AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto retail sale: టాప్‌గేర్‌లో ఆటో రిటైల్ మార్కెట్.. 2024లో అమ్మకాల సునామీ..!

గతంలో కనీస అవసరాలు అంటే తిండి, బట్ట, ఇల్లు అని చెప్పేవారు. ఆధునిక కాలంలో వాటితో పాటు వాహనం కూడా వచ్చి చేరింది. వీటిలో టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ తదితర వివిధ రకాల ప్రయాణ సాధనాలు ఉన్నాయి. ప్రజలు తమ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటో మొబైల్ రంగంలో రిటైల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2024లో కూడా దీనిలో మెరుగైన ప్రగతి నమోదు అయ్యింది. అంతకు ముందు ఏడాదిలో పోల్చితే దాదాపు తొమ్మిది శాతం మేర విక్రయాలు పెరిగాయి.

Auto retail sale: టాప్‌గేర్‌లో ఆటో రిటైల్ మార్కెట్.. 2024లో అమ్మకాల సునామీ..!
Nikhil
|

Updated on: Jan 08, 2025 | 4:30 PM

Share

ఆటోమొబైల్ డీలర్స్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) తెలిపిన నివేదిక ప్రకారం.. 2024లో దేశీయంగా ఆటో మొబైల్ రిటైల్ అమ్మకాల్లో పెరుగుదల నమోదైంది. అనేక ప్రతికూలతలను దాటుకుని ముందుకు సాగింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగాయి. వర్షాకాలంలో బీభత్సమైన వానలు పడి అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పట్టణాల్లో సైతం వరదలు వచ్చి, ప్రజల జన జీవనం స్పందించింది. ఇన్ని అవరోధాలను దాటుకుని వాహనాల రంగం ప్రగతి పథంలో పయనించింది. దేశీయ ఆటోమొబైల్ రంగానికి సంబంధించి 2023లో 2,39,28,293 యూనిట్ల విక్రయాలు జరిగాయి. వాటి సంఖ్య 2024లో తొమ్మిది శాతం పెరిగి 2,61,07,679 యూనిట్లకు చేరుకుంది. ముఖ్యంగా టూ వీలర్, త్రీ వీలర్ పాసింజర్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేశారు.

వివిధ కంపెనీల నుంచి మెరుగైన వాహనాలు మార్కెట్ లోకి విడుదల కావడం, ప్రజలకు వాహనాల అవసరం పెరగడం, పండగ సీజన్ తదితర పలు కారణాలతో వాహనాల అమ్మకాలు గణనీయమైన ప్రగతి సాధించాయి. కొత్త ఉత్పత్తులు, నెట్ వర్క్ విస్తరణ వంటి కూాడా మరో ప్రధాన కారణం. ఆధునిక కాలంలో పనులను సకాలంలో వేగంగా చేసుకోవాలంటే సొంత వాహనాలు చాలా అవసరం. గతంలో కుటుంబానికి ఒక వాహనం ఉంటే సరిపోయేది. కానీ నేడు పురుషులతో పాటు మహిళలు ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలు చదువుల కోసం బయట ప్రాంతాలకు వెళుతున్నారు. వీరందరూ బస్సులు, ఆటోలలో రాకపోకలు సాగించడం కుదరదు. దీంతో అందరూ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అమ్మకాలు ఇలా

  • 2024లో వివిధ రకాల వాహనాల విక్రయాలను పరిశీలిస్తే 2023లో 38,73,381 పాసింజర్ వాహనాలను అమ్ముడవ్వగా, 2024లో ఐదు శాతం పెరిగికి 40,73,843 యూనిట్లకు చేరుకున్నాయి.
  • టాక్టర్ల అమ్మకాలు మూడు శాతం పెరిగి 8,94,112కు చేరాయి. కమర్షియల్ వాహనాలకు సంబంధించి 10,04,856 వరకూ నమోదయ్యాయి.
  • త్రిచక్ర వాహనాలు 11 శాతం పెరిగి 12,21,909 వరకూ చేరుకున్నాయి.
  • టూ వీలర్లకు సంబంధించి 11 శాతం అమ్మకాలు పెరిగాయి. మొత్తం 1,89,12,959 యూనిట్లకు చేరుకున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి