RERA ACT: బిల్డర్ తప్పుకు ఇల్లు కొన్నవారికి నష్టం.. ఎలా? RERA చట్టం ఏం చెబుతోంది?

RERA ACT: ఒక సామాన్యుడు తన జీవితాంతం సంపాదించిన మొత్తాన్ని తన కుటుంబానికి ఇల్లు కొనడానికి వెచ్చిస్తాడు. బిల్డర్లు చేసే తప్పిదాల వల్ల చాలా సార్లు అటువంటి సామాన్యుల సొంతింటి కల దూరం..

RERA ACT: బిల్డర్ తప్పుకు ఇల్లు కొన్నవారికి నష్టం.. ఎలా? RERA చట్టం ఏం చెబుతోంది?
Follow us
Subhash Goud

|

Updated on: Jul 22, 2022 | 3:50 PM

RERA ACT: ఒక సామాన్యుడు తన జీవితాంతం సంపాదించిన మొత్తాన్ని తన కుటుంబానికి ఇల్లు కొనడానికి వెచ్చిస్తాడు. బిల్డర్లు చేసే తప్పిదాల వల్ల చాలా సార్లు అటువంటి సామాన్యుల సొంతింటి కల దూరం అవుతుంది. నరేష్ అనే వ్యక్తి విషయమే తీసుకోండి. అతను ఘజియాబాద్‌లో ఒక ఫ్లాట్‌ను బుక్ చేశాడు. ఆ సమయంలో బిల్డర్ 2013లో ఫ్లాట్ ను అందిస్తానని హామీ ఇచ్చాడు. నరేష్ ఫ్లాట్ కోసం లోన్ తీసుకున్నాడు. లోన్ ఈఎంఐ కడుతూ వచ్చాడు. బాకీ తీరిపోయింది కూడా. కానీ, ఇప్పటికీ నరేష్ ఇంకా తన ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోలేదు. ఆ తర్వాత, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం (RERA-రెరా) రంగంలోకి దిగి ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఇప్పుడు నరేష్ పరిస్థితి గందరగోళం. ఇంకా చెప్పాలంటే రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయింది. ఇటు డబ్బు పోయింది అటు ఫ్లాట్ దక్కలేదు. మరి ఈ విధమైన సందర్భాలలో గృహ కొనుగోలుదారుల హక్కులు ఏమిటి?

యుపీ రెరా ఇటీవల ఘజియాబాద్‌లోని 3 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. అవి స్పేస్ కల్చర్ ఫేజ్-2, స్పేస్ కల్చర్ ఫేజ్-3, డిఫెన్స్ విజ్ఞాన్ సంస్కృతి ఫేజ్-2. నిర్మాణంలో జాప్యం, నిబంధనలు పాటించడంలో బిల్డర్లు వెనుకాడడం ఇందుకు ప్రధాన కారణమైంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం 2015 సంవత్సరంలో ప్రారంభం కాగా.. 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉంది.

నిజానికి, 1992 సంవత్సరంలో 250 మంది కలిసి డిఫెన్స్ సైన్స్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఏకంగా 12.50 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసే బాధ్యతను ఆంత్రిక్ష్ రియల్‌టెక్‌కు అప్పగించారు. కమిటీ సభ్యులకు 40 శాతం ఇళ్లు, 60 శాతం ఫ్లాట్లను బిల్డర్ విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

నిర్మాణంలో జాప్యంపై పలువురు కొనుగోలుదారులు బిల్డర్‌పై రెరాకు ఫిర్యాదు చేశారు. మూడు ప్రాజెక్టుల్లో ఒకటి 40 శాతం, మరొకటి 30 శాతం పూర్తి కావడమే ఆలస్యానికి కారణం. డిఫెన్స్ సైన్స్ కల్చర్ ఫేజ్-2లో ఏమీ జరగలేదు. ఈ ప్రాజెక్ట్ చాలా కాలంగా నిలిచిపోయింది. ఇప్పుడు ప్రాజెక్ట్‌ను రద్దు చేసిన తర్వాత, RERA ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది నిలిచిపోయిన పనిని పూర్తి చేయడానికి బాధ్యత వహిస్తుంది. అయినప్పటికీ, గృహ కొనుగోలుదారులకు ఉన్న మార్గాలు ఏమిటి?

ప్రాజెక్టు రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడమే గరిష్ఠ జరిమానా అని సుప్రీంకోర్టు న్యాయవాది అనిల్‌ కర్న్‌వాల్‌ చెప్పారు. ఇప్పుడు ఆగిపోయిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే బాధ్యత రెరాపై ఉంది. రెరా కమిటీని ఏర్పాటు చేస్తారు. గృహ కొనుగోలుదారులు కావాలనుకుంటే, వారు తమ ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చు లేదా వాపసు డిమాండ్ చేయవచ్చు. మీరు వాపసు కోసం RERA, వినియోగదారు కోర్టు లేదా సివిల్ కోర్టును సంప్రదించవచ్చు.

ఇలాంటి పరిస్థితి వస్తే గృహ కొనుగోలుదారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? గృహ కొనుగోలుదారులు వ్యక్తిగతంగా కాకుండా వారి వ్యూహం సమిష్టిగా ఉండేలా రిజిస్టర్డ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకోవాలని కర్న్వాల్ చెప్పారు. ఏదైనా చట్టపరమైన పరిహారం తీసుకోవాలంటే, కేటాయింపుదారుల సంఘం ఏర్పాటు చేయడం ద్వారా అది మరింత సరైనదిగా ఉంటుంది. సంఘం సభ్యులు ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నుంచి మంజూరు చేయాలని కోరితే. అప్పుడు, గ్రాంట్ కూడా ఇవ్వవచ్చు ఎందుకంటే RERA చట్టంలోని సెక్షన్లు 73, 74 ప్రకారం, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం RERA అధికారానికి గ్రాంట్ లేదా లోన్ ఇవ్వవచ్చు.

రెరా పర్యవేక్షణలో.. 13 ప్రాజెక్టులు

ఘజియాబాద్‌లోని 3 ప్రాజెక్టుల రద్దుకు ముందే రెరా ఇలాంటి చర్య తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్ రెరా పర్యవేక్షణలో ఇటువంటి 13 గృహ ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. లక్నోలో ఒక ప్రాజెక్ట్, ఘజియాబాద్, నోయిడా,గ్రేటర్ నోయిడాలో 12 ప్రాజెక్టులు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి