CES 2025: గేమింగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మెంటల్ ఎక్కే ఫీచర్లతో హెచ్‌పీ నయా ల్యాప్‌టాప్ లాంచ్..!
ఇటీవల కాలంలో యువత ఎక్కువగా కంప్యూటర్ గేమింగ్‌ను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు గేమింగ్ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ హెచ్‌పీ సూపర్ ఫీచర్లతో నయా గేమింగ్ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. సీఈఎస్ 2025 ఈవెంట్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది.
ఇటీవల లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో సీఈఎస్ 2025 ఈవెంట్‌లో హెచ్‌పీ ఓమెన్ మ్యాక్స్ 16 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను హెచ్‌పీ ఆవిష్కరించింది . ఈ ల్యాప్‌టాప్ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌గా ప్రచారం చేస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్, నివిడా టాప్-ఆఫ్-ది-లైన్ జీఫోర్స్ ఆర్టీఎక్స్ 50 సిరీస్ జీయూయూ గ్రాఫిక్ కార్డుతో వస్తుంది. ఓమెన్ మ్యాక్స్ 16తో పాటు హెచ్’పీ అంతర్నిర్మిత గూగుల్ టీవీతో వచ్చే ఓమెన్ 32 ఎక్స్ స్మార్ట్ గేమింగ్ మానిటర్‌ను లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్, మానిటర్ అధునాత ఏఐ ఫీచర్లతో వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హెచ్‌పీ ఓమెన్ మ్యాక్స్ 16 ధర 1,699 డాలర్లు (దాదాపు రూ. 1,46,000) నుంచి ప్రారంభమవుతుంది. రాబోయే నెలల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇది రెండు రంగులలో లభిస్తుంది. సిరామిక్ వైట్ షాడో బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
హెచ్‌పీ ఓమెన్ 32 ఎక్స్ స్మార్ట్ గేమింగ్ మానిటర్ ధరను 749.99 డాలర్లు (దాదాపు రూ. 64,000)గా ఉంది. ఏప్రిల్ నుంచి ఈ గేమింగ్ మానిటర్‌ను అధికారిక బ్రాండ్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా ల్యాప్‌టాప్స్‌లో గేమ్స్ అంటే అవి త్వరగా హీట్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఆ వేడిని మెరుగ్గా నిర్వహించడం కోసం హెచ్‌పీ ఓమెన్ క్రయో కాంపౌండ్ అనే కొత్త మెటీరియల్‌ని ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. టెంపెస్ట్ కూలింగ్ ప్రో ఆర్కిటెక్చర్, ఫ్యాన్ క్లీనర్ టెక్నాలజీ వల్ల ఓవర్ హీట్ సమస్య ఉండదు. కస్టమర్‌లు హెచ్‌పీ ఒమెన్ మ్యాక్స్ ద్వారా లైట్ బార్, హైపర్ ఎక్స్ ప్రేరేపిత లాటిస్-లెస్, పర్సనలైజ్డ్ ఆర్‌జీబీ కీబోర్డ్‌ను ఎంచుకోవచ్చు
అలాగే హెచ్‌పీ తన కొత్త 32 ఎక్స్ స్మార్ట్ గేమింగ్ మానిటర్ 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 4కే స్క్రీన్‌ను అందిస్తుంది. ఇది కన్సోల్‌లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, పెరిఫెరల్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ మానిటర్ అంతర్నిర్మిత గూగుల్ టీవీతో అందుబాటులోకి తీసుకొచ్చిన తమ మొదటి ఉత్పత్తి అని కంపెనీ పేర్కొంది. ఈ మానిటర్ ఎక్స్‌టర్నల్ హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ అవసరం లేకుండా నాలుగు ప్లాట్‌ఫారమ్‌ల వరకు డిస్‌ప్లే నుంచి డైరెక్ట్ స్ట్రీమింగ్‌ను కూడా అనుమతిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి