AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: కేవలం రూ.50 వేలతో స్టార్ట్‌ చేసి.. వ్యాపార సామ్రాజ్యం నిర్మించవచ్చు! లక్షలొచ్చే బిజినెస్‌

టెన్షన్ ఉద్యోగాలు వదిలి సొంత వ్యాపారం చేయాలనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించే అద్భుతమైన అవకాశం సరుకు రవాణా వ్యాపారంలో ఉంది. కేవలం రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో వాహనం కొని, కష్టపడితే, మీరు మీ వాహనాల సంఖ్యను పెంచుకుంటూ సొంత రవాణా కంపెనీని నెలకొల్పవచ్చు.

Business Ideas: కేవలం రూ.50 వేలతో స్టార్ట్‌ చేసి.. వ్యాపార సామ్రాజ్యం నిర్మించవచ్చు! లక్షలొచ్చే బిజినెస్‌
Indian Currency 2
SN Pasha
|

Updated on: Nov 23, 2025 | 7:00 AM

Share

ఛీ.. ఈ టెన్షన్‌తో కూడిన ఉద్యోగాలు ఏం చేస్తాం. ఒక మంచి వ్యాపారం చేసుకుంటే హాయిగా బతకొచ్చు. అయినా ఒకడి కింద పనిచేసే కంటూ మనకొచ్చిన పని మనమే చేసుకుంటే డబ్బుకు డబ్బు, గౌరవానికి గౌరవం వస్తుందని ఆలోచిస్తూ చాలా మంది బిజినెస్‌ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే వ్యాపారం చేయాలంటే మొదట కావాల్సింది పెట్టుబడి. చాలా మంది అది లేకే తమ వ్యాపార కలను నిజం చేసుకోలేకపోతుంటారు.

అయితే తక్కువ పెట్టుబడితో ప్రారంభించి లక్షలు సంపాదించే ఒక బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ వ్యాపారానికి పెట్టుబడి తక్కువే అయినప్పటికీ.. కష్టం మాత్రం ఎక్కువ ఉంటుంది. అందుకే సిద్ధం అనుకుంటేనే ఈ వ్యాపారంలోకి దిగితే మంచిది. ఇంతకీ బిజినెస్‌ ఏంటంటే.. ట్రాన్స్‌పోర్ట్‌ బిజినెస్‌. సరుకు రవాణా అనేది ఇప్పటికీ డిమాండ్‌ తగ్గని సెక్టార్‌. ఒక రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో ఒక చిన్న ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌ తీసుకొని, దాన్ని మీరే స్వయంగా నడుపుకున్న పర్లేదు, డ్రైవర్‌ని పెట్టి నడిపించినా పర్లేదు.

దానిపై వచ్చే ఆదాయాన్ని సొంతానికి వాడుకోకుండా దాని ఈఎంఐలు కట్టుకుంటూ మిగిలిన డబ్బును మరో వెహికల్‌ కోసం దాచుకొని.. అలా అలా వాహనాల సంఖ్య పెంచుకుంటూ పోతే ఒక ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీని ఏర్పాటు చేసుకోవచ్చు. పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌తో ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్ట్‌ మాట్లాడుకుంటే.. మీ వెహికల్స్‌ ఖాళీగా ఉండవు. వాళ్ల సరుకును జాగ్రత్తా ట్రాన్స్‌పోర్ట్‌ చేస్తే.. వారికి ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెంట్‌గా ఉంటూ మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఇందుకోసం డ్రైవర్‌ సాలరీలు, వాహనాల మెయిటెనెన్స్‌ వంటి ఖర్చులు ఉంటాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us