Watch Video: టెన్నిస్‌లో క్రికెట్ షాట్.. మీ నుంచే నేర్చుకున్నానంటూ ఫెదరర్ ట్వీట్.. సచిన్‌ రిప్లై ఏంటంటే?

Sachin Tendulkar: సచిన్ అనేక సందర్భాల్లో రోజర్ ఫెదరర్‌ను కలిశాడు. ఫెదరర్ మ్యాచ్‌లను చూసేందుకు టెన్నిస్ స్టేడియంలో చాలాసార్లు టీమిండియా దిగ్గజం కనిపించిన సంగతి తెలిసిందే.

Watch Video: టెన్నిస్‌లో క్రికెట్ షాట్.. మీ నుంచే నేర్చుకున్నానంటూ ఫెదరర్ ట్వీట్.. సచిన్‌ రిప్లై ఏంటంటే?
Roger Federer Retires
Follow us
Venkata Chari

|

Updated on: Sep 16, 2022 | 2:49 PM

ఫెదరర్ టెన్నిస్ ఆట నుంచి గురువారం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆటను ఇష్టపడే సచిన్.. ఫెదరర్ కోసం ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నాడు. ‘మీ టెన్నిస్ ఆడే శైలి మాకు నచ్చింది. మీరు టెన్నిస్ ఆడుతుంటే చూడటం అలవాటు చేసుకున్నాం. ఆ అలవాటు ఎప్పటికీ పోదు. మాలో ఓ భాగం అయింది. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను అందించినందుకు ధన్యవాదాలు’ అంటూ మాస్టర్ బ్లాస్టర్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే, టీమిండియా దిగ్గజం నుంచి ఫెదరర్ క్రికెట్ ఆటలోని కొన్ని మెళుకువలు నేర్చుకున్నాడంట. వాటిని తన ఆటలో భాగం కూడా చేసుకున్నాడు. ఈ విషయం నాలుగేళ్ల క్రితం జరిగింది. రోజర్ ఫెదరర్ 2018 వింబుల్డన్‌ ఆడుతున్న సమయంలో జరిగింది. సాధారణంగా క్రికెట్‌లో మాత్రమే కనిపించే షాట్ టెన్నిస్ లో ఆడాడు. ఫెదరర్ కొట్టిన ఈ షాట్ ఫార్వర్డ్ డిఫెన్స్ షాట్ లాంటిది. అతని ఈ షాట్ చూసిన తర్వాత, సచిన్ టెండూల్కర్ అతనిని ట్యాగ్ చేస్తూ ఒక ఫన్నీ విషయం రాసుకొచ్చాడు. దానికి ఫెదరర్ సమాధానం కూడా అంతే ఫన్నీగా ఆన్సర్ చేశాడు.

‘నువ్వు తొమ్మిదో వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత, క్రికెట్, టెన్నిస్ నోట్స్‌ని ఒకరికొకరు పంచుకుందాం’ అని సచిన్ రాసుకొచ్చాడు. అతనికి ఫెదరర్ బదులిస్తూ, ‘మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు? నేను నోట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత సచిన్ సమాధానమిస్తూ, ఓకే అయితే మొదటి అధ్యాయం స్ట్రెయిట్ డ్రైవ్‌గా ఉంటుందని ఫన్నీగా చెప్పుకొచ్చాడు.

మూడుసార్లు భారత్‌ వచ్చిన ఫెదరర్..

రోజర్ ఫెదరర్ ఇప్పటివరకు మూడుసార్లు భారత్‌కు వచ్చారు. అతను మొదటిసారిగా 2006 సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. ఆ తర్వాత అతను 2014, 2015లో జరిగిన ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడానికి భారతదేశానికి వచ్చాడు. 2014 పర్యటనలో, అతను భారతదేశం వచ్చిన సందర్భంగా ఒక ట్వీట్ చేశాడు. ‘నేను ఇక్కడ గడిపిన అద్భుతమైన క్షణాలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు, భారతదేశం. ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను’ అంటూ ట్వీట్ చేశాడు. భవిష్యత్తులో సుదీర్ఘ పర్యటన కోసం భారత్‌కు వస్తానని కూడా చెప్పుకొచ్చాడు.

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్