LIC: ప్రీమియం కట్టడం మద్యలోనే ఆపేశారా..? కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎల్‌ఐసీ..
వినియోగదారులు డిస్కౌంట్ ఆఫర్‌లో నిలిపివేసిన పాలసీని ప్రారంభించేందుకు ఎల్‌ఐసీ మరోసారి అవకాశం కల్పిస్తోంది. ఈ తగ్గింపు ఆఫర్ కింద
LIC Insurance policy lapse: చాలా మంది వ్యక్తులు ఎల్‌ఐసీ పాలసీని కొనుగోలు చేసి, దాని ప్రీమియంను డిపాజిట్ చేయరు. దీని కారణంగా ఎల్‌ఐసీ పాలసీ ల్యాప్ అవుతుంది. అటువంటి పరిస్థితిలో పాలసీదారుడు డిపాజిట్ చేసిన ప్రీమియం కూడా పొందలేడు. దీంతో వినియోగదారులు అనవసరంగా నష్టపోతున్నారు. అలాంటి వారికి లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. వినియోగదారులు డిస్కౌంట్ ఆఫర్‌లో నిలిపివేసిన పాలసీని ప్రారంభించేందుకు ఎల్‌ఐసీ మరోసారి అవకాశం కల్పిస్తోంది. ఈ తగ్గింపు ఆఫర్ కింద వారి నిలిపివేసిన న పాలసీని పున:ప్రారంభించవచ్చు. ఎలాంటి వారు పునరుద్ధరించగలరో ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం..
ఈ తగ్గింపు ఆఫర్ ఎంతకాలం ఉంటుంది?
యులిప్ ప్లాన్‌లు మినహా అన్ని ఎల్‌ఐసి పాలసీలను ఆలస్య రుసుముతో పునఃప్రారంభించవచ్చని ఎల్‌ఐసి ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఆలస్య రుసుముపై పాలసీదారులకు ప్రత్యేక రాయితీ కూడా ఇస్తోంది. ఈ పథకం 17 ఆగస్టు 2022 నుంచి 21 అక్టోబర్ 2022 వరకు అమలులో ఉంటుందని LIC తెలిపింది.
LIC GIVES A UNIQUE OPPORTUNITY FOR POLICYHOLDERS TO REVIVE THEIR LAPSED POLICIES.#LICI #LIC pic.twitter.com/fItYZsZKry
— LIC India Forever (@LICIndiaForever) August 17, 2022
ఆలస్య రుసుముపై తగ్గింపు
కానీ.. LIC పాలసీలను పునఃప్రారంభించడానికి ఆలస్య రుసుము మాత్రం చెల్లించాలి. కానీ, LIC ఈ ఆఫర్ సమయంలో మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపై పాలసీదారుకు 100 శాతం తగ్గింపును అందిస్తోంది.
ఏ విధానం అమలులో ఉంటుంది ..
LIC ప్రకటన ప్రకారం.. ULIP ప్లాన్‌లు కాకుండా, అన్ని రకాల పాలసీలను పునఃప్రారంభించే అవకాశం ఇచ్చింది. అయితే ఇందులోనూ కొన్ని షరతులు పెట్టారు. అదే విధానాన్ని మళ్లీ ప్రారంభించేందుకు వీలుంటుంది. వీరి ప్రీమియం కనీసం 5 సంవత్సరాల క్రితం డిపాజిట్ అయి ఉండాలి.
ఏ కారణంతోనైనా ప్రీమియం డిపాజిట్ చేయలేని పాలసీదారుల కోసం LIC ఈ తగ్గింపు ఆఫర్‌ను ప్రారంభించింది. పాలసీదారులు తమ నిలిపివేసిన పాలసీలను పునరుద్ధరించుకోవచ్చని ఎల్‌ఐసీ ట్వీట్ చేయడం ద్వారా తెలిపింది.
ప్రీమియంపై తగ్గింపు ఇలా..
LIC ప్రకారం.. ఈ ప్లాన్ కింద పాలసీదారులకు డిస్కౌంట్ ఆఫర్ అందించనున్నారు. మీ పాలసీ ప్రీమియం రూ. 1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఉంటే, మీకు ఆలస్య రుసుములో 25% రాయితీ ఇస్తారు. గరిష్ట తగ్గింపు రూ.2,500. ప్రీమియం రూ. 1 నుంచి 3 లక్షల మధ్య ఉంటే తగ్గింపు మొత్తాన్ని రూ.3,000గా నిర్ణయించారు. పాలసీ ప్రీమియం రూ. 3 లక్షల కంటే ఎక్కువ ఉంటే దానిపై రూ.3,500 వరకు తగ్గింపు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి