,168కి పెరిగింది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి