Adolf Hitler: హిట్లర్ నా హీరో అన్నాడు.. దెబ్బకు దిగ్గజ టెక్ కంపెనీలో మంచి జాబ్ పోగొట్టుకున్నాడు
నరరూప రాక్షసుడికి నిలువెత్తు సాక్ష్యంగా హిట్లర్ ను అభివర్ణిస్తారు. అటువంటి వాడిని హీరో అంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయం షేర్ చేశాడో యువకుడు. అంతే.. కొద్ది నిమిషాలలోనే ఆ పోస్ట్ వైరల్ అయింది. దాని తరువాత కొన్ని గంటల్లో అతని సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఊడిపోయింది.

ప్రపంచాన్ని గడగడ లాడించిన నియంత.. కొన్ని లక్షల మంది ప్రజల్ని క్రూరంగా చంపేసిన నాయకుడు హిట్లర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. చరిత్ర పుటలలో హిట్లర్ అంటేనే ఒక భయానక మనిషికి ప్రతిరూపంగా నిలిచిన పేరు. నరరూప రాక్షసుడికి నిలువెత్తు సాక్ష్యంగా హిట్లర్ ను అభివర్ణిస్తారు. అటువంటి వాడిని హీరో అంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయం షేర్ చేశాడో యువకుడు. అంతే.. కొద్ది నిమిషాలలోనే ఆ పోస్ట్ వైరల్ అయింది. దాని తరువాత కొన్ని గంటల్లో అతని సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఊడిపోయింది. నీరభ్ మెహ్రోత్రా అనే యువకుడు డెలాయిట్‌లో అసోసియేట్ డైరెక్టర్, రిస్క్ అడ్వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా నీరభ్ ‘ఫ్రైడే ఇన్స్పిరేషన్’ అనే కొటేషన్‌తో అడాల్ఫ్ హిట‍్లర్ ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ నియంతపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘ఇటీవల నేను ది డార్క్ చార్మ్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్ బుక్ కొనుగోలు చేశా. ఆ బుక్ చదివే కొద్దీ ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తుంది. ముఖ్యంగా అందులో హిట్లర్ గురించి, వరల్డ్ వార్ 2 పై ఈ బుక్ నాకు సరైన అవగాహన ఇచ్చింది’’ అని మెహ్రోత్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. దీంతో పాటు అడాల్ఫ్ హిట్లర్‌లోని కొన్ని లక్షణాల్ని మనం ఆకళింపు చేసుకోవాలి. ఈ పుస్తకం చదివిన తర్వాత నేను హిట్లర్ అభిమానిగా మారిపోయా’ అని అందులో రాసుకొచ్చాడు.
ఒక్క పోస్టుతో జాబ్ ఫసక్..
అంతే ఒక్కసారిగా నీరభ్ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అడాల్ఫ్ హిట్లర్‌ను పొగుడుతావా? అంటూ నెటిజన్లు మెహ్రోత్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. వెంటనే తన తప్పు సరిదిద్దుకునేలా నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. క్షమించండి అంటూ బహిరంగ లేఖ రాశారు. అయితే.. ఆ పోస్ట్ అప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. దీంతో కొద్ది సేపటికే నీరభ్ పనిచేస్తోన్న డెలాయిట్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మెహ్రూత్రా ఇకపై తమ కంపెనీలో పనిచేయడం లేదని అందులో పేర్కొంది. ‘గత నెలలో మా సంస్థలో చేరిన ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు మా సంస్థ భాగస్వామ్య విలువలకు అనుగుణంగా లేవు. నీరభ్ అంతర్గత విధానాలను ఉల్లంఘించారు. ఈ ఉద్యోగి ఇకపై డెలాయిట్ ఇండియాలో పని చేయడు’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. చూశార.. ఒక్క పోస్ట్ దిగ్గజ కంపెనీలో ఉద్యోగాన్ని పోగొట్టింది. అందుకే మరి సోషల్ మీడియాలో ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి అని చెప్పేది అంటున్నారు నెటిజన్లు.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..