ఇక ప్రతీ ఇంటా రూల్స్ రంజన్.. నెలనెలా ఖర్చులు చూస్తే డబిది..దిబిదే..!

ఆర్థిక సంవత్సరం మొదలైంది. క్యాలండర్ లో ఏప్రిల్ నెల మొదలైందో లేదో.. ఆర్థిక అంశాల్లో కొన్ని రూల్స్ కూడా మారుతున్నాయి. కొన్నింట్లో ఛార్జీలు పెరిగాయి. మరికొన్నింటి ధరలు పెరిగాయి. దీంతో సగటు జీవి బడ్జెట్ కూడా పెరుగుతుంది. కానీ ఆదాయం మాత్రం అంతంతమాత్రమే. ఇంతకీ ఏప్రిల్ ఒకటి నుంచి మారినవి ఏమిటి

ఇక ప్రతీ ఇంటా రూల్స్ రంజన్.. నెలనెలా ఖర్చులు చూస్తే డబిది..దిబిదే..!
Maxresdefault (4)
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 04, 2024 | 1:41 PM

ఆర్థిక సంవత్సరం మొదలైంది. క్యాలండర్ లో ఏప్రిల్ నెల మొదలైందో లేదో.. ఆర్థిక అంశాల్లో కొన్ని రూల్స్ కూడా మారుతున్నాయి. కొన్నింట్లో ఛార్జీలు పెరిగాయి. మరికొన్నింటి ధరలు పెరిగాయి. దీంతో సగటు జీవి బడ్జెట్ కూడా పెరుగుతుంది. కానీ ఆదాయం మాత్రం అంతంతమాత్రమే. ఇంతకీ ఏప్రిల్ ఒకటి నుంచి మారినవి ఏమిటి? ఈ లిస్టులో ఎన్పీఎస్ లాగిన్ మొదలు.. డెబిట్ కార్డుల ఛార్జీల పెంపు వరకు చాలా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన వాటిపై ఫోకస్ పెడితే.. ముందుగా ఎన్పీఎస్ గురించి చెప్పాలి. మోసాలు పెరిగిపోతున్న ఈ కాలంలో అకౌంట్లను ఈజీగా హ్యాక్ చేసేస్తున్నారు. దీంతో చాలా సంస్థలు ఖాతాదారుల సెక్యూరిటీ కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను తెరపైకి తెచ్చాయి. ఇప్పుడు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ – PFRDA కూడా ఎన్పీఎస్ అకౌంట్ లాగిన్ కు సంబంధించిన ప్రాసెస్ ను మార్చేసింది. ఇకపై ఈ అకౌంట్ ను లాగిన్ చేయాలంటే.. మీకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి.

ఈరోజుల్లో చిన్నదో పెద్దదో క్రెడిట్ కార్డును కచ్చితంగా తీసుకుంటున్నారు. అలాంటివాళ్లంతా అలెర్ట్ గా ఉండాలి. ఎందుకంటే.. వీటిపై వచ్చే రివార్డ్ పాయింట్ల విషయంలో కొందరు స్ట్రిక్ట్ గా ఉంటారు. వారిలో SBI క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నవారు ఒక్క విషయాన్ని గమనించాలి. అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను ఇప్పటివరకు ఇచ్చిన బ్యాంక్.. ఇకపై ఆ రివార్డులకు గేట్ క్లోజ్ చేసింది. SBI ఇలా చేస్తే.. ఐసీఐసీఐ, యాక్సెస్, యస్ బ్యాంకులు మాత్రం.. ఎయిర్ పోర్టుల్లో ఫ్రీ లాంజ్ ఫెసిలిటీలో రూల్స్ మార్చాయి. క్రెడిట్ కార్డుపై క్వార్టర్లీ ఖర్చు ఆధారంగా ఈ సదుపాయం ఉండేది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 50 వేలు, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 వేలు, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై 35 వేలు ఖర్చుపెడితేనే ఎయిర్ పోర్టుల్లో ఫ్రీ లాంజ్ ఫెసిలిటీ ఉంటుంది.

ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నవారు ఆ డాక్యుమెంట్ ను ఎక్కడెక్కడో పడేస్తారు. తీరా పాలసీ పిరియడ్ ముగిసిన తరువాత ఆ డబ్బును తీసుకుందామంటే డాక్యుమెంట్ దొరకదు. రెన్యువల్ టైమ్ లోనూ కొంతమందికి ఇదే సమస్య ఎదురవుతుంది. పైగా దానిని కొంతమంది జాగ్రత్తగా ఉంచుకోలేరు. అందుకే ఇకపై బీమా పాలసీలన్నీ డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీలో జీవిత భీమా, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ డిజిటల్ రూపంలోనే వినియోగదారులకు ఇవ్వాలి. ఈ రూల్ కూడా ఏప్రిల్ 1 నుంచి మారింది. దీనివల్ల పాలసీ విషయంలో సెక్యూరిటీ ఉంటుంది. రికార్డులు పదిలంగా ఉంటాయి.

డెబిట్ కార్డులను ఇప్పుడు చాలామంది తక్కువగా ఉపయోగిస్తున్నారు. డిజిటల్ ట్రాన్జాక్షన్స్ పెరిగిన తరువాత ఏటీఎంకు వెళ్లి డెబిట్ కార్డుతో క్యాష్ తీసుకోవడం తగ్గిందనే చెప్పాలి. అయినా సరే.. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నవారంతా డెబిట్ కార్డును తీసుకుంటారు. ఇప్పుడు దాని ఛార్జీలు కూడా పెరిగాయి. ఎస్బీఐ ఈ లిస్టులో ఫస్ట్ ఉంది. కొన్ని కార్డులపై 125 రూపాయిలు ఉన్న ఛార్జీలను 200 రూపాయిలకు పెంచింది. మరికొన్నింటిలో 175 నుంచి 250కు, ఇంకొన్నింటిలో 250 నుంచి 325కు, ప్లాటినం బిజినెస్ కార్డులకైతే 350 నుంచి 425 రూపాయిలకు ఛార్జీలను పెంచింది. అంటే కార్డు రకం ఏదైనా సరే.. 75 రూపాయిల మేర ఛార్జీలు పెంచిందని అర్థమవుతోంది. ఇక దీనిపై బంపర్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఛార్జీలతో పాటు వాటిపై జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగటు కష్టజీవి జేబుకు ఇది మరింత భారంగా మారనుంది.

వీటికితోడు టోల్ ట్యాక్స్ కూడా పెరిగింది. ఏటా ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలు పెరుగుతుంటాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే జనం ఉపయోగించే రెగ్యులర్ వాహనాలు.. వ్యాన్, కారు, జీపు లాంటి వెహికల్స్.. ఒకవైపు ప్రయాణిస్తే 5 రూపాయిలు, రెండువైపులా అయితే 10 రూపాయిలు అదనంగా పే చేయాలి. హెవీ వెహికల్స్ అయితే 35 రూపాయిల నుంచి 50 రూపాయిల వరకు ఎక్స్ ట్రాగా చెల్లించాలి. ఒకవేళ ఒక రూట్ లో వెళ్లిన బండి… 24 గంటల్లో తిరిగి వచ్చేస్తే.. ఈ మొత్తంలో 25 శాతాన్ని తగ్గిస్తారు. కాకపోతే రోడ్డు నిర్మాణ ఖర్చు వసూలైన తరువాత.. టోల్ బాదుడును కనీసం 40 శాతానికి తగ్గించాలన్న రూల్ ఉంది. ఫాస్టాగ్ వచ్చిన తరువాత టోల్ గేట్ల వద్ద కలెక్షన్లు భారీగా పెరిగాయని తెలుస్తోంది. దీంతో టోల్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇలా ఆర్థిక సంవత్సరం మొదలైంది అంటే చాలు.. ఏదో ఒక రూపంలో సగటు జీవి బడ్జెట్ ముఖచిత్రం మారిపోతుంది. బతుకు భారమవుతోంది. ఇక ధరలు పెరిగే వస్తువుల జాబితాను చూస్తే.. ఆ బాధ మరింత ఎక్కువవుతుంది. ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం పెరిగినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు