LIC Saral Pension: ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు.. జీవితాంతం రూ. 1 లక్ష పెన్షన్ పొందవచ్చు.. వివరాలివే..

ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగం పదవీ విరమణ తరువాత ఆర్థిక భద్రత కోసం చాలా మంది పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం వంటివి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తరువాత నెలవారీ పెన్షన్ పొందుతారు. మరి ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ తప్ప మరో ఇతర ఆప్షన్ లేదు.

LIC Saral Pension: ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు.. జీవితాంతం రూ. 1 లక్ష పెన్షన్ పొందవచ్చు.. వివరాలివే..
Pension
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 11, 2023 | 5:42 PM

ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగం పదవీ విరమణ తరువాత ఆర్థిక భద్రత కోసం చాలా మంది పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం వంటివి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తరువాత నెలవారీ పెన్షన్ పొందుతారు. మరి ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ తప్ప మరో ఇతర ఆప్షన్ లేదు. ఇతర పెన్షన్ పథకాలలో డబ్బు పెట్టుబడి పెట్టకపోతే వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ.. ‘సరళ్ పెన్షన్’ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ పథకంలో చాలామంది ప్రజలు పెట్టుబడి పెడుతున్నారు. ఇతర ఈక్విటీల్లో అనిశ్చితి, ఒడిదుడుకుల కారణంగా.. వాటిల్లో పెట్టుబడి పెట్టే బదులు, ఎల్ఐసీ సరళ్‌ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. తద్వారా పదవీ విరమణ తరువాత నెలకు కొంత మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

ఒకసారి ప్రీమియం చెల్లిస్తే చాలు..

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్‌లో వృద్ధాప్యంలో పెన్షన్ అందిస్తుంది. ఈ ప్లాన్ 40 నుంచి 80 సంవత్సరాల వయస్సు వారికి వర్తిస్తుంది. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. కనీస పెట్టుబడి రూ. 2.5 లక్షలు. గరిష్టంగా ఎంతైనా పెట్టొచ్చు. రూ. 2.50 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ .1000 లేదా సంవత్సరానికి రూ .12,000 పెన్షన్ వస్తుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం వారీగా మీకు అనువైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

రూ. 10 లక్షల ప్రీమియం చెల్లిస్తే..

ఈ స్కీమ్‌లో రూ. 10 లక్షల ప్రీమియం చెల్లిస్తే సంవత్సరానికి రూ. 64,350 పెన్షన్ పొందవచ్చు. ఇక వార్షిక పెన్షన్ రూ. లక్ష కావాలంటే ప్రీమియం రూ. 20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో భాగంగా పెన్షన్ పెట్టుబడిదారుడి జీవితాంతం వస్తుంది. మరణానంతరం మొత్తం ప్రీమియం మీ నామినీకి అందించడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

నామినీకి కూడా పెన్షన్..

ఒకవేళ మీ మరణానంతరం నామినీకి పెన్షన్ ప్రయోజనం కొనసాగాలనుకుంటే.. ఆ సదుపాయం కూడా కల్పించింది ఎల్ఐసీ. సరళ్ పెన్షన్‌ ప్లాన్‌ను తీసుకునే సమయంలో రెండు ఆప్షన్ ఇస్తారు. మొదటి ఆప్షన్‌లో పెట్టుబడిదారుడికి మాత్రమే పెన్షన్ అందుతుంది. వారి మరణానంతరం ప్రీమియం మొత్తం నామినీకి చెల్లించడం జరుగుతంది. ఇక రెండో ఆప్షన్‌లో ఉమ్మడి లబ్ధిదారు సౌకర్యం ఉంటుంది. ఇందులో ఇన్వెస్టర్ చనిపోయినప్పటికీ.. రెండవ వ్యక్తికి పెన్షన్ కొనసాగుతుంది. అయితే, రెండో ఆప్షన్‌లో వచ్చే పెన్షన్.. మొదటి ఆప్షన్‌లో వచ్చే పెన్షన్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ ఇతర ప్రయోజనాలు..

ఎల్ఐసీ సరళ్ పెన్షన్‌ ప్లాన్‌లో ప్రీమియం చెల్లించిన 6 నెలల తరువాత లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు పాలసీ నచ్చకపోతే ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది. ఇది పెన్షన్ స్కీమ్ అయినందున.. ఇందులో మెచ్యూరిటీ ప్రయోజనం ఉండదు.

మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..