T20 World Cup 2022: ఈ కెప్టెన్ హిట్లర్ కంటే డేంజర్.. అనుకూలంగా మాట్లాడితేనే జట్టులో చోటు.. లేదంటే వేటే..

Pakistan Cricket Team: పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయడంలో కెప్టెన్ బాబర్ అజామ్ కీలక పాత్ర పోషించాడని భావిస్తున్నారు. జట్టు ఎంపికకు ముందు షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం చేసిన ట్వీట్స్ చాలా చర్చనీయాంశంగా మారాయి.

T20 World Cup 2022: ఈ కెప్టెన్ హిట్లర్ కంటే డేంజర్.. అనుకూలంగా మాట్లాడితేనే జట్టులో చోటు.. లేదంటే వేటే..
Asia Cup 2022 India Vs Pakistan Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Sep 16, 2022 | 3:37 PM

T20 World Cup 2022: బాబర్ ఆజంతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలంట. పాకిస్థాన్ ఆటగాళ్లు నోరు అదుపులో పెట్టుకుంటే జట్టులో చోటు దక్కుతుంది. అలా కాదని వ్యతిరేకంగా మాట్లాడితే జట్టుకు దూరంగా ఉండాల్సిందేనంట. టీ20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన తర్వాత ఇలాంటి షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి. టీ20 జట్టులో షాన్ మసూద్‌కి అవకాశం దక్కింది. మరోవైపు షోయబ్ మాలిక్, ఇమాద్ వాసిమ్‌లు అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత కూడా జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. దీంతో వీరు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్స్.. సంచలనంగా మారాయి. పాక్ జట్టు ఎంపిక ఎలా జరుగుతుందో చెప్పడానికి ఈ 3 పేర్లే నిదర్శనం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఎలాంటి నాన్సెన్స్ చేయలేదు..

షాన్ మసూద్ గురించి మాట్లాడితే.. అతను ఇంకా పాకిస్తాన్ తరపున తన T20 అరంగేట్రం చేయలేదు. అతను చివరిసారిగా జనవరి 2021లో పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. అదే సమయంలో చివరి వన్డే 2019లో జరిగింది. అయినప్పటికీ, పాకిస్తాన్ అతనిపై విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచ కప్ జట్టులో ఎంపికయ్యాడు. గత నెలలో జరిగిన జాతీయ టీ20 కప్‌లో బలూచిస్థాన్ తరపున 9 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా, అతని బ్యాట్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. ఆయన సోషల్ మీడియా ప్రవర్తన కూడా ఆయన ఎన్నిక వెనుక కారణాన్ని చెబుతోంది. జట్టు ఎంపిక తర్వాత, పాకిస్థాన్ క్రికెట్ నిపుణులు మాట్లాడుతూ, పాక్ జట్టుకు దూరంగా ఉన్న తర్వాత, మసూద్ తన ఆటను శాంతియుతంగా ఆడటం కొనసాగించాడు. మెరుగయ్యాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎలాంటి నాన్సెన్స్ చేయలేదని, అందుకు ఫలితంగా జట్టులో చోటు దక్కింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ట్వీట్ కారణంగా షోయబ్ ఔట్..

అదే సమయంలో, షోయబ్ అక్తర్‌ను తీసుకోకపోవడానికి కారణం అతని ట్వీట్లలో ఒకటి. నిజానికి, పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ ఓటమి తర్వాత, షోయబ్ బాబర్ అజామ్‌ను లక్ష్యంగా చేసుకుని, స్నేహం, ఇష్టాలు, అయిష్టాల సంస్కృతి నుంచి మనం ఎప్పుడు బయటపడతాం అంటూ కామెంట్ చేశాడు. ఆయన చేసిన ట్వీట్ ఆయనపై నీలినీడలు కమ్ముకున్నట్లు చెబుతున్నారు. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా మాలిక్ ఇలాంటి ట్వీట్ చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీని ప్రశంసించిన ఇమాద్..

షాన్, షోయబ్ కాకుండా, మరో పేరు ఇమాద్ వసీం కూడా ఈ లిస్టులో ఉన్నాడు. ఆయనను కూడా పాకిస్థాన్ పట్టించుకోలేదు. అయితే అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. కొన్ని రోజుల క్రితం ఆసియా కప్ సందర్భంగా విరాట్ కోహ్లీని కూడా వసీం ప్రశంసించాడు. అతనిని భూమిపై అత్యుత్తమ ఆటగాడు అని పేర్కొన్నాడు. ఆ తర్వాత దారుణంగా ట్రోల్‌కు గురయ్యాడు.