Layoffs: సాఫ్ట్‌వేర్ రంగంపై మాంద్యం ప్రభావం.. ఆ పేరుతో వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ప్రముఖ టెక్ కంపెనీ..
Layoff 10,000 Employees: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం చూపుతోంది. దీంతో భవిష్యత్తులో పరిస్థితిలు మరింత దయనీయంగా ఉండవచ్చనే అంచనాలతో చాలా టెక్ కంపెనీలు.. ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి. దీనిలో భాగంగా రకరకాల పేర్లతో ఉద్యోగుల..
Google To Layoff 10,000 Employees: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం చూపుతోంది. దీంతో భవిష్యత్తులో పరిస్థితిలు మరింత దయనీయంగా ఉండవచ్చనే అంచనాలతో చాలా టెక్ కంపెనీలు.. ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి. దీనిలో భాగంగా రకరకాల పేర్లతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి సంస్థలు. ఇప్పటికే చాలా కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్ కూడా తన సంస్థలో దాదాపు పది వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. అమెజాన్, ఫేస్‌బుక్, ట్విట్టర్, మీషో… ఇలా ఎన్నో సంస్థలు ఇటీవల కాలంలో తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ.. ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ సంస్థ కూడా ఈ జాబితాలో చేరింది. గూగుల్ రివ్యూ అండ్ డెవలప్‌మెంట్ (GRAD) పేరుతో పది వేల మంది ఉద్యోగులను తొలగించ నుందని వార్తలు వస్తున్నాయి. కంపెనీ నిర్ణయంపై ఉద్యోగులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానం GRAD పై ఉద్యోగులు ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లోనే పలు టెక్ కంపెనీలు 45,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. గతంలోనే గూగుల్ కూడా తన ఉద్యోగుల సంఖ్యను కుదించనుందన్న వార్తలు రాగా.. ప్రస్తుతం దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Google సంస్థ ఈ ఏదాడి రివ్యూ అండ్ డెవలప్‌మెంట్ పేరుతో ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగుల పనితీరును అంచనావేయడానికి, సమీక్షించడానికిగానూ ఈ కొత్త విధానాన్ని పరిచయం చేయగా.. కొత్త వ్యవస్థలో విధానపరమైన, సాంకేతికపరమైన సమస్యలపై కంపెనీ ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు.
ఈ కొత్త ర్యాంకింగ్ విధానంలో కంపెనీ ఫుల్‌టైమ్ ఉద్యోగుల్లో దాదాపు 6 శాతం మంది తక్కువ ర్యాంకింగ్ కేటగిరీలోకి వస్తారని, అంతకుముందు కేవలం 2 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఈ కేటగిరీలోకి వచ్చేవారని కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు. అదే సమయంలో కొత్త ర్యాంకింగ్ విధానంలో ఎక్కువ మార్కులు సాధించడం కష్టమని, ఈ విధానంలో 22 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నత ర్యాంకు పొందుతారని అంచనా వేయగా, అంతకుముందు అలాంటి ఉద్యోగుల సంఖ్య 27 శాతంగా ఉండేదని ఉద్యోగులు అంటున్నారు. గూగుల్ సంస్థ తీసుకున్న నిర్ణయం పది వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని పలు వార్తా సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా.. కంపెనీ తన ఖర్చును తగ్గించుకోవడానికి మాత్రమే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..