Tax Saving FD Interest Rate: ఎఫ్‌డీ చేసే వారికి గుడ్ న్యూస్.. ఈ బ్యాంకుల్లో అత్యధిక వడ్డీతోపాటు పన్ను ఆదా.. మిస్ చేసుకోవద్దు..
పన్ను రాయితీలతో కూడిన ఎఫ్ డీలు చాలా బ్యాంకులు అందిస్తాయి. కానీ అన్నింట్లోనూ వ్డడీ రేటు ఒకేలా ఉండదు. బ్యాంకులను బట్టి మారుతుంటుంది. అతి పెద్ద జాతీయ బ్యాంకు అయిన ఎస్ బీఐలో వడ్డీ రేటు అధికంగా ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే ఎస్బీఐలో కన్నా అధిక రేట్లు అందించే బ్యాంకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్లు ఎస్బీఐ కన్నా ఎక్కువ వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు, ఆ స్కీమ్ ల గురించి తెలుసుకుందాం రండి..
ఫిక్స్‌డ్ డిపాజిట్ అన్ని బ్యాంకుల్లోనూ అవకాశం ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకుల్లో మాత్రమే అధిక వడ్డీతోపాటు పన్ను రాయితీ వర్తిస్తుంది. వాస్తవంగా ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్లపై వ్యక్తులు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం రూ. 1.5లక్షల వరకూ పన్ను రాయితీ పొందుతారు. అయితే ఈ పన్ను రాయితీతో కూడిన ఎఫ్ డీ లకు ఐదేళ్ల లాకిన్ పిరీయడ్ ఉంటుంది. ఐదేళ్ల కాలవ్యవధి కలిగి, పన్ను రాయితీలతో కూడిన ఎఫ్ డీలు చాలా బ్యాంకులు అందిస్తాయి. కానీ అన్నింట్లోనూ వ్డడీ రేటు ఒకేలా ఉండదు. బ్యాంకులను బట్టి మారుతుంటుంది. అతి పెద్ద జాతీయ బ్యాంకు అయిన ఎస్ బీఐలో వడ్డీ రేటు అధికంగా ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే ఎస్బీఐలో కన్నా అధిక రేట్లు అందించే బ్యాంకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్లు ఎస్బీఐ కన్నా ఎక్కువ వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు, ఆ స్కీమ్ ల గురించి తెలుసుకుందాం రండి..
ఎస్బీఐ లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్ డీపై సాధారణ ప్రజలకు 6శాతం, సీనియర్ సిటీజెన్స్ కు 7శాతం వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే ప్రముఖ ప్రైవేటు బ్యాంకులైన హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ వంటివి ఎస్బీఐ కన్నా అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.
- ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాక్స్ సేవర్ స్కీమ్.. ఇది సాధారణ పౌరులకు 7.25% , సీనియర్ సిటిజన్లకు 8.00% వడ్డీని అందిస్తోంది.
- ఆర్బీఎల్ బ్యాంక్ టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 7.1% , సీనియర్ సిటిజన్లకు 7.6% వడ్డీని అందిస్తోంది.
- హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ : ఇది సాధారణ పౌరులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని అందిస్తోంది.
- కెనరా బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ : ఇది సాధారణ పౌరులకు 6.70%, సీనియర్ సిటిజన్లకు 7.20% వడ్డీని అందిస్తోంది.
- యాక్సిస్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీని అందిస్తోంది.
- ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీని అందిస్తోంది.
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 6.70%, సీనియర్ సిటిజన్లకు 7.20% వడ్డీని అందిస్తోంది.
- ఐసీఐసీఐ బ్యాంక్ ట్యాక్స్ సేవర్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.50% వడ్డీని అందిస్తోంది.
- పీఎన్బీ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.30% వడ్డీని అందిస్తోంది.
- బ్యాంక్ ఆఫ్ బరోడా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.15% వడ్డీని అందిస్తోంది.
- ఎస్బీఐ పన్ను ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00% వడ్డీని అందిస్తోంది.
- పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్: ఇది సాధారణ పౌరులకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీని అందిస్తోంది.
- ఐడీబీఐ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఇది సాధారణ పౌరులకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00% వడ్డీని అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..