AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Car: సేల్స్‌లో ఆ మారుతీ కారు నయా రికార్డు.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు

భారతదేశంలోని ప్రజలకు సొంత కారు అనేది ఓ ఎమోషన్. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్‌తో వచ్చే కార్ల కొనుగోలు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఆకట్టుకునేలా మారుతీ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీ రిలీజ్ బాలెనో కారు అమ్మకాల్లో కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో మారుతీ బాలెనో కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Maruti Car: సేల్స్‌లో ఆ మారుతీ కారు నయా రికార్డు.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు
Maruti Baleno
Nikhil
|

Updated on: May 05, 2025 | 5:00 PM

Share

యూజ్డ్ కార్లపై ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం మారుతీ కంపెనీ ఒకే రోజులో 800కి పైగా బాలెనో కార్లను డెలివరీ చేసింది. కొనుగోలుదారులకు అగ్ర ఎంపికలలో మారుతి సుజుకి బాలెనో ఉంది. ఇది హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, రెనాల్ట్ క్విడ్‌లతో పాటు డిమాండ్‌లో అగ్రస్థానంలో ఉంది . బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ ఎన్‌సీఆర్ వంటి నగరాల్లోని కొనుగోలుదారులు అక్షయ తృతియ సందర్భంగా భారీగా కార్లను కొనుగోలు చేశారని నివేదికలో వెల్లడించారు. ఆ రోజు అహ్మదాబాద్, చెన్నై కూడా ఈ రోజు రికార్డు స్థాయిలో అమ్మకాలకు దోహదపడ్డాయి. 

యూజ్డ్ కార్ల విభాగంలో బాలెనో ప్రేక్షకుల అభిమాన కారుగా నిలిచింది. ప్రీ-ఓన్డ్ విభాగంలో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని బలోపేతం చేసింది. వాస్తవానికి గత నెలలో మొత్తం డెలివరీలలో మారుతి, హ్యుందాయ్, హోండా కలిసి 63 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. అలాగే చాలా మంది యూజ్డ్ కార్ల కొనుగోలుదారులకు పెట్రోల్ ఎంపిక ఇంధనంగా కొనసాగుతోంది. డెలివరీ చేసిన వాహనాల్లో 85 శాతానికి పైగా ఈ కార్లే ఉన్నాయి. 

స్టైల్ విషయానికి వస్తే తెలుపు, గ్రే, ఎరుపు రంగులను వినియోగదారులు అమితంగా ఆకర్షిస్తున్నాయని పేర్కొంటున్నారు. అమ్మకాల్లో ఇవి దాదాపు 60 శాతానికి పైగా ఉన్నాయి. ఫైనాన్సింగ్, ఎక్స్‌ఛేంజ్ స్కీమ్స్ వల్ల కూడా యూజ్డ్ కార్లకు డిమాండ్ పొందుతున్నాయి. లోన్-బ్యాక్డ్ కొనుగోళ్లలో 28 శాతం పెరుగుదల ఉంది. 500 కంటే ఎక్కువ మంది కస్టమర్లు తమ పాత వాహనాలను మార్చుకోవడానికి ఎంచుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ]

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి