Gautam Adani: ఇంతింతై వటుడింతై.. ప్రపంచ కుబేరుల జాబితాలో నెం 2గా అదానీ.. ముకేశ్‌ అంబానీ ఎక్కడున్నారంటే..

Gautam Adani: కాలేజీ డ్రాపవుట్‌ స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలోకి చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ వ్యాపార ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగుతోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో మొన్నటి వరకు మూడో స్థానంలో నిలిచిన గౌతమ్‌ అదానీ...

Gautam Adani: ఇంతింతై వటుడింతై.. ప్రపంచ కుబేరుల జాబితాలో నెం 2గా అదానీ.. ముకేశ్‌ అంబానీ ఎక్కడున్నారంటే..
Gautam Adani
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 16, 2022 | 3:49 PM

Gautam Adani: కాలేజీ డ్రాపవుట్‌ స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలోకి చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ వ్యాపార ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగుతోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో మొన్నటి వరకు మూడో స్థానంలో నిలిచిన గౌతమ్‌ అదానీ ఇప్పుడు మరో మెట్టు పైకి ఎక్కారు. అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ లాభాలతో గౌతమ్‌.. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు. ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలయనీర్ల జాబితా ప్రకారం సెప్టెంబర్‌ 16, 2022 నాటికి అదానీ నికర ఆదాయం ఏకంగా 155.7 బిలియన్‌ డాలర్లుగా చేరింది. అంటే అదానీ సంపద 4 శాతం పెరిగింది. మన కరెన్సీలో చెప్పాలంటే ప్రస్తుతం గౌతమ్‌ అదానీ నికర ఆదాయం అక్షరాలు రూ. 12.37 లక్షల కోట్లు.

దీంతో అమెజాన్ అధినేత జెఫ్‌ బెజోస్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నారు. ఇక ప్రస్తుతం 273.5 బిలియన్‌ డాలర్ల నికర విలువతో టెస్లా సీఈవో ఎలాన్‌ మాస్క్‌ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రపంచ ధనవంతుల టాప్‌ 10 జాబితాలో భారత్‌కు చెందిన మరో అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ 8వ స్థానంలో నిలిచారు.92.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆయన ఈ స్థానం దక్కించుకున్నారు. ఇక ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్న తొలి భారత, ఆసియా వ్యక్తి అదానీయే కావడం విశేషం.

మార్చిలో రెగ్యులేటరీలకు సమర్పించిన వివరాల ప్రకారం.. అదానీ టోటల్‌ గ్యాస్‌లో అతని పేరు మీద 37 శాతం, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లో 65 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీలో 61 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్స్‌లో 75 శాతం వాటాలు గౌతమ్‌ అదానీ పేరు మీద ఉన్నాయి. ఇక మార్కెట్‌ ఇలాగే అనుకూలిస్తే గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..