PPF: పీపీఎఫ్‌ ఖాతాదారులు అలర్ట్‌.. ఏప్రిల్ 5 లోపు ఈ పనిని పూర్తి చేయండి.. లేకపోతే భారీగా నష్టం

మీరు కూడా పీపీఎఫ్‌ పెట్టుబడి పెట్టినట్లయితే ఏప్రిల్ 5 తేదీ మీకు చాలా ముఖ్యమైనది. వాస్తవానికి, 2025-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో మీరు ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక, పన్ను ప్రణాళికను చేయాలనుకుంటే మీకు సమయం చాలా ముఖ్యం. పన్ను ఆదా చేయడానికి మార్కెట్లో అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ పీపీఎఫ్‌ ఇప్పటికీ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. పీపీఎఫ్‌ అనేది పన్ను ఆదాతో పాటు..

PPF: పీపీఎఫ్‌ ఖాతాదారులు అలర్ట్‌.. ఏప్రిల్ 5 లోపు ఈ పనిని పూర్తి చేయండి.. లేకపోతే భారీగా నష్టం
Ppf
Follow us
Subhash Goud

|

Updated on: Apr 04, 2024 | 2:39 PM

మీరు కూడా పీపీఎఫ్‌ పెట్టుబడి పెట్టినట్లయితే ఏప్రిల్ 5 తేదీ మీకు చాలా ముఖ్యమైనది. వాస్తవానికి, 2025-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో మీరు ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక, పన్ను ప్రణాళికను చేయాలనుకుంటే మీకు సమయం చాలా ముఖ్యం. పన్ను ఆదా చేయడానికి మార్కెట్లో అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ పీపీఎఫ్‌ ఇప్పటికీ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. పీపీఎఫ్‌ అనేది పన్ను ఆదాతో పాటు అధిక వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందే పథకం. పీపీఎఫ్ పథకంలో ఏప్రిల్ 5 తేదీ చాలా ముఖ్యమైనది. ఈ తేదీని మిస్ అయితే లక్షల్లో నష్టం వాటిల్లవచ్చు. ఎలాగో చెప్పుకుందాం..

ఏప్రిల్ 5 ఎందుకు ముఖ్యమైనది?

మీరు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ 5వ తేదీలోపు పీపీఎఫ్‌ స్కీమ్‌లో ఒకేసారి డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే మీరు అత్యధిక వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందుతారు. పీపీఎప్‌ ఖాతాలో వడ్డీ ప్రతి నెల 5వ తేదీన లెక్కిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ 5వ తేదీలోపు మొత్తం మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీరు మొత్తం నెలకు వడ్డీ ప్రయోజనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

వడ్డీ గణన

పీపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంపై 7.1 శాతం వడ్డీని ప్రభుత్వం అందిస్తోంది. ఒక వ్యక్తి ప్రతి నెల 5వ తేదీలోపు పెట్టుబడి పెడితే, అతను డిపాజిట్ చేసిన మొత్తంపై పూర్తి వడ్డీ ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో మీరు 5వ తేదీ తర్వాత పెట్టుబడి పెడితే మీరు 5వ తేదీ, 30వ తేదీల మధ్య అతి తక్కువ బ్యాలెన్స్‌పై మాత్రమే వడ్డీ ప్రయోజనం పొందుతారు. అటువంటి పరిస్థితిలో మీరు ఆ నెలలో వడ్డీని కోల్పోవచ్చు.

పీపీఎఫ్‌ కాలిక్యులేటర్ ప్రకారం.. మీరు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 5 నాటికి ఏక మొత్తంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి, ఈ పెట్టుబడిని 15 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, 15 సంవత్సరాలలో డిపాజిట్ చేసిన మొత్తంపై మీకు మొత్తం రూ. 18.18 లక్షల వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో ప్రతి నెల 5వ తేదీ తర్వాత పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.17.95 లక్షల వడ్డీ మాత్రమే లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు 15 సంవత్సరాలలో వడ్డీలో రూ. 23,188 నష్టాన్ని పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?