AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: మారుతి కార్లపై డిస్కౌంట్‌.. స్టార్టింగ్ వేరియంట్‌ రూ. 4 లక్షలకే

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మారుతి కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన కార్లపై డిస్కౌంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. మారుతి సుజుకీ కంపెనీకి చెందిన మినీ కార్లపై డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఆల్టో, ఎస్‌ ప్రెస్‌ కార్ల అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మినీ కార్ల అమ్మకాలు 10,648 యూనిట్లకు పడిపోయాయి...

Maruti Suzuki: మారుతి కార్లపై డిస్కౌంట్‌.. స్టార్టింగ్ వేరియంట్‌ రూ. 4 లక్షలకే
Maruti Suzuki
Narender Vaitla
|

Updated on: Sep 02, 2024 | 3:18 PM

Share

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మారుతి కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన కార్లపై డిస్కౌంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. మారుతి సుజుకీ కంపెనీకి చెందిన మినీ కార్లపై డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఆల్టో, ఎస్‌ ప్రెస్‌ కార్ల అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మినీ కార్ల అమ్మకాలు 10,648 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఆగస్టులో 12,209 యూనిట్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది 10,648కి తగ్గింది.

ఈ నేపథ్యంలోనే ఎస్‌-ప్రెసో LXI పెట్రోల్‌ వేరియంట్‌ ధరను రూ.2,000 తగ్గించినట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. కే10 VXI పెట్రోల్‌ వెర్షన్‌ ధరను రూ.6,500 తగ్గించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. తగ్గించిన ఈ అమ్మకాలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. తగ్గించిన ధరలతో ఆల్టో కే10 ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 3.99 లక్షలుగా ఉంది. కాగా హై ఎండ్ కారు ధర రూ. 5.96 లక్షలకు లభిస్తోంది. ఇక ఎస్‌ప్రెస్సో విషయానికొస్తే ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 4.26 లక్షల నుంచి రూ. 6.11 లక్షల ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌గా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి మోడల్స్‌లో కూడా 20 శాతం సేల్స్‌ తగ్గడం గమనార్హం. ఈ అన్ని కార్లు గతేడాది 72,451 యూనిట్లతో పోలిస్తే 58,051 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకి ఆగస్టు 2024లో మొత్తం అమ్మకాలలో సంవత్సరానికి 4 శాతం క్షీణతను ప్రకటించింది. కంపెనీ గత నెలలో 1,81,782 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో 189,082 యూనిట్లు అమ్ముడుపోయాయి.

మొత్తం మీద దేశంలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 8 శాతం తగ్గాయి. ఆగస్టు 2023లో అమ్మకాలు 1,56,114 యూనిట్ల నుంచి 1,43,075 యూనిట్లకు పడిపోయాయి. ముఖ్యంగా మినీ, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్ల అమ్మకాలు తగ్గాయి. అయితే గ్రాండ్‌ విటారా.. బ్రెజ్జా, ఎర్టిగా, ఇన్విక్టో, ఫ్రాంక్స్, XL6 వంటి మోడల్స్‌ అమ్మకాలు పెరిగాయి. గతేడాది 58,746 యూనిట్ల నుంచి 62,684 యూనిట్లకు పెరిగాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..