- Telugu News Photo Gallery Business photos Range of over a hundred kilometers on a single charge, These are the best electric scooters in the market, Best range EVs details in telugu
Best range EVs: సింగిల్ చార్జితో వంద కిలోమీటర్లకు పైగా రేంజ్.. మార్కెట్ లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!
ద్విచక్ర వాహనం అనేది నేడు అందరికీ కనీస అవసరంగా మారింది. ప్రయాణం, వ్యాపారం, చదువు, ఉద్యోగం.. ఇలా అనేక అవసరాలకు దీన్ని వినియోగిస్తున్నారు. మన దేశంలో సామాన్య , మధ్య తరగతి ప్రజలే ఎక్కువ. వీరిందరికీ ద్విచక్ర వాహనం ఎంతో అవసరమైనప్పటికీ, దాన్ని కొనుగోలు చేసేముందు ధర, మైలేజ్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. వాటి కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నా, ధర ఎక్కువగా ఉంటుందని చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగిల్ చార్జింగ్ తో వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే, అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటి ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.
Updated on: Feb 18, 2025 | 2:00 PM

కోమాకి ఎక్స్ వన్ ఎస్ బైక్ లో లిథియం - అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. పోర్టబుల్ చార్జర్ తో సుమారు 4 నుంచి 5 గంటల్లో దీని బ్యాటరీని ఫుల్ చార్జింగ్ చేయవచ్చు. ఒక్క చార్జిపై సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణం సాగించవచ్చు. ఈ స్కూటర్ కేవలం రూ.59,990 (ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది.

కైనెటిక్ గ్రీన్ జూమ్ బిగ్ బి స్కూటర్ లో 1.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తిగా చార్జింగ్ చేయడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది. సింగిల్ చార్జింగ్ పై సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్ రూ.78,776 (ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది.

అథర్ రిజ్టా 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్ అనే రెండు రకాల బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. 4.3 కేడబ్ల్యూ గరిష్టశక్తి, 22 ఎన్ఎం టార్కును ఉత్పత్తి చేసే పీఎంఎస్ఎంకి దీన్ని జత చేశారు. అథర్ పోర్టబుల్, డుయోచార్జర్లకు ఉపయోగించి బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు. సుమారు 4.30 గంటల నుంచి 8.30 గంట్లలోని బ్యాటరీలు చార్జింగ్ అవుతాయి. ఫుల్ చార్జింగ్ పై 123 నుంచి 159 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీని ధర రూ.99,999 నుంచి రూ.1.46 లక్షల వరకూ ఉంది.

బెస్ట్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లలో విడా వీ2 ప్లస్ ఒకటి. దీనిలో రిమూవబుల్ డ్యూయల్ 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలను ఏర్పాటు చేశారు. శాశ్వత మాగ్నైట్ సింక్రోనస్ మోటార్ నుంచి 3.9 కేబ్ల్యూ, 25 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. ఏసీ చార్జర్ ను ఉపయోగించి సుమారు ఐదున్నర గంటల్లో బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు. ఫుల్ చార్జిపై సుమారు 143 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీని ధరను రూ.97,800 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.

ఓలా ఎస్1 ఎక్స్ స్కూటర్ మూడు రకాల బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. దీనిలో 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలను ఏర్పాటు చేశారు. వీటికి 2.7 కేడబ్ల్యూ మోటారును జత చేశారు. బ్యాటరీలను చార్జింగ్ చేయడానికి 5 నుంచి 7 గంటల సమయం పడుతుంది. సింగిల్ చార్జ్ పై 95 నుంచి 190 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. వీటి ధర రూ.69,999 నుంచి రూ.91,999 వరకూ ఉంటుంది.




