- Telugu News Photo Gallery Business photos Gold Reserves: Pakistan has become rich, gold is found in the Indus River near Attock province
Gold Reserves: ఇక్కడ భారీగా బంగారం నిల్వలు.. బకెట్ల కొద్ది ఇంటికి తీసుకెళ్తున్న ప్రజలు!
Gold Reserves: బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో బంగారం నిల్వలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద మొత్తంలో ముడి చమురు నిల్వలు గుర్తించారని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు బంగారు నిల్వలు భూగర్భంలో ఉన్నాయని చెబుతుండటంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న..
Updated on: Feb 18, 2025 | 12:44 PM

బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో బంగారం నిల్వలు ఉన్నాయి. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పాక్‌లో కూడా ఓ ప్రాంతంలో బంగారం నిల్వలు ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున వెతికే పనిలో ఉన్నాయి. పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ నివేదిక ప్రకారం.. ఇక్కడి ప్రజలు రోజంతా నదీ గర్భం నుండి బురదను బయటకు తీసి బుదరలో బంగారాన్ని వెతికే పనిలో ఉన్నారు. వారు బురదతో నిండిన బకెట్లను ఇంటికి తీసుకెళ్లి ఆ బుదరలో బంగారాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాస్తున్నారు.

పాకిస్తాన్‌లో నివసిస్తున్న పంజాబ్ మాజీ గనులు, ఖనిజాల మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్, జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ (GPS) నివేదిక ఆధారంగా అటాక్ సమీపంలో రూ. 800 బిలియన్ల విలువైన బంగారు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో మొదట్లో చిన్న స్థాయిలో మైనింగ్ కార్యకలాపాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఇక్కడ తవ్వడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ప్రజలు బకెట్లలో ఇసుక నింపి ఇంటికి తీసుకువెళుతున్నారు.

ఈ బంగారు నిక్షేపాల ఆవిష్కరణ పాకిస్తాన్ విధిని మార్చగలదని హసన్ మురాద్ పేర్కొన్నారు. ఇక్కడ 18 కి పైగా ప్రదేశాలలో బంగారం దొరుకుతుందని వారు భావిస్తున్నారు. మాజీ గనులు, ఖనిజాల మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ఈ ప్రాంతంలోని మొత్తం 9 బ్లాకులలో అతిపెద్ద బ్లాక్‌లో 155 బిలియన్ల బంగారం ఉండవచ్చని పేర్కొన్నారు.

గతంలో పాకిస్తాన్‌లో పెద్ద మొత్తంలో ముడి చమురు నిల్వలు గుర్తించారని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు బంగారు నిల్వలు భూగర్భంలో ఉన్నాయని చెబుతుండటంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు ప్రకృతి స్వయంగా సహాయం చేసిందా అని ప్రశ్నిస్తున్నారు.




