AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New cars: మే నెలలో కార్ల పండగ.. కొత్తగా విడుదల కానున్న కార్లు ఇవే..!

భారత ఆటోమోటివ్ మార్కెట్ కు కొత్త ఏడాది బాగా కలిసివచ్చింది. జనవరిలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్ పోకు విశేష ఆదరణ లభించింది. ప్రపంచంలోని పలు కంపెనీలు తమ కార్లను ప్రదర్శనకు ఉంచాయి. పలు మోడళ్లను అక్కడే ఆవిష్కరించారు. కొత్త కార్లపై ప్రజలకు ఆసక్తి బాగా పెరిగింది.

New cars: మే  నెలలో కార్ల పండగ.. కొత్తగా విడుదల కానున్న కార్లు ఇవే..!
Cars
Nikhil
|

Updated on: May 05, 2025 | 4:30 PM

Share

నూతనంగా విడుదలయ్యే కార్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మే నెలలో వారి నిరీక్షణకు తెరపడనుంది. వోక్స్ వ్యాగన్, కియా, ఎంజీతో సహా పలు ప్రధాన వాహన తయారీ సంస్థలు తమ తాజా మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేయనున్నాయి. వాటి వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.

కియా క్లావిస్

  • కియా క్లావిస్ కారు మే 8వ తేదీన విడుదల కానుంది. ఆ కంపెనీకి చెందిన కారెన్స్ కారు ఆధారంగా దీన్ని రూపొందించారు. ఆకట్టుకునే బాహ్య డిజైన్, నూతన ఇంటీరియర్ తో పాటు భద్రతకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. మూడు ప్యాడ్ ఎల్ఈడీ హెడ్ లైట్లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు, నిటారుగా ఉండే ఫ్రంట్ ఫేసియా, అల్లాయ్ వీల్స్, ముందు వెనుక బంపర్లు చాలా బాగున్నాయి. కారెన్స్ కారకు పూర్తిగా భిన్నమైన లుక్ ను తీసుకువచ్చారు. ఇంటీరియల్ డిజైన్ గురించి వివరాలు అందుబాటులో లేవు.
  • పనోరమిక్ సన్ రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్, వైర్ లెస్ చార్జర్, యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా అదనపు ప్రత్యేకతలు.
  • 1.5 లీటర్ టర్బో డీజిల్, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోలు, 1.5 లీటర్ టర్బో పెట్రోలు ఇంజిన్ల ఎంపికల్లో అందుబాటులో ఉంది.

ఎంజీ విండ్సర్

  • ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారును మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. దీనిలో 50 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. సింగిల్ చార్జింగ్ పై సుమారు 460 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. మోటారు మాత్రం ప్రస్తుత వెర్షన్ మాదిరిగానే ఉండనుంది. అనేక అదనపు ఫీచర్లను కూడా తీసుకువచ్చారు. వాటిలో టెయిల్ గేట్ పై అడాస్ బ్యాడ్జీ, ముందు విండ్ షీల్డ్ పై రాడారా మాడ్యూల్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఆకట్టుకుంటున్నాయి.
  • ఇప్పటికే విండ్సర్ ఈవీ 38 కేడబ్యూహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉంది. పూర్తి స్థాయి సింగిల్ చార్జింగ్ పై సుమారు 332 కిలోమీటర్ల రేంజ్ ఇస్తోంది.

వోక్స్ వ్యాగన్ గోల్ప్ జీటీఐ

జర్మన్ తయారీ సంస్థ అయిన వోక్స్ వ్యాగన్ నుంచి గోల్ప్ జీటీఐ కారు మే నెలలో విడుదల కానుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కారు బుక్కింగ్ లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారు నాలుగు ఆకట్టుకునే రంగుల్లో అందుబాటులోకి రానుంది. దీనిలోని 2 లీటర్ల టర్బో పెట్రోలు ఇంజిన్ నుంచి 265 పీఎస్ శక్తి, 370 ఎన్ ఎం టార్కు విడుదలవుతుంది. కేవలం 5.9 సెకన్ల లో సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కు జత చేశారు.

టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్

  • నవీకరించిన టాటా ఆల్ట్రోజ్ 2025 కారును మే నెలలో విడుదల చేయనున్నారు. 2020లో విడుదలైన కారుకు ఇది ఫేస్ లిఫ్ట్ అని చెప్పవచ్చు. ఈ ప్రీమియం హచ్ బ్యాక్ కారు అమ్మకాలు కొన్నేళ్లుగా జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్ లిఫ్ట్ ను అదిరే లుక్ తో తీసుకువచ్చారు. ఆధునిక హెడ్ ల్యాంపులు, ప్లష్ టైప్ డోర్ హ్యాండిళ్లు, కొత్త 3 డీ స్టైల్ రేడియేటర్ గ్రిల్, టెయిల్ ల్యాంపులు బాగున్నాయి. లోపల టాటా లోగోతో రెండు స్పోక్ స్టీరింగ్ వీల్, కొత్త ఇంటర్ ఫేస్ తో కూడిన టచ్ స్క్రీన్, డాష్ బోర్డు, ఏసీ నియంత్రణ, సెంటర్ కన్సోల్ ఆకర్షణీయంగా ఉన్నాయి.
  • 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోలు, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ల ఎంపికతో పాటు, ట్విన్ సిలిండర్ లేఅవుట్ తో సీఎన్జీ వేరియంట్ అందుబాటులోకి రానుంది. ట్రాన్స్ మిషన్ ఎంపికలలో వేరియంట్ ను బట్టి 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ డీసీటీ ఉంటాయి.