Multibagger Stocks: ఈ ఏడాది కళ్లు చెదిరే లాభాలు అందించిన 5 మల్టీబ్యాగర్ స్టాక్స్.. లక్ష పెట్టుబడితో రూ.5 లక్షలు..
ఈ ఏడాది ప్రారంభంలో ఒక వ్యక్తి ఈ స్టాక్‌లో లక్ష రూపాయల పెట్టుబడి పెడితే, అతని పెట్టుబడి విలువ సుమారు రూ.5.80 లక్షలకు పెరిగి ఉండేది.
మీరు మీ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా.. అయితే, ఈ 5 స్టాక్‌లలను ఎంచుకుంటే మంచి రాబడిని ఆశించవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్స్ తమ ఇన్వెస్టర్లకు 480 శాతం వరకు మెరుగైన రాబడిని ఇచ్చాయి. స్టాక్ మార్కెట్ నిపుణులు సాధారణంగా పెట్టుబడిదారులకు ప్రాథమికంగా బలమైన స్టాక్‌లలో డబ్బును పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తుంటారు. అయితే, కొన్నిసార్లు అధిక రిస్క్ స్టాక్‌లలో పెట్టుబడి కూడా లాభాలకు దారితీస్తుంది. అదేవిధంగా, 2022లో మెరుగైన మల్టీబ్యాగర్‌గా నిరూపితమైన ఓ 5 పెన్నీ స్టాక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
స్విస్ మిలిటరీ కన్స్యూమర్ గూడ్స్ షేర్లు..
ఈ ఏడాది ఇప్పటివరకు ఈ స్టాక్ 261 శాతం పెరిగింది. స్విస్ మిలిటరీ కన్స్యూమర్ గూడ్స్ షేర్లు శుక్రవారం 1.59 శాతం జంప్‌తో రూ.21.4 వద్ద ట్రేడవుతున్నాయి.
శాంతి ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్..
శాంతి ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ స్టాక్ ఈ సంవత్సరం ఇప్పటివరకు దాని పెట్టుబడిదారులకు 626 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ స్టాక్‌లో సుమారు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టిన వారికి సుమారు రూ.7.26 లక్షలకు పెంచింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ షేరు 1.38 శాతం పతనంతో రూ.67.9 వద్ద ట్రేడవుతోంది.
క్రెసాండా సొల్యూషన్స్..
క్రెసాండా సొల్యూషన్స్ షేర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు ఇన్వెస్టర్లకు 480 శాతం రాబడిని అందించాయి. ఇందులో ఈ ఏడాది ప్రారంభంలో ఒక వ్యక్తి ఈ స్టాక్‌లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతని పెట్టుబడి విలువ రూ.5.80 లక్షలకు పెరిగి ఉండేది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ షేరు 2.07 శాతం పతనంతో రూ.37.9 స్థాయిలో ట్రేడవుతోంది.
ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా..
ఈ స్టాక్ 2022లో ఇప్పటివరకు 112 శాతం పెరిగింది. శుక్రవారం ఈ షేరు 1.42 శాతం పతనంతో రూ.38.2 స్థాయిలో ట్రేడవుతోంది.
MPS ఇన్ఫోటెక్నిక్స్..
MPS ఇన్ఫోటెక్నిక్స్ షేర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు పెట్టుబడిదారులకు 141 శాతం రాబడిని అందించాయి. శుక్రవారం ఈ షేరు 7.12 శాతం జంప్‌తో ట్రేడవుతోంది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది పెట్టుబడి సలహా మాత్రం కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం నష్టాలను కూడా కలిగి ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించి, నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం తీసుకోండి.