LIC Saral Pension: ఎల్‌ఐసీ నుంచి కొత్త యాన్యూటీ పింఛన్ ప్లాన్.. ఎల్‌ఐసీ సరళ్ ప్లాన్ ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
చాలా మంది ఎల్‌ఐసీలో పెట్టుబడి అంటే కేవలం బీమా పథకాలు మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ ఎల్‌ఐసీ కూడా ఇతర ఇన్సూరెన్స్ సంస్థల నుంచి పెరిగిన పోటీకు అనుగుణంగా వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీ ఆగస్టు 2022లో వ్యక్తిగత తక్షణ యాన్యుటీ ప్లాన్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ అప్‌ఫ్రంట్ సింగిల్ ప్రీమియం పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీ సరళ్ పేరుతో ప్రకటించిన ఈ పథకం యాన్యుటీ ప్లాన్. ఈ ప్లాన్ ప్రారంభంతో దాదాపు 5 శాతం యాన్యుటీ రేటు హామీ ఇస్తారు.
భారతీయులు ఎక్కువగా పెట్టుబడి అంశానికి వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) పాలసీల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఎల్‌ఐసీ పాలసీల ద్వారా ప్రతి నెలా కొంత మొత్తం పొదుపుతో బీమా పాలసీలు అందిస్తుండడంతో ఎల్‌ఐసీ బీమా పాలసీల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. అయితే చాలా మంది ఎల్‌ఐసీలో పెట్టుబడి అంటే కేవలం బీమా పథకాలు మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ ఎల్‌ఐసీ కూడా ఇతర ఇన్సూరెన్స్ సంస్థల నుంచి పెరిగిన పోటీకు అనుగుణంగా వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీ ఆగస్టు 2022లో వ్యక్తిగత తక్షణ యాన్యుటీ ప్లాన్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ అప్‌ఫ్రంట్ సింగిల్ ప్రీమియం పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీ సరళ్ పేరుతో ప్రకటించిన ఈ పథకం యాన్యుటీ ప్లాన్. ఈ ప్లాన్ ప్రారంభంతో దాదాపు 5 శాతం యాన్యుటీ రేటు హామీ ఇస్తారు. ఈ ఎల్‌ఐసీ ప్లాన్ కింద యాన్యుటింట్‌కు అతను లేదా ఆమె జీవించి ఉన్నంత వరకు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షిక చెల్లింపును ఎంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
అర్హత
ఎల్‌ఐఈ సరళ్ పింఛన్ ప్లాన్ వివరాల ప్రకారం ఈ పథకంలో 40 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు చేరవచ్చు. ఈ వయస్సు ఉన్న వారు ఎవరైనా ఈ యాన్యుటీ పెన్షన్ స్కీమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునే వీలు ఉంటుంది.
పింఛన్ లెక్కింపు ఇలా
ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ తీసుకున్న పాలసీదారు ఈ పథకం కింద కనీసం రూ.1,000 నెలవారీ పింఛన్ లేదా రూ.12,000 వార్షిక పింఛన్‌ను ఎంచుకోవచ్చు . ఈ కనీస పింఛన్ కోసం ఒక వ్యక్తి రూ.2.50 లక్షలను ఒకేసారి సింగిల్ ప్రీమియం చెల్లించాలి. ఒక పెట్టుబడిదారు రూ.10 లక్షల సింగిల్ ప్రీమియం పెట్టుబడిపై రూ. 50,250 వార్షిక పెన్షన్ పొందుతారు. పెట్టుబడిదారుడు ఈ పథకం కింద రూ.1 లక్ష వార్షిక పెన్షన్ కావాలనుకుంటే రూ.20 లక్షల ప్రీమియం చెల్లింపును ముందస్తుగా చెల్లించాలి.
ఎల్‌ఐసీ సరళ్ ప్లాన్ ప్రయోజనాలివే
లోన్ బెనిఫిట్
ఈ పాలసీ ప్రారంభించి ఆరు నెలలు పూర్తయిన తర్వాత ఈ ఎల్‌ఐసీ ప్లాన్ కింద లోన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఎగ్జిట్ ప్లాన్
ప్రారంభించిన ఆరు నెలల తర్వాత ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ నుంచి నిష్క్రమించవచ్చు.
ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ వడ్డీ
ఈ పథకంలో యాన్యుటీ ప్లాన్ దాదాపు 5 శాతం వార్షిక రాబడిని హామీ ఇస్తుంది.
జీవితకాల పెన్షన్ ప్రయోజనం
ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ అనేది మొత్తం జీవిత పాలసీ. అంటే పాలసీదారుడు ప్రారంభమైన తర్వాత జీవితాంతం వార్షిక లేదా నెలవారీ పెన్షన్‌కు అర్హులు.
నామినీకి డెత్ బెనిఫిట్
ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ సబ్‌స్క్రైబర్ మరణించిన తర్వాత బేస్ ప్రీమియం నామినీకి తిరిగి ఇస్తారు.
మెచ్యూరిటీ ప్రయోజనం
ఎల్‌ఐసీ సరళ్ పింఛన్ ప్లాన్‌లో పాలసీదారు జీవించి ఉన్నంత వరకు పింఛన్ అందుబాటులో ఉన్న కారణంగా మెచ్యూరిటీ ప్రయోజనం ఉండదు.
మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..