Google TV AI: ఏఐ బూస్ట్ సాయంతో గూగుల్ టీవీలో నయా ఫీచర్స్.. ఇక ఆ సమస్యలకు చెక్
టీవీ అనేది ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన నిత్యావసర వస్తువులా మారింది. ముఖ్యంగా గృహిణులకు టీవీ లేకపోతే ఏమీ తోచదు. అయితే మారుతున్న టెక్నాలజీకు అనుగుణంగా టీవీల్లో కూడా భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు ఇటీవల కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.
స్మార్ట్ టీవీల్లో చాలా శాతం వరకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పని చేస్తాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీల్లో గూగుల్ టీవీ యాప్ చాలా బాగా ఉపయోగపతుంది. అయితే తాజాగా ఈ గూగుల్ టీవీకు ఏఐ ఫీచర్స్ జోడిస్తూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. జెమినీ ఏఐ బూస్ట్‌తో నూతన సదుపాయాలు వినియోగదారులకు మంచి ఫీల్‌ను ఇవ్వనున్నాయి. గూగుల్ టీవీ కోసం తాజా ఏఐ పవర్డ్ అప్డ్ అయిన జెమినీ పరిచయంతో టీవీ వీక్షణ అనుభవాన్ని గూగుల్ పునర్నిర్మించనుంది. సీఈసీ 2025లో ఆవిష్కరించిన ఈ అప్‌డేట్ వినియోగదారులు కంటెంట్ కోసం శోధించే విధానాన్ని, వారి స్మార్ట్ హెూమ్‌లను ఎలా నియంత్రించాలో? మార్చడానికి ఉద్దేశించిన స్మార్ట్ ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. ఈ సంవత్సరం చివరలో ఈ అప్‌డేట్ ఎంపిక చేసిన గూగుల్ టీవీ పరికరాల్లో అందుబాటులోకి వస్తుంది.
జెమిని ఏఐ ద్వారా మన వాయిస్‌తో సెర్చ్ చేసే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఈ అప్‌డేట్‌తో వినియోగదారులు గూగుల్ టీవీలో సింపుల్‌గా సెర్చ్ చేసే అవకాశం ఉండనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న హే గూగుల్ సెర్చ్‌కంటే వినియోగదారులు ఇప్పుడు “షో టామ్ హాంక్స్ మూవీస్” లేదా “ఈ వీకెండ్‌లో వాతావరణం ఎలా ఉంది?” వంటి ప్రశ్నలను అడగవచ్చు. ఇలా సెర్చ్ చేసిన వెంటనే నేరుగా స్క్రీన్ పై చలనచిత్ర జాబితాలు లేదా వాతావరణ సూచనల వంటి సంబంధిత ఫలితాలను చూడవచ్చు. ముఖ్యంగా యూట్యూబ్, ఇతర స్ట్రీమింగ్ యాప్స్ శోధనలు గూగుల్ టీవీల్లో సౌకర్యంగా చేయవచ్చు. స్మార్ట్ సెర్చ్ ఫీచర్లతో పాటు స్మార్ట్ హెూమ్ పరికరాలను నియంత్రించడానికి జెమినీ గూగుల్ టీవీని సెంట్రల్ హబ్ మారుస్తుంది.
వినియోగదారులు టీవీ నుంచి నేరుగా లైట్లు, థర్మోస్టాట్లు, భద్రతా కెమెరాలను నిర్వహించవచ్చు. రిమోట్ లేకుండా వాయిస్ కమాండ్లను జారీ చేయడానికి వినియోగదారులను అనుమతించే ఫార్-ఫీల్డ్ మైక్రోఫోన్లతో సహా వ్యక్తిగతీకరించిన ఫీచర్లను కూడా జెమినీ అందిస్తుంది. ముఖ్యంగా వినియోగదారులు టీవీని సమీపిస్తున్నప్పుడు స్క్రీన్ వాతావరణ నవీకరణలు లేదా తాజా వార్తలతో అనుకూలీకరించిన విడ్జెట్లను ప్రదర్శిస్తుంది. గూగుల్ టీవీలో ఏఐను పొందుపరచడానికి ఈ చర్య టీవీ ఇండస్ట్రీలో ఒక పెద్ద ట్రెండ్‌ను ప్రతిబింబిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌జీ, సామ్‌సంగ్, మైక్రో సాఫ్ట్ వంటి పోటీదారులు కూడా తెలివిగా మరింత స్పష్టమైన అనుభవాలను అందించడానికి ఏఐను తమ ఉత్పత్తుల్లో చేర్చుకుంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి