Maruti suzuki Dzire: పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..?
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి నుంచి విడుదలయ్యే వాహనాలకు ఎప్పుడు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అదిరిపోయే లుక్, ఆధునాతన ఫీచర్లు, కొత్త తరం టెక్నాలజీ అందుబాటులో ధర అనేది ఈ కంపెనీ ప్రత్యేకతలు అని చెప్పవచ్చు. అనేక కొత్త మోడళ్లను విడుదల చేసిన మారుతీ సుజుకీ 2024 నవంబర్ లో కొత్త డిజైర్ కారును ఆవిష్కరించింది. డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ లోనూ అనేక మార్పులు చేసి నాలుగో తరం కారును తీసుకువచ్చింది.

మారుతీ డిజైర్ కారు ధరను రూ.5 వేలు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో డిజైర్ ప్రారంభ ధర రూ.6.77 లక్షల నుంచి రూ.6.84 లక్షలకు (ఎక్స్ షోరూమ్)కు పెరిగింది. వివరంగా చెప్పాలంటే డిజైర్ కారు ధరలు వేరియంట్లను అనుసరించి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ పెరిగాయి. వీఎక్స్ఐ ఏఎంటీ, జెడ్ఎక్స్ఐ ఏఎంటీ మోడళ్ల ధరను రూ.10 వేలకు పెంచారు. ఎల్ఎక్స్ఐ ఎంటీ, వీఎక్స్ఐ ఎంటీ, వీఎక్స్ఐ సీఎన్జీ, జెడ్ఎక్స్ఐ సీఎన్జీ, జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఏఎంటీ తదితర ఇతర వాటిని రూ.5 వేలు పెంచారు. ఆ ప్రకారం మోడళ్ల ఆధారంగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- పెరిగిన ధరకు అనుగుణంగా మారుతీ సుజుకి డిజైర్ కారు ప్రారంభ ధర రూ.6.84 లక్షలకు చేరింది.
- మాన్యువల్ ట్రాన్స్ మిషన్ కలిగిన మిడ్ స్పెక్ వీఎక్స్ఐ వేరియంట్ రూ.7.84 లక్షల నుంచి రూ.8.34 లక్షలు, ఏఎంటీ ఆప్షన్ ధర రూ.8.34 లక్షల వరకూ పెరిగింది.
- మిడ్ స్పెక్ వేరియంట్ లోని సీఎన్జీ ఆప్షన్ కారు రూ.8.79 లక్షలకు చేరుకుంది.
- జెడ్ ఎక్స్ఐ మాన్యువల్ టాన్స్ మిషన్ వేరియంట్ రూ.8.89 లక్షలు, ఏఎంటీ రూ.9.44, సీఎన్జీ ఆప్షన్ రూ.8.89 లక్షలు పలుకుతోంది.
- మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో కూడిన జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ ధర పెరగకుండా రూ.9.69 లక్షల దగ్గర కొనసాగుతోంది.
కొత్త డిజైర్ సెడాన్ కారులో 1.2 లీటర్ల మూడు సిలిండర్ల జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 82 హెచ్ పీ, 112 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ట్రాన్స్ మిషన్ ఎంపికలకు సంబంధించి ఐదు స్పీడ్ మాన్యువల్, ఐదు స్పీడ్ ఏఎంటీ ఉన్నాయి. అలాగే ఈ కారు ఇంధన సామర్థ్యం చాలా అధికం. మాన్యువల్ వేరియంట్ 24.75 కిలోమీటర్లు, ఏఎంటీ వెర్షన్ 25.71 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. కారులోని వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఆకట్టుకుంటున్నాయి.
సన్ రూఫ్ కలిగిన మొదటి సబ్ కాంపాక్ట్ సెడాన్ గా పేరు పొందింది. ఆటో మేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, కప్ హోల్డర్లతో కూడిన వెనుక ఆర్మ్ రెస్ట్, వెనుక భాగంలో డ్యూయల్ పోర్టులు, వైర్ లెస్ చార్జర్ ఏర్పాటు చేశారు. భద్రతపరంగా మారుతీ డిజైర్ నంబర్ వన్ అని చెప్పవచ్చు. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో ఈ కారు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో అత్యధికం రేటింగ్ సాధించిన మొదటి మారుతీ కారుగా పేరు పొందింది. ఆరు ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్, హిల్ హూల్ద్ అసిస్ట్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా అదనపు ప్రత్యేతకలు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








