పుత్తడి కొనాలంటే ఇక ఇత్తడే.! బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది.? ఇప్పుడు కొనడం మంచిదేనా..

ఒక్క తులం బంగారం అయినా కొనుక్కుంటే.. రేపు ఏదైనా అవసరానికి పనికొస్తుంది కదా. ఇది ప్రతీ ఇంట్లో వినిపించే మాట. ఎందుకంటే మనవారికి తెలిసిన పొదుపు, మదుపు.. అంతా బంగారమే. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, అనారోగ్యం చేస్తే డబ్బు సర్దుబాటు కోసం తాకట్టు పెట్టడానికి, కష్టమొస్తే ఆదుకోవడానికి..

పుత్తడి కొనాలంటే ఇక ఇత్తడే.! బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది.? ఇప్పుడు కొనడం మంచిదేనా..
Gold Rate
Follow us
Gunneswara Rao

| Edited By: Ravi Kiran

Updated on: Apr 04, 2024 | 1:39 PM

ఒక్క తులం బంగారం అయినా కొనుక్కుంటే.. రేపు ఏదైనా అవసరానికి పనికొస్తుంది కదా. ఇది ప్రతీ ఇంట్లో వినిపించే మాట. ఎందుకంటే మనవారికి తెలిసిన పొదుపు, మదుపు.. అంతా బంగారమే. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, అనారోగ్యం చేస్తే డబ్బు సర్దుబాటు కోసం తాకట్టు పెట్టడానికి, కష్టమొస్తే ఆదుకోవడానికి.. ఇలా ఒకటా రెండా.. ప్రతీ అవసరానికి ముందు కనిపించేది స్వర్ణమే. అందుకే మన ట్రెడిషన్ లో గోల్డ్ కి అంత ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల మన దగ్గర పుత్తడికి డిమాండ్ కూడా ఎక్కువే. అదే దాని ధరను పెరిగేలా చేస్తోంది. లేకపోతే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 70 వేల రూపాయిలు ఎలా అవుతుంది?

ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గోల్డ్ రేటు ఎంతవరకు టచ్ అవుతుందో కూడా అంచనా వేయలేం. ఎక్స్ పర్ట్స్ చెప్పేది కూడా ఇదే. ఆ మాత్రం ఎక్స్ పెక్ట్ చేయలేమా అనుకోవచ్చు. నిజంగానే అలా చేయలేం. దీనికి కారణం బంగారం ధరను వివిధ అంశాలు ప్రభావితం చేస్తాయి. అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ మొదలు.. దేశంలో పరిస్థితులు కూడా దీనిపై ఎఫెక్ట్ చూపిస్తాయి. అందులోనూ మన రూపాయితో డాలర్ మారకపు విలువను పోల్చి చూస్తే.. కనకానికి రెక్కలు వచ్చాయనే చెప్పాలి. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ ప్రస్తుతం 83 రూపాయిల పైనే ఉంది. వారానికి ముందు ఔన్సు బంగారం ధర 2 వేల 165 డాలర్లు ఉంటే.. వారం తిరిగేసరికి అది 2 వేల 255 డాలర్లకు పెరిగిపోయింది. ఇక్కడ ఔన్స్ అంటే.. సుమారు 31 గ్రాముల బంగారంతో సమానం.

అమెరికాలో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడి రిజర్వ్ బ్యాంక్.. వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పడంతో.. ఇక్కడ బంగారానికి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే.. వాళ్లు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు. దీనికి తోడు ఉక్రెయన్, గాజాలో యుద్ధ పరిస్థితులు కూడా బంగారం ధరపై ప్రభావం చూపిస్తున్నాయి. నిజానికి 2023లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు గోల్డ్ రేటు 10 గ్రాములకు దాదాపు 63 వేల రూపాయిల వద్ద స్థిరంగానే ఉంది. దీంతో పుత్తడికి డిమాండ్ పెరగడంతో దిగుమతుల్లో దాదాపు 26 శాతం పెరుగుదల కనిపించింది. కానీ ఈ ఏడాది మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. 2024లో మొదటి త్రైమాసికంలో చూస్తే.. మార్చి నెలలో దీని డిమాండ్ భారీగా పడిపోయిందని తెలుస్తోంది. దీనికి కారణం ధర పెరగడమే.

ఈసారి బంగారం డిమాండ్ 900 టన్నులకు పడిపోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాలను బట్టి తెలుస్తోంది. స్వర్ణంతోపాటు వెండి ధర కూడా పెరిగింది. దీంతో అమ్మకాలు తగ్గుతున్నాయి. నిజానికి ఈ నెల 26 వరకు ముహూర్తాలు బాగా ఉండడంతో పెళ్లిళ్లతోపాటు శుభకార్యాలు ఉన్నాయి. ఇక రాబోయే అమావాస్య తరువాత ముహూర్తాలు తగ్గినా, శ్రీరామనవమి నుంచి మళ్లీ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఉన్న ఈ శుభ ఘడియల్లోనే చాలామంది పెళ్లిళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈనెల 26 దాటాక మూఢం వస్తుంది. అక్కడి నుంచి మళ్లీ 3 నెలల వరకు ముహూర్తాల ముచ్చటే లేదు. అందుకే ఇప్పుడు బంగారం కొనాలనుకుంటున్నారు. కానీ ధర ఎక్కువగా ఉండడంతో తమకు కావలసిన దానిలో ఓ 50 శాతం గోల్డ్ ను మాత్రమే కొంటున్నారు. రేటు తగ్గాక చూద్దాములే అని ఆగిపోతున్నారు.

2023లో అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62 వేల 400 రూపాయిలు ఉంది. కానీ ఏడాది తిరిగేసరికీ సుమారు 9 వేల రూపాయిలు పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాదిలోనే రేటు బాగా పెరిగింది. ఒక్క 20 ఏళ్లు వెనక్కి వెళితే.. 2004 ఏప్రిల్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 5 వేల 800 రూపాయిలు ఉండేది. కానీ ఇప్పుడు 70 వేలకు చేరింది. అంటే జస్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఇంత ఛేంజ్ వచ్చింది. అసలు ఎవరూ కలలో కూడా ఊహించని ధర ఇది.

గత నెలన్నరలోనే బంగారం రేటు 15 శాతానికి పైగా పెరిగింది. ఇక పెళ్లిళ్ల వల్ల బిజినెస్ పెరుగుతుందీ అనుకుంటే.. సుమారు 40 శాతం మేర తగ్గిందంటున్నారు బంగారం షాపు వ్యాపారులు. అటు కస్టమర్లు, ఇటు బంగారం షాపు ఓనర్లు.. ఇరువురికీ ఈ రేటు వర్కవుట్ అవ్వట్లేదు. అందుకే చాలామంది ధర తగ్గిన తరువాతే బంగారం కొందామనే ఆలోచనలో ఉన్నారు. చూద్దాం.. బంగారం కరుణిస్తుందో.. లేదో!