AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: ఆ కార్లపై నవరాత్రి డిస్కౌంట్లు.. ఏకంగా రూ.65,000 వరకూ భారీ తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవి..

మారుతి సుజుకి ప్రీ నవరాత్రి బుకింగ్ స్కీమ్ పేరిట ఈ డిస్కౌంట్ సేల్ ను ప్రారంభించింది. అక్టోబర్ 15 వరకూ మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అయితే మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న అన్ని కార్లపై ఈ డీల్స్ ఉండవు. బాలెనో, సియాజ్, ఇగ్నిస్ వంటి మోడళ్లపై మాత్రమే రూ. 65,000 వరకూ వివిధ ప్రయోజనాలు అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Maruti Suzuki: ఆ కార్లపై నవరాత్రి డిస్కౌంట్లు.. ఏకంగా రూ.65,000 వరకూ భారీ తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవి..
Maruti Suzuki Baleno
Madhu
| Edited By: |

Updated on: Oct 10, 2023 | 9:10 PM

Share

దేశ వ్యాప్తంగా నిర్వహించే అతి పెద్ద పండుగల్లో దసరా కూడా ఒకటి. ఈ పండుగ సమీపిస్తుండగానే అంతటా భక్తి భావంతో పాటు పండుగ సమయానికి కొత్త వస్తువులను ఇంట్లో ఉంచేందుకు ఇష్టపడతారు. అందుకనుగుణంగానే అన్ని రంగాల్లో పలు రకాలు ఆఫర్లు హోరెత్తుతాయి. దసరా వస్తూనే అనేక డిస్కౌంట్లు, డీల్స్ లను మోసుకొస్తుంది. నవరాత్రుల ప్రారంభానికి ముందుగానే ఫెస్టివ్ సేల్స్ జాతర మొదలవుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమకు ఈ దసరా చాలా కీలకం. విజయోత్సవానికి చిహ్నంగా అందరూ కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు. వినియోగదారుల ఆసక్తిని గమనించిన ఆటోమొబైల్ దిగ్గజలను దానిని అందిపుచ్చుకునేందుకు అనేక రకాల ఆఫర్లు, డిస్కౌంట్లను మార్కెట్లోను ముంచెత్తుతాయి. ఇదే క్రమంలో దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, దసరా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్లను ప్రకటించింది. వివిధ రకాల మారుతి సుజుకి కార్లపై ఏకంగా రూ. 65,000 వరకూ ప్రయోజనాలుంటాయని పేర్కొంది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రీ నవరాత్రి బుకింగ్ స్కీమ్..

మారుతి సుజుకి ప్రీ నవరాత్రి బుకింగ్ స్కీమ్ పేరిట ఈ డిస్కౌంట్ సేల్ ను ప్రారంభించింది. అక్టోబర్ 15 వరకూ మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అయితే మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న అన్ని కార్లపై ఈ డీల్స్ ఉండవు. బాలెనో, సియాజ్, ఇగ్నిస్ వంటి మోడళ్లపై మాత్రమే రూ. 65,000 వరకూ వివిధ ప్రయోజనాలు అందిస్తుంది. అయితే స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే ఈ ఆఫర్లు ఉంటాయని, మీరు కొనుగోలు చేస్తున్న ప్రాంతాన్ని ఆఫర్లో మార్పులుంటాయని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ నవరాత్రి స్కీమ్ లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, జిమ్నీ, ఫ్రాంక్స్ వంటి ప్రముఖ మోడళ్లపై ఎలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు లేవని కంపెనీ ప్రకటించింది. కేవలం బాలెనో, సియాజ్, ఇగ్నిస్ మోడళ్లపై మాత్రమే ఆఫర్లు ఉంటాయని పేర్కొంది. ఆ కార్లపై ఉన్న డీల్స్ ఏంటో చూద్దాం రండి..

సియాజ్‌పై స్టన్నింగ్ డిస్కౌంట్లు.. ఈ కారు కొనుగోలుపై రూ. 53,000 వరకూ ప్రయోజనాలు పొందొచ్చు. అక్టోబర్ చివరి వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇది రెండు వేరియంట్లు మాన్యువల్, ఆటోమేటిక ట్రాన్స్ మిషన్ పై డిస్కౌంట్లు వర్తిస్తాయి. ఈ కారులో 105హెచ్ పీ, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బాలెనో‌పై భలే ఆఫర్లు.. ఈ కారు మాన్యువల్ అలాగే పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లుగా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ రెండింటిపైనా ఆఫర్లు ఉన్నాయి. మొత్తంగా రూ. 40,000 వరకూ వివిద రకాల ప్రయోజనాలు పొందొచ్చు. సీఎన్జీ వేరియంట్ తీసుకోవాలనుకుంటే రూ. 55,000 వరకూ తగ్గింపును మీరు పొందొచ్చు. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ తోకూడిన 1.2 లీటర్ ఇంజిన్ తో వస్తుంది. 90హెచ్ పీ, 113ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది.

ఇగ్నిస్‍పై టాప్ డీల్స్.. ఈ కారు మాన్యువల్ వేరియంట్ పై ఏకంగా రూ. 65,000 వరకూ వివిధ రకాల ప్రయోజనాలను పొందొచ్చు. అలాగే ఆటోమేటిక్ గేర్ బాక్స్ వేరియంట్ పై రూ. 60,000 వరకూ బెనిఫిట్స్ వస్తాయి. దీనిలో 83 హెచ్ పీ, 113ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ ఇంజిన్ వస్తుంది. ఈ కాంపాక్ట్ కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..